Chemistry Material and Model Questions for Competitive Exams : సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు.. అత్యంత కఠిన లోహం టంగ్‌స్టన్.. మాదిరి ప్రశ్నలతో..
గత 1600 ఏళ్లుగా అది తుప్పు పట్టలేదు. దాని తయారీలో పాస్ఫరస్ శాతాన్ని పెంచి సల్ఫర్, మెగ్నీషియం లేకుండా చూడటమే అది తుప్పు పట్టకపోవడానికి కారణం. సాధారణంగా తీర ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇనుము త్వరగా తుప్పు పడుతుంది. కానీ ఒడిశా తీర ప్రాతంలోని కోణార్క్ సూర్యదేవాలయంలో వాడిన ఇనుప దూలాలు, పశ్చిమ తీరంలో కొల్లూర్‌లో ఉన్న మూకాంబికా ఆలయంలోని ఇనుప స్తంభం తుప్పు పట్టలేదు. వాటి తయారీలో వాడిన ఐరన్ మిశ్రమ లోహంలో పాస్ఫరస్ గాఢత ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని పరిశోధనలో తేలింది.
మిశ్రమ లోహాలు
రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా ఒక లోహంతోపాటు ఇతర మూలకాల సజాతీయ మిశ్రమమే మిశ్రమ లోహం. శుద్ధ లోహాలతో పోల్చినప్పుడు మిశ్రమ లోహాల ధర్మాలు కాస్త భిన్నంగా ఉంటాయి.
Navratna Status: నాలుగు సంస్థలకు నవరత్న హోదా.. ఏ కంపెనీలకంటే..
మిశ్రమ లోహాలు –ఇతరాంశాలు
☛ ఇనుము ఒక అనుఘటకంగా ఉన్న మిశ్రమ లోహాలను ఫెర్రస్ మిశ్రమ లోహాలు అంటారు.
ఉదా: స్టెయిన్‌లెస్ స్టీలు
(ఐరన్ + కార్బన్ + క్రోమియం)
☛ ఐరన్ లేని మిశ్రమ లోహాలను నాన్ ఫెర్రస్ మిశ్రమ లోహాలు అంటారు.
ఉదా: జర్మన్ సిల్వర్
(కాపర్ + జింక్ + నికెల్)
☛ పాదరసం(మెర్క్యురీ)ఒక అనుఘటకంగా ఉన్న మిశ్రమ లోహాన్ని అమాల్గం అంటారు.
ఉదా: సోడియం అమాల్గం (మెర్క్యురీ + సోడియం)
☛ ఐరన్, పాటినం లోహాలు అమాల్గంను ఏర్పరచవు.
☛ దంతాల్లోని రంధ్రాలను ఫిల్లింగ్ చేయడానికి డెంటల్ అమాల్గంను ఉపయోగిస్తారు. ఇది మెర్క్యురీ, సిల్వర్, టిన్, కాపర్‌ల మిశ్రమ లోహం.
☛ సాంకేతికంగా మిశ్రమ లోహాన్ని ఘనరూపంలో ఉన్న ద్రవంగా పరిగణించవచ్చు.
☛ మిశ్రమ లోహాల వల్ల పదార్థ గట్టిదనం పెరుగుతుంది.
☛ వీటి సాగే గుణం తక్కువగా ఉంటుంది.
☛ ద్రవీభవన స్థానం తక్కువ.
☛ తుప్పు పట్టే గుణం తగ్గుతుంది.
☛ విద్యుత్ వాహకత తగ్గుతుంది.
☛ లోహ కాంతిని, రంగును మెరుగుపర్చవచ్చు.
☛ చర్యాశీలత మార్చవచ్చు.
☛ ఆమ్లాలను, క్షారాలను తట్టుకునే గుణం పెరుగుతుంది.
☛ బంగారు ఆభరణాల స్వచ్ఛతను క్యారెట్ ప్రమాణాల్లో కొలుస్తారు.
☛ 24 క్యారెట్ల బంగారంలో 100శాతం బంగారం ఉంటుంది. క్యారెట్ల బంగారంలో (x’100) /24 శాతం బంగారం ఉంటుంది. ఒక క్యారెట్ 100/24 శాతం బంగారానికి సమానం. 18 క్యారెట్ల బంగారు ఆభరణాల్లో (18ణ100)/ 24=75 శాతం బంగారం, మిగతా 25 శాతం రాగి ఉంటుంది. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు 91.6 శాతం స్వచ్ఛత కలిగి ఉంటాయి. మిగతా 8.4 శాతం రాగి ఉంటుంది.
