UPSC Exam 2024 : ఆదివారం సజావుగా జరిగిన యూపీఎస్సీ పరీక్ష.. ఈ విభాగాల్లో హాజరైనవారి సంఖ్య!
అనంతపురం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈపీఎఫ్‌ఓ పర్సనల్ అసిస్టెంట్, ఈఎస్‌ఐసీ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఆదివారం పరీక్షలు సజావుగా జరిగాయి. పీఏ పరీక్షకు అభ్యర్థుల హాజరు 26.95 శాతం, ఎన్‌ఓ పరీక్షకు 81.17 శాతం నమోదయ్యింది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వి.వినోద్ కుమార్ సందర్శించారు. కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
Vacancies In Andhra Pradesh: ఏపీలో 400కు పైగా ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో కొలువులు
ఉదయం రెండు పరీక్ష కేంద్రాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 434 మంది అభ్యర్థులకు గానూ 117 మంది (26.95 శాతం) హాజరయ్యారు. 317 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం ఆరు కేంద్రాల్లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 2,109 మంది అభ్యర్థులకు గానూ 1,712 మంది (81.17శాతం) హాజరయ్యారు. 397 మంది గైర్హాజరయ్యారు.
Tags
- UPSC 2024
- exam centers
- Employees Provident Fund Organization
- EPFO
- ESIC Exam
- Govt Jobs
- upsc candidates
- personal assistant posts
- Nursing Officer Posts
- collector vinod kumar
- Education News
- Sakshi Education News
- UPSC
- Employees State Insurance Corporation
- EPFOPersonalAssistantExam
- Exam Arrangements
- UPSC Exams
- Union Public Service Commission