Skip to main content

40000 Above Central Government Jobs 2024 : నిరుద్యోగులకు పండ‌గే పండ‌గ‌.. మ‌రో 40000ల‌కు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..! వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ కేంద్రీయ విద్యాలయల‌ల్లో భారీగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను ఆగ‌స్టు చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌నున్నారు.
KVS Jobs 2024 Notification 40000 jobs notifications

కేంద్రీయ విద్యాలయ సంగతన్ త్వరలోనే 40 వేలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయ‌నున్నారు.

పోస్టుల వివ‌రాలు ఇవే..
ఇందులో టీజీటీ, పీజీటీ , క్లర్క్, ప్యూన్ మొద‌లైన‌ పోస్టులు ఉండనున్నాయి. 
గత ఏడాది 13000 పోస్టులను భ‌ర్తీ చేసి విష‌యం తెల్సిందే. అలాగే ఏడాది కూడా కేంద్రీయ విద్యాలయ సంగతన్ మరోసారి భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ కోసం సిద్ధం అవుతోంది.

అర్హ‌తలు ఇవే..

KVS Jobs news 2024

కేంద్రీయ విద్యాలయ సంగతన్‌లోని ఉద్యోగాల‌కు గుర్తింపు పొందిన పాఠశాల, కాలేజీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు.., డిప్లొమా, D.El.Ed, గ్రాడ్యుయేట్ లేదా BEd డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

➤☛ టీజీటీ (TGT) ఉద్యోగాల‌కు.. అభ్యర్థి తప్పనిసరిగా 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ అర్హ‌త‌ ఉండాలి. 
➤☛ పీజీటీ (PGT) ఉద్యోగాల‌కు అభ్య‌ర్థి.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ➤☛ PRTకు అభ్యర్థి ప్రాథమిక విద్యలో రెండేళ్ల డిప్లొమాతో సీనియర్ సెకండరీ పరీక్షలో కనీసం 50% మార్కులను కలిగి ఉండాలి.

ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..
కేంద్రీయ విద్యాలయ సంగతన్‌లో రిక్రూట్‌మెంట్ కోసం ఎంత దరఖాస్తు రుసుము చెల్లించాలి అనే సమాచారం నోటిఫికేషన్ తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటుంది. గత రిక్రూట్‌మెంట్‌లో జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1500/-.  ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఉచితం.

ఈ ఉద్యోగాల‌ను ఎలా ఎంపిక చేస్తారంటే..?

KVS Jobs 2024

కేంద్రీయ విద్యాలయల పీజీటీ (PGT), టీజీటీ(TGT), పీఆర్‌టీ(PRT)తో సహా ఇతర ఉద్యోగాల నియామకాల‌కు రాత ప‌రీక్ష‌, ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ త‌ర్వాత ఉద్యోగంకు ఎంపిక చేస్తారు. పూర్తి వివ‌రాలను kvsangathan.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

అర్హతలు, వేతనం ఇలా..: 

➤☛ ప్రైమరీ టీచర్స్‌ : ఇంటర్మీడియెట్‌తోపాటు 50 శాతం మార్కులతో డీఈడీ లేదా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు సీటెట్‌ పేపర్‌-1లో అర్హత సాధించాలి. వయసు: 30ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.35,400-రూ.1,12,400

➤☛ ప్రైమరీ టీచర్స్‌-మ్యూజిక్‌ : 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు మ్యూజిక్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.35,400-రూ.1,12,400

➤☛ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ : సంబంధిత సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్‌లో 50 శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.47,600-రూ.1,51,100

➤☛ ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ : సంబంధిత సబ్జెక్ట్‌తో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. బీఈడీ పూర్తిచేయడంతోపాటు సీటెట్‌ పేపర్‌-2లో అర్హత సాధించాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.44,900-రూ.1,42,400

నాన్‌-టీచింగ్‌ పోస్ట్‌లు, అర్హతలు ఇలా..

