Skip to main content

SSC CGLE Notification : ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ నోటిఫికేషన్‌.. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం!

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నియామక సంస్థ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ).. ఉద్యోగార్థులకు స్వాగతం పలుకుతోంది!
SSC CGL 2024 Result Announcement   SSC CGL 2024 Preparation Tips   SSC CGL 2024 Notification  Staff Selection Commission Combined Graduation Level Examination Notification 2024

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో.. మొత్తం 17,727 గ్రూప్‌–బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్‌ డిగ్రీతోనే పోటీ పడే అవకాశం ఉంది. రెండు దశల రాత పరీక్షలో విజయం సాధిస్తే.. కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (సీజీఎల్‌) 2024 నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..  

మొత్తం పోస్టులు 17,727

  •     సీజీఎల్‌ఈ–2024 ద్వారా భారీ సంఖ్యలో కొలువుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఉపక్రమించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మొత్తం 17,727 గ్రూప్‌–బి, సి పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
  •     గ్రూప్‌ బీలో.. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌/అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్, రీసెర్చ్‌ అసిస్టెంట్, డివిజన్‌ అకౌంటెంట్, సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ /జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్, జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.
  •     గ్రూప్‌ సీలో.. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్, ఆడిటర్, అకౌంటెంట్, అకౌంటెంట్‌/జూనియర్‌ అకౌంటెంట్, పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌/అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్, ట్యాక్స్‌ అసిస్టెంట్, సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. 

Special Cadre Officer Posts : ఒప్పంద ప్రాతిప‌దికిన‌లో 102 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎక్క‌డ‌!

విద్యార్హతలు

  •     అన్ని ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతను అర్హతగా నిర్దేశించారు. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో మ్యాథమెటిక్స్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి.. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసుకుని ఉండాలి. లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి. స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌–2 పోస్ట్‌లకు స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
  •     ఎన్‌హెచ్‌ఆర్‌సీలో రీసెర్చ్‌ అసిస్టెంట్స్‌ పోస్ట్‌లకు కనీసం ఏడాది రీసెర్చ్‌ అనుభవం ఉన్న వారికి, అదే విధంగా న్యాయ శాస్త్రంలో డిగ్రీ లేదా హ్యూమన్‌ రైట్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. నిర్దిష్ట విద్యార్హతలను ఆగస్ట్‌ 1, 2024 లోపు పొంది ఉండాలి. 


వయసు
దాదాపు అన్ని పోస్ట్‌లకు గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లుగా ఉంది. జూనియర్‌ స్టాటిస్టిక­ల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు 32 ఏళ్లు, గ్రూప్‌–సి పోస్ట్‌లకు 27 ఏళ్లుగా ఉంది. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

వేతనం
పే లెవల్‌ 4, 5, 6, 7లతో ప్రారంభ వేత­నం అందనుంది. కనిష్ట ప్రారంభ వేతన శ్రేణి రూ.25,500–రూ.81,100; గరిష్ట ప్రారంభ వేతన శ్రేణి రూ.44,900–రూ.1,42,400.

Supreme Court NEET Hearing Plea Live Updates: నీట్‌ పరీక్ష రద్దు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తారు. రెండు దశల్లోనూ రాత పరీక్ష ఉంటుంది. ఆ వివరాలు..
200 మార్కులకు టైర్‌–1 పరీక్ష
తొలిదశలో టెర్‌–1 పరీక్షను 100 ప్రశ్నలు–200 మార్కులతో నిర్వహిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (25 ప్రశ్నలు), జనరల్‌ అవేర్‌నెస్‌ (25 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (25 ప్రశ్నలు), ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ (25 ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మా­ర్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం ఒక గంట.

రెండో దశ టైర్‌–2

  •     టైర్‌–1లో నిర్దిష్ట కటాఫ్‌ మార్కుల శ్రేణితో ఉత్తీర్ణత సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో టైర్‌–2 పరీక్ష నిర్వహిస్తారు. టైర్‌–2 పరీక్ష మొత్తం నాలుగు పేపర్లలో జరుగుతుంది. వివరాలు..
  •     పేపర్‌–1: పేపర్‌–1ను సెషన్‌–1, సెషన్‌–2లుగా నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతి సెషన్‌ను రెండు సెక్షన్‌లుగా పేర్కొన్నారు.
  •     సెషన్‌–1 (సెక్షన్‌–1)లో మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్‌ (మాడ్యూల్‌–1), రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ (మాడ్యూల్‌–2) విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 180 మార్కులు ఉంటాయి.
  •     సెషన్‌–1 (సెక్షన్‌–2)లో.. మాడ్యూల్‌–1 పేరుతో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో 45 ప్రశ్నలు, మాడ్యూల్‌–2 పేరిట జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో 25 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 70 ప్రశ్నలకు 210 మార్కులు ఉంటాయి.
  •     సెషన్‌–1 (సెక్షన్‌–3)లో మాడ్యూల్‌–1 పేరుతో కంప్యూటర్‌ నాలెడ్జ్‌ నుంచి 20 ప్రశ్నలు– 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. సెషన్‌–2లో సెక్షన్‌–3 పేరుతో డేటాఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌ (మాడ్యూల్‌–3) 15 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. 
  •     పేపర్‌–2ను స్టాటిస్టిక్స్‌ సబ్జెక్ట్‌తో 100 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహిస్తారు.
  •     పేపర్‌–3ని జనరల్‌ స్టడీస్‌ (ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌)తో 200 మార్కులకు 100 ప్రశ్నలతో నిర్వహిస్తారు. అన్ని పోస్ట్‌ల అభ్యర్థులు పేపర్‌–1కు తప్పనిసరిగా హాజరు కావాలి. పేపర్‌–2 జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా పేపర్‌–3ని అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు నిర్వహిస్తారు.

