Top 5 Highest Paying Government Jobs in India : దేశంలో ఎక్కువ జీతం వచ్చే.. టాప్-5 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే.. ఈ జాబ్స్ రావాలంటే..?
అధిక జీతాలు వేతనాలతో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. కొన్నిసార్లు చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు నెలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ జీతం ప్యాకేజీ ఉన్న జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యధిక జీతం వచ్చే టాప్-5 ప్రభుత్వ ఉద్యోగాలు కింది ఇచ్చిన వాటిలో చూడండి.
1. ఆర్‌బీఐ (RBI) గ్రేడ్ B ఆఫీసర్ వేతనాలు ఇలా.. :
ద్రవ్య విధానాల రూపకల్పనలో ఆర్‌బీఐ (RBI) గ్రేడ్ B అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే వీరు బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. వీరు ఆర్థిక సమాచారాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటారు. కరెన్సీ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ పోస్ట్ కోసం అభ్యర్థి 60% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. SC/ ST/ PwBD అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి. ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఎంపిక విషయంలో పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. RBI గ్రేడ్ B అధికారులకు నెలకు 55,200 నుంచి 85,550. ఉన్నత ర్యాంక్‌లకు పదోన్నతి పొందే వరకు.., 16 సంవత్సరాల సర్వీస్ తర్వాత వేతనం రూ.99,750 అవుతుంది. కొన్ని సందర్భాల్లో వీరి వార్షిక వేతనం 25 లక్షలకు చేరుకుంటుంది.
☛ IAS Officer Success Story : ఈ మైండ్ సెట్‌తోనే.. ఐఏఎస్.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
2. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ శాలరీ ఇలా.. :
విదేశాలలో భారతదేశ దౌత్యపరమైన ప్రాతినిధ్యం, దౌత్య సంబంధాలు, ఆర్థిక మార్పిడి, సాంస్కృతిక సంబంధాలకు IFS అధికారులు కీలక బాధ్యత వహిస్తారు. వీరు ఒప్పందాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అలాగే వీరు విదేశాలలో మన పౌరులను రక్షించారు. ఈ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ, CSE ఉత్తీర్ణత తప్పనిసరి. విదేశీ భాషల పరిజ్ఞానం ఉండాలి. మంచి విశ్లేషణాత్మక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్లస్‌గా పరిగణించబడతాయి. IFS అధికారులకు రూ.56,100 నుంచి రూ.2,25,000 వరకు జీతాలు ఉంటాయి. అధికారి ర్యాంక్.., సర్వీస్ ఆధారంగా ఎక్కువ జీతాలు ఉంటాయి.
3. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి జీతం ఇలా..
విస్తారమైన అటవీ విస్తీర్ణం కలిగిన భారతదేశంలోని అడవుల రక్షణ.., పరిరక్షణ బాధ్యత IFS అధికారులదే. అటవీ, వన్యప్రాణులు, పరిరక్షణ, వన్యప్రాణుల ఆవాసాల రక్షణ, అక్రమ చెట్ల నరికివేతను అరికట్టడం, అటవీ నిర్మూలన విధానాన్ని అమలు చేయడం వారి బాధ్యతలలో కొన్ని. ఈ ఉద్యోగం కోసం ఫారెస్ట్రీ, అగ్రికల్చర్ లేదా ఇంజనీరింగ్ వంటి సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇందుకు ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరం. డెహ్రాడూన్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో రెండు సంవత్సరాల శిక్షణ కూడా ఉన్నాయి. IFS అధికారులు నెలకు 56,000 నుంచి రూ. 2 లక్షల వరకు వేతనం పొందుతారు. ఇది అత్యధికంగా చెల్లించే ప్రభుత్వ పోస్టులలో ఒకటిగా నిలిచింది.
4. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ (ఐఏఎస్) జీతం ఎంతంటే...:
దేశ పరిపాలనకు ఐఏఎస్ అధికారులు వెన్నెముక. వారు విధి.. విధానాలను రూపొందిస్తారు. వాటిని అమలు చేస్తారు. అలాగే వీరు ప్రజల నుంచి వివిధ ఫిర్యాదులను నిర్వహిస్తారు. విపత్తుల సమయంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఈ ఉద్యోగం రావాలంటే.. అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ. అర్హత ఉండాలి. అలాగే UPSC నిర్వహించే CSEలో ఉత్తీర్ణులై ఉండాలి. ఐఏఎస్ అధికారులు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతారు. వీరికి మొదట జీతం నెలకు సుమారుగా 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఇందులో ర్యాంక్.. సర్వీస్ ప్రకారం జీతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీరికి వసతి, కారు, వైద్య సదుపాయాలు మొదలైన అలవెన్సులు ఉంటాయి.
5. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త జీతం ఎంతంటే..?
ఇస్రో శాస్త్రవేత్తలు భారతదేశ అంతరిక్ష విజ్ఞానం.. సాంకేతికతలో అత్యాధునికమైన అంచున ఉన్నారు. వీరు పరిశోధన, అంతరిక్ష నౌక, ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాల రూపకల్పన, అంతరిక్ష కార్యకలాపాల నిర్వహణకు కూడా బాధ్యత వహిస్తారు. ఈ ఉద్యోగం రావాలంటే.. అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో యూనివర్సిటీ డిగ్రీ అర్హత ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ లేదా పీహెచ్‌డీ అదనపు ప్రయోజనం. అభ్యర్థులు రాత పరీక్ష.., ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. ఈ విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఉద్యోగి స్థానం .., అనుభవాన్ని బట్టి దాదాపు రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జీతం సంపాదించే అవకాశం ఉంది.
UPSC Civils Ranker Ravula Jayasimha Reddy : ఐపీఎస్ టూ ఐఏఎస్.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే..
Tags
- IAS Officer Salary
- ias officer salary slip
- rbi grade b officer salary
- rbi grade b officer salary news telugu
- telugu news rbi grade b officer salary
- indian foreign officer salary
- indian foreign officer salary details in telugu
- telugu news indian foreign officer salary
- indian foreign officer eligibility
- indian foreign officer eligibility in telugu
- indian foreign service salary
- indian foreign service salary details in telugu
- indian forest officer salary per month
- indian forest officer salary per month news telugu
- news telugu indian forest officer salary per month
- India Top 5 Highest Paying Government Jobs Details in Telugu News
- India Top 5 Highest Paying Government Jobs
- India Top 5 Highest Paying Government Jobs News in Telugu
- India Top Highest Paying Government Jobs News in Telugu
- top high salary government jobs in india
- best government jobs in india
- best government jobs in india news telugu
- central government jobs after graduation
- central government jobs after graduation news telugu
- telugu news central government jobs after graduation news telugu
- India Top 5 Highest Paying Government Jobs Details List
- India Top 5 Highest Paying Government Jobs Details List news telugu