  • అసిస్టెంట్‌ కమిషనర్‌(52 పోస్ట్‌లు); అర్హత: 45 శా తం మార్కులతో పీజీతోపాటు, బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. ప్రిన్సిపల్‌ హోదాలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 50 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.78,800-రూ.2,09,200
  • ప్రిన్సిపల్‌(239 పోస్ట్‌లు); అర్హత: 45 శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఎనిమిదేళ్ల వ్యవధిలో పీజీటీ లేదా వైస్‌ ప్రిన్సిపల్‌ హోదాలో అనుభవం. వయసు: 35-50 ఏళ్ల మధ్య ఉండాలి. వేతన శ్రేణి: రూ.78,800-రూ.2,09,200
  • వైస్‌ ప్రిన్సిపల్‌(203 పోస్ట్‌లు); అర్హత: 50 శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. వైస్‌ ప్రిన్సిపల్‌ హోదాలో రెండేళ్లు లేదా పీజీటీ/లెక్చరర్‌ హోదాలో ఆరేళ్లు లేదా పీజీటీ/టీజీటీ/లెక్చరర్‌ హోదాల్లో కలిపి పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35-45 ఏళ్ల మధ్య ఉండాలి. వేతన శ్రేణి: రూ.56,100-1,77,500
  • లైబ్రేరియన్‌(355 పోస్ట్‌లు); అర్హత: లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్‌ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.44,900-1,42,400
  • ఫైనాన్స్‌ ఆఫీసర్‌(6 పోస్ట్‌లు); అర్హత: 50 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణత తోపాటు ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ వర్క్స్‌లో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. లేదా 50 శాతం మార్కులో ఎంకాం ఉత్తీర్ణతతోపాటు ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ వర్క్స్‌లో మూడేళ్ల అనుభవం లేదా సీఏ(ఇంటర్‌)/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్‌)/ఎంబీఏ(ఫైనాన్స్‌) లేదా పీజీడీఎం(ఫైనాన్స్‌) ఉత్తీర్ణతతోపాటు ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ వర్క్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.44,900-1,42,400
  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌-2 పోస్ట్‌లు); అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ తోపాటు రెండేళ్ల పని అనుభవం లేదా సివిల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ. 44,900-1,42,400
  • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(156 పోస్ట్‌లు); అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ శాఖలు/ప్రభుత్వ రంగ సంస్థల్లో యూడీసీ హోదాలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ. 35,400 -1,12,400
  • హిందీ ట్రాన్స్‌లేటర్‌(11 పోస్ట్‌లు); అర్హత: హిందీ/ఇంగ్లిష్‌ స్పెషలైజేషన్‌తో పీజీ ఉతీర్ణత ఉండాలి. దీంతోపాటు అభ్యర్థులు పీజీలో హిందీ లేదా ఇంగ్లిష్‌ను ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గా చదివుండాలి. వయసు: 35 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.35,400 -1,12,400
  • సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(322 పోస్ట్‌లు); అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రభుత్వ శాఖలు లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్‌డీసీ హోదాలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.25,500 -81,100
  • జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(702 పోస్ట్‌లు); అర్హత: ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్‌ స్కిల్‌ ఉండాలి. వయసు: 27 ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.19,900-రూ.63,200
  • స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2(54 పోస్ట్‌లు); అర్హత: ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణతతోపాటు షార్ట్‌ హ్యాండ్‌ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 27ఏళ్లు మించరాదు. వేతన శ్రేణి: రూ.25,500 -81,100.

తొలి దశ రాత పరీక్ష :

