Skip to main content

Civils Ranker Vineesha Badabhagni Success Story: తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించిన ఉదయగిరి యువతి

Civils Ranker Vineesha Badabhagni Success Story

ఉదయగిరి: యూపీఎస్సీలో మండలంలోని గంగులవారి చెరువుపల్లికి చెందిన బడబాగ్ని వినీష ప్రతిభ చూపింది. మంగళవారం ఫలితాలు విడుదల చేయగా 821 ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి శ్రీనివాసులు వ్యవసాయాధికారి. తల్లి విజయభారతి గుంటూరు వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వినీష ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరులో జరిగింది.

తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించి..
ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. మద్రాస్‌ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివింది. అమెరికాలో ఎంఎస్సీ చేసింది. అనంతరం గ్రూప్‌–1 పరీక్షలు రాసి మున్సిపల్‌ కమిషనర్‌గా ఎంపికైంది. ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తోంది.

UPSC Civils 18th Ranker Wardah Khan : ల‌క్ష‌ల్లో వ‌చ్చే జీతాన్ని వ‌దిలి.. ల‌క్ష్యం కోసం వ‌చ్చి సివిల్స్ కొట్టానిలా.. అతి చిన్న వ‌య‌స్సులోనే..
 

తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ర్యాంకు సాధించడం విశేషం. వినీష సోదరుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అతను కూడా సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు. మారుమూల గ్రామంలో జన్మించి, చదువులో రాణించి సివిల్స్‌లో ర్యాంకు సాధించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Published date : 17 Apr 2024 04:04PM

Photo Stories