Vande Bharat Trains: మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన మోదీ..
తుప్పు పట్టడం: లోహం తుప్పు పట్టడమనేది ఆక్సీకరణ ప్రక్రియ.
ఉదా: ఇనుము తుప్పు పట్టినప్పుడు ఆక్సీకరణం చెంది ఐరన్ ఆక్సైడ్ (ఫెర్రిక్ ఆక్సైడ్) ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో దాని బరువు పెరుగుతుంది. సాధారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండే తీర్ర ప్రాంతాల్లో తుప్పుపట్టడం వేగంగా జరుగుతుంది.
గాల్వనైజేషన్: ఇనుము లాంటి లోహాలు తుప్పు పట్టకుండా వాటిపై జింక్ లాంటి లోహాలతో పూత పూయడాన్నే గాల్వనైజేషన్ అంటారు. గాల్వనైజేషన్ చేయడం వల్ల ఇనుము క్షయం కాకుండా నివారించవచ్చు. గాల్వనైజేషన్ చేయడానికి ఎక్కువ చర్యాశీలత ఉన్న లోహాన్ని తీసుకుంటారు.
ఉదా: జింక్ క్రియాశీలత ఎక్కువ కాబట్టి దీంతో ఇనుముపై పూత పూయడం వల్ల ఇది క్షయం చెంది ఐరన్‌ను పరిరక్షిస్తుంది.
☛ ఎలక్ట్రోప్లేటింగ్‌లో కావాల్సిన లోహపు పూతను విద్యుద్విశ్లేషణ పద్ధతిలో వేస్తారు. ఏ లోహంపై పూత పూయాలో దాన్ని కాథోడ్(రుణధ్రువం)గా, పూతపూయాల్సిన లోహమున్న లవణ ద్రావణాన్ని విద్యుద్విశ్లేష్యం(ఎలక్ట్రోలైట్)గా తీసుకుంటారు. ఉదా: కారు విడిభాగాలు,కుళాయిలు,గ్యాస్ బర్నర్‌లపై క్రో మియం ప్లేటింగ్ చేస్తారు. దీనివల్ల తుప్పు పట్టవు. మన్నిక పెరుగుతుంది. నకిలీ నగల తయారీలో కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
☛ మెర్క్యురీ తప్ప మిగతా లోహాలన్నీ ఘన పదార్థాలే. పాదరసం(మెర్క్యురీ) మాత్రం ద్రవం. గాలియం అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగే లోహం.
☛ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం లాంటి క్షారలోహాలు మెత్తని లోహాలు. ఇవి కత్తితో కోయగలిగేంత మృదువైనవి.
☛ లోహాలు మంచి విద్యుత్ వాహకాలు. స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు విద్యుత్‌ను మోసుకెళ్తాయి(ఎలక్ట్రాన్ కండక్టర్). లోహాలన్నింటిలో సిల్వర్ మంచి విద్యుత్ వాహకం. గృహావసరాల కోసం రాగి వైర్లను వాడితే, విద్యుత్ పంపిణీ సంస్థలు అల్యూమినియం వైర్లను ఉపయోగిస్తాయి.
TV Somanathan: కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సోమనాథన్
☛ అనాది నుంచి నాణేల తయారీలో ఉపయోగించిన బంగారం, సిల్వర్, కాపర్ లోహాలను కాయినేజ్ మెటల్స్ అంటారు.
☛ బంగారానికి రేకులుగా సాగే గుణం ఎక్కువ. దీనిపై గీతలు పడవు. ఆభరణాలను తయారుచేసేటప్పుడు గట్టిదనం కోసం బంగారానికి రాగిని కలుపుతారు.
☛ అత్యంత తేలికైన లోహం లిథియం. అత్యంత మృదువైన లోహం సీసియం.
☛ అత్యంత కఠిన లోహం టంగ్‌స్టన్.
☛ మానవుడు విరివిగా వాడే లోహం ఇనుము. మన రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఐరన్ (ఫెర్రస్) అయాన్లు ఉంటాయి.