  • అన్ని పోస్ట్‌లకు సంబంధించి తొలి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ముందుగా టీచింగ్‌ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్ష వివరాలు..
  • ప్రైమరీ టీచర్స్‌: ఈ పోస్ట్‌లకు 180 మార్కులకు నాలుగు విభాగాల్లో పరీక్ష జరుగుతుంది. పార్ట్‌-1(జనరల్‌ ఇంగ్లిష్‌-10 ప్రశ్నలు; జనరల్‌ హిందీ-10 ప్రశ్నలు); పార్ట్‌-2 (జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌-10 ప్రశ్నలు; రీజనింగ్‌ ఎబిలిటీ-5 ప్రశ్నలు; కంప్యూటర్‌ లిటరసీ-5 ప్రశ్నలు); పార్ట్‌-3(అండర్‌ స్టాండింగ్‌ ద లెర్నర్‌-15 ప్రశ్నలు; అండర్‌ స్టాండింగ్‌ టీచింగ్‌ లెర్నింగ్‌-15 ప్రశ్నలు; క్రియేటింగ్‌ కండక్టివ్‌ లెర్నింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌-10 ప్రశ్నలు, స్కూల్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ లీడర్‌షిప్‌-10 ప్రశ్నలు; పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌-10 ప్రశ్నలు); పార్ట్‌-4 సంబంధిత సబ్జెక్ట్‌(80 ప్రశ్నలు).
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌: ఈ పరీక్ష కూడా 180 మార్కులకు జరుగుతుంది. పార్ట్‌-1(జనరల్‌ ఇంగ్లిష్‌-10 ప్రశ్నలు; జనరల్‌ హిందీ-10 ప్రశ్నలు), పార్ట్‌-2(జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌-10 ప్రశ్నలు; రీజనింగ్‌ ఎబిలిటీ-5 ప్రశ్నలు; కంప్యూటర్‌ లిటరసీ-5 ప్రశ్నలు); పార్ట్‌-3(అండర్‌ స్టాండింగ్‌ ద లెర్నర్‌-15 ప్రశ్నలు; అండర్‌ స్టాండింగ్‌ టీచింగ్‌ లెర్నింగ్‌-15 ప్రశ్నలు; క్రియేటివ్‌ కండక్టివ్‌ లెర్నింగ్‌ ఎన్విరాన్‌మెంట్, స్కూల్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ లీడర్‌షిప్, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌-10 ప్రశ్నలు); పార్ట్‌-4 సంబంధిత సబ్జెక్ట్‌-100 ప్రశ్నలు.
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌: ఈ పోస్ట్‌ల రాత పరీక్షకు కేటాయించిన మార్కులు 180. పార్ట్‌-1(జనరల్‌ ఇంగ్లిష్‌-10 ప్రశ్నలు; జనరల్‌ హిందీ-10 ప్రశ్నలు); పార్ట్‌-2 (జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌-10 ప్రశ్నలు, రీజనింగ్‌ ఎబిలిటీ-5 ప్రశ్నలు; కంప్యూటర్‌ లిటరసీ-5 ప్రశ్నలు); పార్ట్‌-3 (అండర్‌స్టాండింగ్‌ ద లెర్నర్‌-10 ప్రశ్నలు, అండర్‌స్టాండింగ్‌ టీచింగ్‌ లెర్నింగ్‌-15 ప్రశ్నలు; క్రియేటివ్‌ కండక్టివ్‌ లెర్నింగ్‌ ఎన్విరాన్‌మెంట్, స్కూల్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ లీడర్‌షిప్, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌-15 ప్రశ్నలు); పార్ట్‌-4 సంబంధిత సబ్జెక్ట్‌-100 ప్రశ్నలు.

డెమో, ఇంటర్వ్యూ ఇలా..

  • కేంద్రీయ విద్యాలయాల్లో భర్తీ చేయనున్న అన్ని పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రొఫెషనల్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ పేరుతో తదుపరి దశలో డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటికి నిర్దిష్టంగా మార్కులు కూడా కేటాయిస్తారు.
  • పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్, లైబ్రేరియన్‌ పోస్ట్‌లకు 60 మార్కులకు(డెమోకు 30 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు) నిర్వహిస్తారు.
  • నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌లకు సంబంధించి కూడా రాత పరీక్షతోపాటు అసిస్టెంట్‌ కమిషన్‌ పోస్ట్‌లకు 20 మార్కులకు ఇంటర్వ్యూ; ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్ట్‌లకు 30 మార్కులకు ఇంటర్వ్యూతోపాటు, మరో 30 మార్కులకు స్కూల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ ప్రజెంటేషన్‌కు కేటాయిస్తారు.
  • హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్ట్‌లకు 90 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు ఇంటర్వ్యూ ఉండదు.

వెయిటేజీ విధానంలో తుది ఎంపిక :

కేంద్రీయ విద్యాలయ పోస్ట్‌ల తుది విజేతల ఎంపికలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నారు. టీచింగ్‌ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో ప్రతిభకు 70 మార్కులు; డెమో, ఇంటర్వ్యూలలో ప్రతిభకు 30 మార్కుల వెయిటేజీని నిర్దేశించారు. నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షలో ప్రతిభకు 80 మార్కులు, ఇంటర్వ్యూలో ప్రతిభకు 20 మార్కులు వెయిటేజీని నిర్ధారించారు. అభ్యర్థులు ఈ రెండు విభాగాల్లో పొందిన మార్కులను గణించి తుది జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.

సబ్జెక్ట్‌ నుంచి సమకాలీనం వరకు..

  • ఆయా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్షలో విజయానికి సబ్జెక్ట్‌ నాలెడ్జ్, విద్యా దృక్పథాలు, పెడగాజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, శిశు వికాసం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం-నాయకత్వం-గైడెన్స్‌-కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. 
  • చైల్డ్‌ సైకాలజీ, కరిక్యులమ్‌ ఆర్గనైజేషన్, లెసన్‌ ప్లాన్, ఇన్‌స్ట్రక్షనల్‌ మెటీరియల్స్, విద్యా దృక్పథాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 
  • నాన్‌-టీచింగ్‌ పోస్ట్‌ల అభ్యర్థులు తమ విభాగాలకు సంబంధించి బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అభ్యసనం చేయాలి.

Published date : 12 Aug 2024 05:52PM

Photo Stories