Skip to main content

Powergrid Jobs Notification 2024 : పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 802 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌... నెలకు జీతం రూ.1,08,000/-

సాక్షి ఎడ్యుకేష‌న్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలలో వివిధ విభాగాల్లో 802 ఉన్న అభ్యర్థులు నవంబర్ 19వ తేదీ లోపల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Powergrid Jobs Notification 2024  Power Grid Corporation of India Limited recruitment 2024  Apply for PGCIL jobs across India by November 19  PGCIL job application process 2024

 పోస్టును అనుసరించి డిప్లోమా, బీబీఏ, బీబీఎం‌, బీబీఎస్, బీకాం, ఇంటర్ సీఏ, ఇంటర్ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు 2024 నవంబర్ 12 నాటికి 27 ఏళ్ల లోపు వ‌యోప‌రిమితి ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాల‌కు ఎంపికచేస్తారు. ఈ పోస్టుల‌కు https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx లింక్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

పోస్టుల వివ‌రాలు ఇవే.. :
☛➤ డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్): 600 పోస్టులు
☛➤ డిప్లొమా ట్రైనీ (సివిల్): 66 పోస్టులు
☛➤ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెన్ఆర్) : 79 పోస్టులు
☛➤ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్ ఎ): 35 పోస్టులు
☛➤ అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్&ఎ): 22 పోస్టులు

జీతం : 
☛➤ అసిస్టెంట్ ట్రైనీ – 21,500/- నుంచి 74,000/-
☛➤ ఇతర పోస్టులకు – 24,000/- నుంచి 1,08,000/-

పూర్తి వివ‌రాలను https://www.powergrid.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోండి

Published date : 13 Nov 2024 02:57PM

Photo Stories