Selection as Police: పోలీస్ శాఖలోకి ఎంపికైన యువకులు.. ఇదే వారి ప్రయాణం!
మండలంలోని మాల్యవంతం పంచాయతీ ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడైన అఖిల్‌కుమార్ వివిధ ఉద్యోగాల్లో మౌనంగానే ఎదుగుతూ వచ్చారు.. టెక్ మహేంద్రలో దాదాపు ఏడాదికిపైగా సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో అతను కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ ఉద్యోగం కోసం రాత‍్రిపగలు శ్రమించి చదివాడు.
AP SI Posts Selected Candidates Success : ఈ లైబ్రరీ ద్వారా.. చదివారు.. ఎస్ఐ ఉద్యోగాలు కొట్టారిలా..
అతనికి ఉన్న తపన, పట్టుదల పరీక్ష వరకు తీసుకెళ్లింది. ఆ పరీక్షలో మంచి మార్కులను గెలిచేలా చేసింది. అదే, ఆయనను 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యేలా చేసింది. ప్రస్తుతం, అఖిల్ కుమార్ అగళి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా.. టెక్నాలజీపై పూర్తి పట్టు ఉండడంతో డిప్యూటేషన్‌పై జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సైబర్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్‌ఐ పోటీ పరీక్షల్లో రాయలసీమ జోన్ పరిధిలో ఏడో ర్యాంక్‌ను దక్కించుకోవడంతో తల్లిదండ్రులతో పాటు, గ్రామస్తులూ హర్షం వ్యక్తం చేశారు.
ఓపెన్ కేటగిరిలో మూడో స్థానం
ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన చిగిచెర్ల గురుప్రసాద్, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె చిగిచెర్ల లహరి... ఎస్‌ఐ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 225 మార్కులతో ఓపెన్ కేటగిరి మహిళల విభాగంలో మూడో స్థానాన్ని కై వసం చేసుకున్న ఆమెను గ్రామస్తులు, బంధువులు, తల్లిదండ్రులు అభినందించారు.