Skip to main content

AI Airport Services Jobs 2024 : గుడ్‌న్యూస్.. ఎయిర్ పోర్టులో 3,256 ఉద్యోగాలు అర్హ‌త‌లు, ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) 3,256 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
AI Airport Services Jobs 2024 Interviews

ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిన మూడేళ్ల కాలపరిమితికి ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టును బ‌ట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

పోస్టును అనుసరించి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు దరఖాస్తు ఫీజు రూ.500 ఉంటుంది. అలాగే ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు ఇంటర్వ్యూల‌ను  2024 జూలై 12, 13, 14, 15, 16 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కింది ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

ఇంటర్వ్యూ అడ్ర‌స్ : 
జీఎస్‌డీ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎస్‌ఎంఐ విమానాశ్రయం, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబయి అడ్ర‌స్‌లో ఈ ఇంటర్వ్యూల‌ను నిర్వ‌హించ‌నున్నారు. 

3,256 పోస్టుల వివరాలు ఇవే..:

➤ హ్యాండీమ్యాన్ (మేల్‌): 2216
➤ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 406
➤ యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్: 263
➤ జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 91
➤ జూనియర్ ఆఫీసర్- కార్గో: 56
➤ జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 45
➤ డ్యూటీ ఆఫీసర్- ప్యాసింజర్: 42
➤ డ్యూటీ మేనేజర్- ర్యాంప్: 40
➤ యుటిలిటీ ఏజెంట్లు (మేల్‌): 22
➤ డ్యూటీ మేనేజర్- ప్యాసింజర్: 19
➤ డ్యూటీ ఆఫీసర్- కార్గో: 19
➤ డ్యూటీ మేనేజర్- కార్గో: 11
➤ డిప్యూటీ టెర్మినల్ మేనేజర్- ప్యాసింజర్: 09
➤ డిప్యూటీ ర్యాంప్ మేనేజర్: 06
➤ డిప్యూటీ టెర్మినల్ మేనేజర్- కార్గో: 03
➤ పారా మెడికల్ కం కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 03
➤ టెర్మినల్ మేనేజర్- ప్యాసింజర్: 02
➤ ర్యాంప్ మేనేజర్: 02
➤ టెర్మినల్ మేనేజర్- కార్గో: 01

మొత్తం పోస్టుల సంఖ్య : 3,256

Published date : 03 Jul 2024 07:02PM

Photo Stories