☛ మొక్కల్లోని పత్రహరితంలో మెగ్నీషియం, విటమిన్ బి12 (సయనోకోబాలమిన్)లో కోబాల్ట్ లోహాల అయాన్లు ఉంటాయి.
☛ భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం అల్యూమినియం. దీనికి బాక్సైట్ గనులు ఆధారం. సిల్వర్ పెయింట్‌లో సిల్వర్ ఉండదు. అల్యూమినియం ఉంటుంది. గోల్డ్ పెయింట్‌లో కాపర్ ఉంటుంది.
☛ కండరాల సంకోచానికి సోడియం అయాన్లు అవసరం.
☛ ట్రాన్సిస్టర్ల తయారీలో ప్రధానమైంది జెర్మేనియం.
☛ సహజ సిద్ధంగా లభించే భారాత్మక లోహం యురేనియం.
☛ ఉప్పునీటి కాఠిన్యానికి కారణమైన ప్రధాన లోహ అయాన్లు కాల్షియం, మెగ్నీషియం.
☛ తేలికగా ఉండి, గట్టిదనం కోసం విమాన విడిభాగాల తయారీలో మెగ్నీషియంను ఉపయోగిస్తారు.
☛ బంగారాన్ని లోహాల రాజుగా పిలుస్తారు.
Current Affairs: ఆగస్టు 31వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!
☛ మన శరీరంలో ఎక్కువగా ఉండే లోహం కాల్షియం.
☛ ద్విస్వభావం(ఆంఫోటరిక్) ఉన్న అర్ధలోహాలు ఆర్శెనిక్, జెర్మేనియం, ఆంటిమొని, జింక్.
☛ లిథియం, సోడియం లాంటి లోహాలు గాలిలోనూ అత్యంత చర్యాశీలత చూపుతాయి. అందుకే వీటిని కిరోసిన్ లేదా పారాఫిన్ నూనెలో నిల్వచేస్తారు.
☛ సోడియం అయాన్లు రక్త΄ోటును పెంచుతాయి. పొటాషియం అయాన్లు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.
☛ బాణసంచా తయారీలో విరివిగా వాడే లోహాలు మెగ్నీషియం(మిరుమిట్లు గొలిపే తెలుపు), స్ట్రాన్షియం(సింధూర ఎరుపు).
☛ ఇమిటేషన్ జ్యువెలరీలో వాడే నికెల్–సిల్వర్‌లో కాపర్,నికెల్,జింక్ ఉంటాయి. సిల్వర్ ఉండదు.
AP School Holidays: ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?
ముఖ్య మిశ్రమ లోహాలు-ఉపయోగాలు
మిశ్రమ లోహం | సంఘటనం | అనువర్తనాలు |
ఇత్తడి (బ్రాస్) | కాపర్ + టిన్ | పాత్రలు, యంత్రభాగాలు, బుల్లెట్లు |
కంచు (బ్రాంజ్) | కాపర్ + టిన్ | విగ్రహాలు, పాత్రలు |
బెల్ మెటల్ | కాపర్ + టిన్ (తగరం) | గంటల తయారీ |
మాగ్నాలియం | మెగ్నీషియం + అల్యూమినియం | విమాన, మోటార్ వాహన భాగాలు |
గన్‌మెటల్ | కాపర్ + టిన్ + జింక్ | గేర్లు, బేరింగ్‌లు, తు΄ాకీ పరిశ్రమ |
జర్మన్ సిల్వర్ | కాపర్ + జింక్ + నికెల్ | పాత్రలు, నగలు, నిరోధక చుట్టలు |
స్టెయిన్‌లెస్ స్టీల్ | ఐరన్ + కార్బన్ + క్రోమియం+ నికెల్ | ΄ాత్రలు, బ్లేడ్లు, బాల్ బేరింగ్‌లు, సర్జికల్ పరికరాలు |
మాంగనీస్ స్టీల్ | ఐరన్ + కార్బన్ + మాంగనీస్ | హెల్మెట్లు, రైల్వేట్రాక్, రోడ్ రోలర్లు, రాళ్లను పగులగొట్టే యంత్రాలు |
టంగ్‌స్టన్ స్టీల్ | ఐరన్ + కార్బన్ + టంగ్‌స్టన్+ కోబాల్ట్ + క్రోమియం | శాశ్వత అయస్కాంతాలు |
క్రోమ్ స్టీల్ | ఎక్కువ క్రోమియం ఉన్న స్టీల్ | వంట΄ాత్రలు |
నిక్రోమ్ | ఐరన్ + క్రోమియం + నికెల్‌ఇస్త్రీపెట్టెలోని ఫిలమెంట్, | ఫ్యూజులు, నిరోధక తీగెలు |
డ్యూరాల్యుమిన్ | మెగ్నీషియం + అల్యూమినియం | విమాన భాగాలు |
అల్యూమినియం బ్రాంజ్ | కాపర్ + అల్యూమినియం+టిన్ | ఆభరణాలు, నాణేలు |
సోల్డర్ | టిన్ + లెడ్ | సోల్డరింగ్ |
డౌమెటల్ | మెగ్నీషియం + అల్యూమినియం+ జింక్ | కార్లు, జలాంతర్గాములు, విమానాల తయారీలో |
Monday Schools Holiday Due to Heavy Rain : రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. సోమవారం అన్ని స్కూల్స్‌కు సెలవు.. ఇంకా..
