SI Inspirational Story : నా చిన్నతనంలోనే నాన్న మరణం.. అమ్మ కష్టంతో.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
పేదలకు చదువే ఒక బలమైన ఆయుధం అని నిరూపించాడు. ఇతనే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వలేటివారిపాళెం మండలం పోలినేనివారిపాళెం గ్రామానికి చెందిన ఏడుకొండలు. ఈ నేపథ్యంలో ఎస్ఐ ఉద్యోగం సాధించిన ఏడుకొండలు సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
ఏడుకొండలు.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వలేటివారిపాళెం మండలం పోలినేనివారిపాళెం గ్రామానికి చెందిన వారు. నేలకూరి వెంకటేశ్వర్లు, సుశీల కుమారుడు ఏడుకొండలు. ఏడుకొండలు తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. తల్లి కష్టపడి చదివించింది. అతను ఇటీవల విడుదలైన ఎస్సై ఫలితాల్లో 398వ ర్యాంక్ సాధించాడు.
☛ Inspiration Story: భర్త కానిస్టేబుల్.. భార్య ఐపీఎస్.. 10వ తరగతి కూడా చదవని భార్యను..
ఎడ్యుకేషన్ :
ఏడుకొండలు.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 8వ తరగతి నుంచి 10 వరకు కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీటీసీ సింగరాయకొండ పీఎన్‌సీఏలో పూర్తి చేశాడు.
రెండుసార్లు డీఎస్సీలో ఫెయిల్.. కానీ..
ఏడుకొండలు.. ఉపాధ్యాయ పోస్ట్ సాధించాలని కోచింగ్ తీసుకొని రెండుసార్లు డీఎస్సీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం దక్కలేదు. అనంతరం ఆర్థిక పరిస్థితులతో చదువు కొనసాగించలేక, ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు.
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
ప్రతి నెలా కోచింగ్, మెస్ ఫీజుల కోసం..
తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాధ్యతంతా తల్లి మీదే పడింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసుకుని కాకినాడలో కోచింగ్‌కు వెళ్లాడు. తల్లి ప్రతి నెలా కోచింగ్, మెస్ ఫీజులకు నగదు పంపేది. ఏడుకొండలు పరిస్థితిని గమనించి గ్రామానికి చెందిన అనుమోలు రవీంద్ర, మాదాల లక్ష్మీనరసింహం ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు.
నా ఆయుధం ఇదే.. : నేలకూరి ఏడుకొండలు
కష్టాలు ఉన్నాయని కుంగిపోతే చదువుకోలేం. ఇష్టపడి చదవాలి. తల్లి రెక్కల కష్టం నాకు తెలిసొచ్చింది. అందుకే పట్టుదలతో చదివి ఎస్సై పోస్టు సాధించాను. పేదలకు చదువే ఒక బలమైన ఆయుధం.
☛ AP SI Ranker Success Story : ఇలా చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించా.. కానీ..
➤☛ AP SI Topper Chandana Success Story : ఈ సక్సెస్ సీక్రెట్ ఫాలో అయ్యే.. ఎస్ఐ ఉద్యోగం కొట్టా..
Tags
- si inspirational story of andhra pradesh
- SI Success Stories
- su success story in telugu
- si success story in telugu
- success story in telugu
- Inspire
- motivational story in telugu
- si success story
- motivational story
- mother inspire story
- EducationJourney
- SupportiveFamily
- ChildhoodChallenges
- inspiring journey
- sakshi education success story