Skip to main content

AP SI Posts Selected Candidates Success : ఈ లైబ్రరీ ద్వారా.. చ‌దివారు.. ఎస్ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుద‌ల చేసిన ఎస్ఐ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో.. అనంతపురం జిల్లా పోలీసు శాఖ ద్వారా కోచింగ్‌ పొందిన ముగ్గురు అభ్య‌ర్థులు ఉద్యోగాలు సాధించారు.
Anantapur Police Coaching  Success Stories  AP SI Posts Selected Candidates Success  Anantapur District Police Coaching Success

పెదింటి బిడ్డ‌లైన వీరు ఎస్ఐ ఫ‌లితాల్లో స‌త్తాచాటి.. అనుకున్న ల‌క్ష్యం సాధించారు. ఈ నేప‌థ్యంలో వీరికి.. ఉద్యోగంలో చేరాక పోలీసు శాఖకు కీర్తి తేవాలని అదనపు ఎస్పీ విజయ భాస్కర్‌ రెడ్డి సూచించారు.

☛ Ward Volunteer Selected SI Post : వార్డు వలంటీర్‌గా ప‌నిచేస్తూ.. తొలి ప్ర‌య‌త్నంలోనే ఎస్సై ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

లైబ్రరీ ద్వారా..
అనంతపురం జిల్లా పోలీసు శాఖ ద్వారా కోచింగ్‌ పొందిన ముగ్గురు ఇటీవల విడుదలైన ఎస్‌ఐ పరీక్ష ఫలితాల్లో ఉద్యోగాలు సాధించారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన గౌతమ్‌, అనంతపురం నగరానికి చెందిన విద్యశ్రీ, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన ప్రైసీలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ స్టడీ సెంటర్‌ కమ్‌ డిజిటల్‌ లైబ్రరీ ద్వారా 120 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. వీరిలో దేహదారుఢ్య పరీక్షలు, ఈవెంట్స్‌లో 65 మంది అర్హత సాధించి మెయిన్స్‌ పరీక్షలు రాశారన్నారు. అందులో ముగ్గురు ఉద్యోగాలు సాధించినట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు వారిని సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ జాకీర్‌ హుస్సేన్‌ ఉన్నారు.

 AP SI Job Selected Candidates: ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించారు.. ఎస్‌ఐ ఫ‌లితాల్లో విజ‌యం సాధించారు.. వారు వీరే..

Published date : 26 Dec 2023 07:56AM

Photo Stories