IT Student Success Story : చిన్న కాలేజీలో చదువు.. రూ.60 లక్షల ప్యాకేజితో పెద్ద స్థాయి ఉద్యోగం.. ఎలా అంటే...?
తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాలను నిజం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము కన్న కలల్ని నిజం చేసుకునేందుకు అహర్నిషలు కష్టపడి చదువుతూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో చాలా మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో రికార్డ్ స్థాయి వేతనాలను అందుకుంటున్న వార్తలను మనం చూస్తున్నాం. చదువు పూర్తి కాకుండానే కొందరు, పూరైన తరువాత మరికొందరు లక్షల్లో ప్యాకేజీలను అందుకొని సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యువతి 60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది. ఈ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె సక్సెస్ స్టోరీ మీకోసం..
ఏకంగా రూ.60 లక్షల ప్యాకేజీతో..
బీహార్‌కు చెందిన అలంక్రిత సాక్షి అనే యువతి.. ఓ సాధారణ కాలేజీలో బీటెక్ డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం ఎర్నెస్ట్ అండ్ యంగ్, విప్రో, సామ్‌సంగ్ వంటి కంపెనీల్లో పనిచేసింది. ఈ కంపెనీల్లో రెండు, మూడేళ్ల అనుభవం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల అలంక్రిత సాక్షి ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ లో దరఖాస్తు చేసింది. తాజాగా ఈ సంస్థ సాక్షిని ఎంపిక చేసినట్లు తెలిపింది. అంతేకాక ఈమెకు ఏకంగా సంవత్సరానికి రూ.60 లక్షల ప్యాకేజీ వరించింది.
గూగుల్, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల్లో...
గూగుల్‌లో సెక్యూరిటీ అనలిస్ట్‌గా తనకు ఉద్యోగం వచ్చిందని అలంక్రిత సాక్షి తెలిపింది. ఈ విషయాన్ని లింక్డ్ ఇన్ లో ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది. తనకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఒక మంచి డైనమిక్ టీమ్ తో పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. తాను ఇంతటి సక్సెస్ అందకునే ప్రయత్నంలో సహకరించిన ప్రతీ ఒక్కరికి అలంక్రిత సాక్షి ధన్యవాదాలు తెలిపింది. తన కొత్త ప్రయాణం ఇప్పుడు మొదలుకాబోతుందని ఆమె వెల్లడించింది. గూగుల్, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీల్లో జాబ్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అనుభవం ఉన్న వారితో పాటు క్యాంపస్ ప్లేస్ మెంట్లలోనూ పెద్ద పెద్ద కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇచ్చి జాబ్స్ ఇస్తూ ఉంటాయి.
ఐఐటీ, ఐఐఏంలో చదవకపోయినప్పటికీ...
అదే విధంగా తాజాగా అలంక్రిత సాక్షి కూడా ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో గూగుల్ జాబ్ సాధించింది. అంతేకాక తన సక్సెస్‌తో యువతకు స్ఫూర్తిగా నిలించింది. ఇక ఆమె సాధించిన విజయంపై తోటి స్నేహితులు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ ఉంటే చాలు.. ఐఐటీ, ఐఐఏంలో చదవకపోయినప్పటికీ.. ఆ స్థాయి విద్యార్థులు ధీటుగా సాక్షి అదిరిపోయే ప్యాకెజీ సొంతం చేసుకుంది. సాక్షి జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.
Tags
- it student sakshi got bagged 60 lakhs salary
- it student sakshi got bagged 60 lakhs salary news in telugu
- IT Student Success Story
- Bihar Alankrita Sakshi has bagged 60 lakh salary job
- Bihar Alankrita Sakshi has bagged 60 lakh salary job news telugu
- Alankrita Sakshi
- IT Jobs Holder Alankrita Sakshi
- IT Jobs Holder Alankrita Sakshi Story
- Software Jobs
- it jobs
- it jobs updates
- Bihar Alankrita Sakshi has bagged a job in Google
- Bihar Alankrita Sakshi has bagged a job in Google news telugu
- women inspired success stories
- sakshieducation success stories