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఇత్తడి దేని మిశ్రమం? (Gr-I, 2010)
1) రాగి, అల్యూమినియం
2) రాగి, తగరం (టిన్)
3) రాగి, తుత్తునాగం(జింక్)
4) రాగి, నికెల్
2. 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం? (Gr-I, 2010)
1) 8.4 2) 10.2 3) 11.4 4) 12.6
3. ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు? (AEE, 2011)
1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) ఒకేలా ఉంటుంది 4) పైవేవీ కావు
4. విద్యుత్ తంతువులో ఉపయోగించే మూలకం? (Gr-I, 2010)
1) అల్యూమినియం 2) రాగి
3) టంగ్‌స్టన్ 4) ఇనుము
సమాధానాలు
1) 3; 2) 1; 3) 2; 4) 3.
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో మిశ్రమ లోహం ఏది?
1) గ్రాఫైట్ 2) వజ్రం
3) నిక్రోమ్ 4) తామ్రం
2. సోల్డరింగ్ పనిలో సోల్డర్‌గా ఉపయోగించే పదార్థం ఏ మూలకాల మిశ్రమం?
1) ఇనుము, టిన్ (తగరం)
2) సీసం, తగరం
3) అల్యూమినియం, సిల్వర్
4) అల్యూమినియం, ఐరన్
3. గన్ మెటల్‌లో ఉండే లోహాలు?
1) రాగి 2) తగరం (స్టానస్)
3) జింక్ 4) పైవన్నీ
4. స్టెయిన్‌లెస్ స్టీల్‌లోని లోహాలు?
1) ఐరన్ 2) కార్బన్
3) క్రోమియం 4) 1, 2, 3
5. క్విక్ సిల్వర్ అని దేనికి పేరు?
1) మెర్క్యురీ 2) సిల్వర్
3) ప్లాటినం 4) గోల్డ్
6. విద్యుత్ క్రేన్‌లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది?
1) స్టీల్ 2) చేత ఇనుము
3) పోత ఇనుము 4) దుక్క ఇనుము
7. అత్యంత స్థితిస్థాపకత(ఎలాస్టిసిటీ) కలిగింది?
1) రబ్బరు 2) స్టీలు
3) సిల్వర్ 4) బంగారం
8. జతపర్చండి.
అ i) 22 క్యారెట్ల బంగారంలో రాగి
ii) 18 క్యారెట్ల బంగారంలో రాగి
iii) ఒక క్యారెట్ బంగారం
iv) 24 క్యారెట్ల బంగారం
ఆ ఎ) 25 శాతం బి) 2 క్యారెట్లు
సి) 100 శాతం డి) 100/24 శాతం
i ii iii iv
1) ఎ బి సి డి
2) బి సి ఎ డి
3) బి ఎ డి సి
4) బి ఎ సి డి
సమాధానాలు
1) 3; 2) 2; 3) 4; 4) 4;
5) 1; 6) 2; 7) 2; 8) 3.
Tags
- chemistry model questions
- study material and questions
- Competitive Exams
- groups exams
- materials and model questions for chemistry
- chemistry in groups exams
- appsc and tspsc groups exams
- appsc and tspsc groups exams study material
- civils and groups exams preparation for chemistry
- Education News
- Sakshi Education News