UPSC Ranker Hari Prasad Raju Inspiring Journey: యూపీఎస్‌సీ పరీక్షలో యువకుని సత్తా.. రెండో ప్రయత్నంలోనే..!
వైవీయూ: కడప నగరం బాలాజీనగర్‌కు చెందిన జె. వెంకటసుబ్బమ్మ (హిందీపండిత్, పాతకడప జెడ్పీహెచ్‌ఎస్, కడప), కె. నాగేంద్ర వర్మ (మ్యాథ్స్ ఉపాధ్యాయుడు, గంగనపల్లె జెడ్పీహెచ్‌ఎస్)ల కుమారుడైన కడుమూరి హరిప్రసాద్‌రాజు యూపీఎస్‌సీ ఆలిండియా 475వ ర్యాంకు సాధించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం కడప నగరంలోని నాగార్జున హైస్కూల్‌లో, తర్వాత రవీంద్రభారతి హైస్కూల్, అనంతరం మెరిట్ స్కాలర్‌షిప్ ద్వారా భాష్యం విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. అనంతరం ఏపీ ఎంసెట్‌లో 63వ ర్యాంకు సాధించడంతో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం మైక్రోసాఫ్ట్ కంపెనీలో రూ.50 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరాడు.
అయినప్పటికీ సివిల్స్ సాధించాలన్న లక్ష్యం ఆయన్ను పోటీపరీక్షల వైపు వెళ్లేలా చేసింది. దీంతో యూపీఎస్‌సీలో తొలి ప్రయత్నంలో కొద్దిపాటిలో ర్యాంకు మిస్ అయ్యింది. అదే సమయంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కస్టమ్స్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తాజాగా విడుదల చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో సైతం ర్యాంకు సాధించాడు. తాజాగా యూపీఎస్‌సీ ఫలితాల్లో రెండో ప్రయత్నంలో 475వ ర్యాంకుతో ఆలిండియా విజేతగా నిలిచాడు. కాగా, ఈ ర్యాంకుతో ఐఆర్‌ఎస్ వచ్చే అవకాశం ఉందని, ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని హరిప్రసాద్‌రాజు పేర్కొన్నాడు.
తాతయ్య, మేనమామల మార్గదర్శనంతో..
హరిప్రసాద్‌రాజు 4వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి కాలం చేయడంతో తాత జె. వెంకట్రామరాజు (విశ్రాంత ఉపాధ్యాయుడు), అమ్మమ్మ కృష్ణవేణి, మేమమామలు జె. వెంకటేశ్వరరాజు (హిందీపండిట్), జె. సుబ్బరాజు (ఇంజినీర్)ల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి చదువు పట్ల శ్రద్ధ వహిస్తూ అన్నింటా టాపర్‌గా నిలుస్తూ వచ్చాడు. ఈయన టాలెంట్ చూసి భాష్యం విద్యాసంస్థలు ఈయనకు స్కాలర్‌షిప్‌పై విద్యను అందించడం విశేషం. కాగా, వీరి స్వస్థలం నందలూరు మండలం ములక్కాయలపల్లె కాని, 20 సంవత్సరాల నుంచి కడపలో నివాసం ఉంటున్నారు. ర్యాంకు సాధించిన హరిప్రసాద్ రాజును గురువారం కడప నగరంలోని వారి నివాసంలో కుటుంబసభ్యులు సత్కరించారు.
Civils Ranker Vineesha Badabhagni Success Story: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన ఉదయగిరి యువతి
Tags
- UPSC Ranker
- young talent
- Success Story
- inspiring story of upsc ranker
- hari prasad raju
- inspiring story of civils ranker
- talented student
- competitive exams ranker
- inspiring stories of rankers
- stories of inspirational and successful personalities
- rankers struggle
- rankers stories in competitive exams
- tips to follow in competitive exams
- appsc group 1 rankers
- appsc group 1 rankers story
- Education News
- Sakshi Education News
- annamayya news
- Competitive Examinations
- UPSC results
- Competitive Examinations
- sakshieducation success stories