Skip to main content

AP SI Job Selected Candidate Success Story : ఎస్ఐ ఫ‌లితాల్లో.. రాయలసీమ జోన్‌లో ఫ‌స్ట్ ర్యాంక్ కొట్టానిలా.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఎస్‌ఐ ఫలితాల్లో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన‌ యువకుడు సత్తా చాటాడు. రాష్ట్ర వ్యాప్తంగా 5వ ర్యాంక్‌, రాయలసీమ జోన్‌లో ప్రథమ ర్యాంక్‌ సాధించాడు. ఈ నేప‌థ్యంలో ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన‌ శివనాగిరెడ్డి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..
Sivanagi Reddy Achieves 1st Rank in Rayalaseema Zone   AP SI Job Selected Candidate SivaNagi Reddy Success Story    Sivanagi Reddy's Success Story

కుటుంబ నేప‌థ్యం :
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజ‌వ‌ర్గంలోని రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన అంకిరెడ్డి కుమారుడు శివనాగిరెడ్డి. శివనాగిరెడ్డి 1వ త‌ర‌గ‌తి నుంచి ఇంటర్‌ మీడియట్‌ వరకు ఆళ్లగడ్డలో విధ్యనభ్యసించాడు. డిగ్రీ కర్నూలు సిల్వర్‌జూబ్లీ కళాశాలలో పూర్తి చేశాడు.

 AP High Court : ఏపీ ఆ ఎస్‌ఐ అభ్యర్థులపై హైకోర్టు ఆగ్రహం.. ఈ అఫిడవిట్‌ను ఉపసంహరించుకోవాల్సిందే..

నా ల‌క్ష్యం ఇదే..
మ‌నం ఏదైన సాధించాల‌నే ల‌క్ష్యం బ‌లంగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైన సాధించవ‌చ్చ‌ని నిరూపించాడు ఈ యువ‌కుడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇతను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఎస్‌ఐ నియామక ఫలితాల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో ఐదోర్యాంకు, రాయలసీమ జోన్‌లో ప్రథమ ర్యాంకు సాధించాడు. కష్టపడి విజయం సాధించిన యువకుడిని చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడమేగాక.. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతానని తెలిపారు.

☛ Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని డిసెంబ‌ర్ 6వ తేదీన‌(బుధ‌వారం) ఎస్సై ఉద్యోగాల ఫైన‌ల్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో ఎంతో మంది పేదింటి బిడ్ద‌లు త‌మ స‌త్తాచాటి ఎస్సై ఉద్యోగం సాధించారు. ఈ ఫ‌లితాల్లో విజ‌యం సాధించిన అభ్య‌ర్థుల‌కు త్వ‌ర‌లోనే శిక్ష‌ణ ప్రారంభించ‌నున్నారు.

1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా..
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సివిల్‌, రిజర్వ్ విభాగాల్లోని 411 పోస్టుల భర్తీకి ఈ ఏడాది పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షకు 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 57 వేల మందికిపైగా అర్హత సాధించారు. అనంతరం వీరికి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో దాదాపు 35 వేల మంది పురుషులు, మహిళలు అర్హత సాధించారు. వీరికి గత నెల 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించగా.. 30 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని అక్టోబరు 15న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఎట్ట‌కేల‌కు ఎన్నో అవాంత‌రాలు ఎదుర్కొని ఎస్ఐ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ డిసెంబ‌ర్ 6వ తేదీన‌(బుధ‌వారం) విడుద‌ల చేసింది. 

☛ ఏపీ ఎస్‌ఐ ఫైన‌ల్‌ ఫ‌లితాలు 2023 విడుద‌ల కోసం క్లిక్ చేయండి

Published date : 23 Dec 2023 07:57AM

Photo Stories