Good news for Government Employees : దీపావళి పండగకు గుడ్‌న్యూస్... ఉద్యోగులకు కానుకగా... !
సాక్షి ఎడ్యుకేషన్ : ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు డీఏ(డియర్‌నెస్ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్(డియర్‌నెస్ రిలీఫ్)ను మూడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 45 శాతానికి చేరింది. ఈ పెంపు జులై 1, 2024 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్ వేతనం అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగికి అదనంగా రూ.540 పెంపు ఉంటుందని అంచనా. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్(డియర్‌నెస్ రిలీఫ్)లో మార్పులు చేస్తుంటుంది.
దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్-నవంబర్ సమయంలో రెండోసారి...
ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి, దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్-నవంబర్ సమయంలో రెండోసారి ప్రకటిస్తారు. అందులో భాగంగానే ఈ నెల చివరివారంలో దీపావళి ఉండడంతో డీఏ పెంపును ప్రకటించినట్లు తెలిసింది.
డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు...
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించారు. దీపావళి పండగ సీజన్‌కు ముందు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3.9 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచి అమలు కానుందని పేర్కొన్నారు.
➤☛ TS Govt Jobs Recruitment 2024 : 60000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇలా..
☛➤ Good News For Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వీరికి దసరా కానుకగా...
Tags
- Diwali Festival Good News for Government Employees
- diwali festival 2024
- central government employees da hike
- central government employees da hike news telugu
- telugu news central government employees da hike news telugu
- How much DA hike will central government employees get
- How much DA hike will central government employees news telugu
- DA hike
- DA Hike Expected For Central Government Employees News in Telugu
- DA Hike Expected For Central Government Employees
- DA Hike Expected For Central Government Employees News
- central government employees news latest da update
- central government
- central government employees news 2023
- da hike news telugu
- da hike for central govt employees
- da hike for central govt employees news telugu
- telugu news da hike for central govt employees news telugu