Project Officer Posts at CSL : కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఈ కోర్సులో ఉత్తీర్ణ‌త పొందిన‌వారే అర్హులు..!

ముఖ్య సమాచారం

  •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూలై 24
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: ఆగస్ట్‌ 10, 11 తేదీల్లో
  •     టైర్‌–1 పరీక్ష: సెప్టెంబర్‌/అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం.
  •     టైర్‌–2 పరీక్ష: డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం.
  •     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: జ్టి్టpట://టటఛి.జౌఠి.జీn 

TSPSC Group 1 Prelims 2024 Results : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన వారు..

రాత పరీక్షలో రాణించేలా

రెండు దశలుగా, పలు సెషన్స్, మాడ్యూల్స్‌లో ఆయా సబ్జెక్ట్‌లలో జరిగే పరీక్షల్లో విజయానికి అభ్యర్థులు సబ్జెక్ట్‌ వారీగా ప్రిపరేషన్‌ సాగించాలి.
రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌
అభ్యర్థుల్లోని విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే ఈ విభాగంలో రాణించాలంటే.. కోడింగ్, డీ–కోడింగ్, అనలిటికల్‌ పజిల్స్, క్రిటికల్‌ రీజనింగ్‌ బాగా ప్రాక్టీస్‌ చేయాలి. ఇంగ్లిష్‌ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్‌ చేయాలి. దీంతోపాటు ఏ అక్షరం ఎన్నో స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి. అదే విధంగా అనలిటికల్‌ రీజనింగ్, సిలాజిజమ్స్, ఇనీక్వాలిటీస్, ఇన్‌పుట్‌– అవుట్‌పుట్, డేటా సఫిషియెన్సీ విభాగాలపై అవగాహన పొందాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌
జనరల్‌ అవేర్‌నెస్‌/జనరల్‌ స్టడీస్‌లో రాణించేందుకు హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై పట్టు సాధించాలి. అదే విధంగా స్టాక్‌ జీకేపైనా అవగాహన పెంచుకోవాలి.

Job Mela: SV డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
హైçస్కూల్‌ స్థాయి మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజ్, యావరేజేస్, రేషియో–ప్రపోర్షన్, ప్రాఫిట్‌–లాస్, సింపుల్‌–కాంపౌండ్‌ ఇంట్రెస్ట్, టైమ్‌–వర్క్, టైమ్‌–డిస్టెన్స్, పర్ముటేషన్స్‌–కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మిక్షర్‌ అండ్‌ అలిగేషన్స్, పార్టనర్‌ షిప్‌పై దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. సింప్లిఫికేషన్స్‌కు సంబంధించి బోడ్‌మస్‌ రూల్స్‌ను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తించుకోవాలి.

ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌
అభ్యర్థులు బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్, స్పెల్లింగ్స్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్‌ అండ్‌ ప్యాసివ్‌ వాయిస్, వొకాబులరీ, రీ రైటింగ్‌ ద సెంటెన్స్, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, ఆల్ఫా బెటికల్‌ ఆర్డర్, ప్రెసిస్‌ రైటింగ్, బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, సెంటెన్స్‌ ఫార్మేషన్, యాక్టివ్‌–ప్యాసివ్‌ వాయిస్, కాంప్లెక్స్‌ సెంటెన్సెస్‌ వంటి ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, వొకాబ్యులరీల్లోనూ పూర్తి స్థాయిలో నైపుణ్యం పొందాలి.

Apollo Pharmacy jobs: అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు..

డేటా ఇంటర్‌ప్రెటేషన్‌
టేబుల్స్, చార్ట్‌లు, గ్రాఫ్‌ల ద్వారా సమాచారమిస్తూ ప్రశ్నలు అడిగే విభాగం ఉంది. డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ ప్రశ్నలను సాధించాలంటే.. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోలపై అవగాహన ఉండాలి. వివిధ రకాల గ్రాఫ్‌లను సాధన చేయాలి. ఈ విభాగంలో పట్టు కోసం టేబుల్స్, బార్‌ చార్ట్స్, పై చార్ట్స్‌ మొదలైన వాటిని బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌
ఈ విభాగంలో రాణించేందుకు కంప్యూటర్‌ ఫండమెంటల్స్, బేసిక్‌ కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఆపరేటింగ్‌ సిస్టమ్, నెట్‌వర్క్, 
ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్‌ కాన్సెప్ట్స్, డీబీఎంస్, ఎంఎస్‌ ఆఫీస్‌లకు సంబంధించి బేసిక్‌ టెర్మినాలజీపై పట్టు సాధించాలి. సిస్టమ్‌కు సంబంధించి హార్డ్‌వేర్‌ టూల్స్, వాటి ఉపయోగాలు వంటి వాటిపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.

పేపర్‌–2, పేపర్‌–3
జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు నిర్వహించే పేపర్‌–2, అదే విధంగా అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు జరిపే పేపర్‌–3లలో రాణించేందుకు అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో అకడమిక్‌ పుస్తకాలను అభ్యసనం చేయాలి. అదే విధంగా గత ప్రశ్న పత్రాలు, నమూనా ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. 

Anganwadi Centers Funds news: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ ఎందుకంటే..

Published date : 08 Jul 2024 12:54PM

Photo Stories