Skip to main content

Inspirational Success Story : ఆర్థిక పరిస్థితులు స‌రిగ్గా లేక‌.. పోటీ పరీక్షలకు ప్రిపేర‌య్యే వాళ్ల కోసం...

మ‌ల్ల‌వ్వ‌కు చిన్నప్పుడు మంచిగా చ‌దువుకుని... మంచి ఉద్యోగం చేయ‌ల‌నే క‌ల ఉండేది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు కార‌ణంగా ఆమె కన్న ఆ రెండు కలల్ని నెరవేరనివ్వలేదు. మల్లవ్వ పెరిగి పెద్దదైంది. ఊరికి సర్పంచ్‌ కూడా పనిచేసింది. ఆమె కలలు మాత్రం కలలు గానే ఉండిపోయాయి.
మల్లవ్వ  mallavva inspirational story in telugu

వాటిని సాకారం చేసుకోటానికి అక్టోబర్‌ 13న ఊళ్ళో ఒక లైబ్రరీని ప్రారంభించింది మల్లవ్వ. తను చదువుకోలేకపోవచ్చు. తను ఉద్యోగం చేయలేకపోవచ్చు. చదువుకునే పిల్లల కోసం, ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవాలనుకున్న యువతీయువకుల కోసం.. వారికి పనికొచ్చే పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచింది. ఇంకా కొన్ని పుస్తకాలను తెప్పిస్తోంది. వాళ్ళలో తనను చూసుకుంటోంది.

లైబ్రరీ ఏర్పాటు కోసం..
లైబ్రరీ ఏర్పాటు కోసం మల్లవ్వ ఖర్చు చేసిన 1.50 లక్షల రూపాయల్లో.. గృహలక్ష్మి యోజన కింద ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న 2000 రూపాయలను దాచిపెట్టగా జమ అయిన 26 వేల రూపాయలు కూడా ఉన్నాయి. కల అంటే నిద్రలో వచ్చేది కాదు.., నిద్ర పోనివ్వకుండా చేసేది అనే మాట మల్లవ్వ విషయంలో నిజమైంది. రుజువైంది. ఎంతో మందికి మల్లవ్వ స్ఫూర్తిగా నిలుస్తోంది.

Published date : 19 Oct 2024 02:38PM

Photo Stories