Skip to main content

AP Police Constable Jobs 2024 Update News : 6,100 కానిస్టేబుల్‌ పోస్టులపై అప్‌డేట్ న్యూస్ ఇదే.. ఈ నియామకాలను...

సాక్షి ఎడ్యుకేష‌న్ : 2022 నవంబరులో 6,100 పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఉద్యోగాల‌కు 4.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
AP 6100 Police Constable Jobs 2024 Events Dates  Police recruitment notification November 2022 AP Police constable recruitment update Fitness test schedule for police constable jobs AP Police Recruitment Board announcement 6,100 police constable jobs notification update

2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్‌ రాత పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటిస్తూ... 95,208 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అర్హులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు మార్చి 13 నుంచి 20 వరకూ నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి హాల్‌ టికెట్లు జారీ చేశారు. కానీ.. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ప్రక్రియను వాయిదా పడింది. 

➤☛ Constable Jobs Notification 2024 :  భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..? ఇవి ఫాలో అయితే ఉద్యోగం మీదే..!

వివాదం మొదలైంది ఇక్క‌డే..
అయితే.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లో సివిల్‌ హోం గార్డులకు 15 శాతం, ఏపీఎస్పీ హోం గార్డులకు 25 శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది. దాంతో వివాదం మొదలైంది. దీంతో కొంద‌రు కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వ మార్పు జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం కానిస్టేబుల్‌ నియామకాలను పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

➤☛ Government Jobs Applications 2024 : 55000ల‌కు పైగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీలు ఇదే..!

➤☛ 40000 Above Central Government Jobs 2024 : నిరుద్యోగులకు పండ‌గే పండ‌గ‌.. మ‌రో 40000ల‌కు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..! వివ‌రాలు ఇవే..

ఆగిన 6,100 పోలీస్‌ కానిస్టేబుల్ నియామకాలను..
న్యాయనిపుణుల సహకారంతో న్యాయమైన చిక్కులను తప్పించి.. ఆగిన 6,100 పోలీస్‌ కానిస్టేబుల్ నియామకాలను ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. త్వ‌ర‌లోనే ఫిట్‌నెస్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్ర‌క్రియ ముందుకు సాగుతుందో లేదో అనే అనుమానంలో అభ్య‌ర్థులు ఉన్నారు.

Published date : 27 Aug 2024 01:31PM

Photo Stories