Skip to main content

Success Story : రూ.60 లక్షల జీతంతో జాబ్ కొట్టా.. 67,000 మందిని ఓడించి.. ఎలా అంటే..?

చాలా మంది మంచి జీతంతో.. ఉన్న‌త‌స్థానంలో ఉండాలి అనుకుంటారు. దీని కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి.. వ‌చ్చిన అవ‌కాశంను అందిపుచ్చుకుంటారు. కొంద‌రైతే ఊహించ‌ని దానిక‌న్నా ఉన్న‌త ఉద్యోగం సాధించి.. ఎక్కువ శాల‌రీ కూడా తీసుకుంటారు.
Muskan Agrawal Bagged A Rs 60 Lakh Per Annum Job News Telugu

స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన వారు ముస్కాన్ అగర్వాల్. ఈ ముస్కాన్ అగర్వాల్ ఐఐఐటీ యునలో రికార్డ్‌ సృష్టించింది. ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో ప్రముఖ టెక్‌ దిగ్గజం లింక్డిన్‌లో ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా లింక్డిన్‌ విధులు నిర్వహిస్తుంది. ఇందులో ఈమె  విష‌యం ఏముంది అనుకుంటున్నారు.. ? ఈ ఉద్యోగం ఈమె ఎలా సాధించి ఉంటుంది అనుకుంటున్నారా..? అయితే మీకు ఈ కింది స్టోరీ చ‌ద‌వాల్సిందే..

దేశంలోనే టాప్‌..

it jobs 2023 news telugu

సాఫ్ట్‌వేర్‌ కొలువంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి. అలాంటి కోడింగ్‌లో ఈమె దిట్ట. గత ఏడాది అగర్వాల్ ‘టెక్ గిగ్ గీక్ గాడెస్ 2022’ కోడింగ్ పోటీల్లో పాల్గొన్న 67,000 కంటే ఎక్కువ మంది మహిళా కోడర్‌లను ఓడించింది. విజేతగా నిలిచి దేశంలోనే ‘టాప్‌ ఉమెన్‌ కోడర్‌’గా నిలిచారు. టెక్‌గిగ్‌ గీక్‌ గాడెస్‌ఈవెంట్‌లో ఫైనలిస్టులు ప్రోగ్రామింగ్ సొల్యూషన్‌ల కోసం నాలుగు గంటల పాటు కోడ్‌లను రాసింది. ఫలితంగా ఆమె రూ.1.5 లక్షలు బహుమతి సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు ముస్కాన్‌ అగర్వాల్ లింక్డిన్‌లో మెంటార్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఎంపికైన 40 మంది మహిళల్లో ఆమె కూడా ఒకరు. ఈ మెంటార్‌ షిప్‌లో లింక్డిన్‌ నిపుణులు ఆయా విభాగాల్లో మెంటర్‌ షిప్‌కు సెలక్ట్‌ అయిన వారికి తగిన సలహాలు అందిస్తారు.

☛ Success Story: ఒక్క పూటకు కూడా తిండికి లేని స్థితి నాది.. ఇప్పుడు నెలకు ఏకంగా రూ.5 లక్షలు సంపాదిస్తున్నానిలా..

సంవత్సరానికి రూ.1 కోటి కంటే ఎక్కువ వేతనాలతో..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే గ్రాడ్యుయేట్ 2022-23 బ్యాచ్ నుంచి వార్షిక ప్లేస్‌మెంట్‌లలో సంవత్సరానికి రూ.3.67 కోట్ల జీతంతో అంతర్జాతీయ కంపెనీల్లో జాబ్‌ ఆఫర్‌ దక్కించుకున్నారు. దేశీయ ప్లేస్‌మెంట్‌లో ఓ విద్యార్ధి అత్యధికంగా ఏడాదికి రూ.1.68కోట్ల ప్యాకేజీని పొందాడు.

☛ Samhita Microsoft Job Rs.52 lakh Salary :లక్కీ ఛాన్స్ అంటే ఈమెదే.. ప్ర‌ముఖ కంపెనీలో జాబ్.. రూ. 52 లక్షల జీతం.. ఎలా అంటే..?

16 మంది గ్రాడ్యుయేట్లు సంవత్సరానికి రూ.1 కోటి కంటే ఎక్కువ వేతనాలతో ఉద్యోగ ఆఫర్‌లను అంగీకరించగా, 2022-23 ప్లేస్‌మెంట్ సీజన్‌లో 65 మంది విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయి. అమెరికా, జపాన్, యూకే , నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్‌లలోని వివిధ కంపెనీల్లో ఎంపికైన విద్యార్ధులు విధులు నిర్వహించనున్నారు.

 Success Story : నాడు క్లాసురూమ్ నుంచి బయటికి వ‌చ్చా.. నేడు వేల కోట్లు సంపాదించా..!

Published date : 08 Jan 2024 05:58PM

Photo Stories