Chemistry Material and Model Questions : రబ్బరును సల్ఫర్‌తో కలిపి వేడిచేసే ప్రక్రియను ఏమంటారు?
పాలీమర్లు
చిన్న చిన్న అణువులను అనేకసార్లు పునరావృతం చేసి అత్యంత పెద్ద అణువులను ఏర్పరిచే ప్రక్రియనే ‘పాలీమరైజేషన్’ అంటారు. ఈ విధంగా ఏర్పడిన అణువులను ‘బృహదణువులు’ లేదా ‘పాలీమర్’లు అంటారు. ఈ ప్రక్రియలో ఉపయోగించిన చిన్న అణువులను ‘మోనోమర్’లు అంటారు.
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేవాటిని సహజ పాలీమర్‌లుగా పేర్కొంటారు.
ఉదా: పట్టు, ఉన్ని, కాటన్ (సెల్యూలోజ్), పిండి పదార్థం (స్టార్చ్), ప్రోటీన్లు, సహజ రబ్బరు.
వివిధ రసాయన పదార్థాలను ఉపయోగించి ప్రయోగశాలలో, పారిశ్రామికంగా తయారు చేసేవాటిని కృత్రిమ పాలీమర్లు అంటారు.
ఉదా: పాలీథీన్, నైలాన్, టెఫ్లాన్, పీవీసీ.
సహజ పాలీమర్లను పాక్షికంగా మార్పు చేయడం ద్వారా రూపోందించేవాటిని అర్ధ కృత్రిమ పాలీమర్లు అంటారు.
ఉదా: సెల్యూలోజ్ ఎసిటేట్, సెల్యూలోజ్ నైట్రేట్.
అనే సమూహం పునరావృత
మయ్యే పాలీమర్లను పాలీ ఎమైడ్లు అని అంటారు. కార్బాక్సిలికామ్ల గ్రూపు, ఎమైనో గ్రూపులున్న మోనోమర్ల సంఘనన పాలీమరీకరణ ప్రక్రియ వల్ల పాలీ ఎమైడ్లు ఏర్పడతాయి.
ఉదా: ఉన్ని, మాంసం లాంటి సహజ ప్రోటీన్లు, నైలాన్ 6, 6 లాంటి కృత్రిమ పాలీమర్.
అనే సమూహం
పునరావృతమయ్యే పాలీమర్లను పాలీ ఎస్టర్లు అంటారు. ఉదా: టెరిలీన్
సాగే గుణం ఉన్న పాలీమర్లను ‘ఎలాస్టోమర్లు’ అంటారు. ఉదా: రబ్బరు.
పోచల లాంటి నిర్మాణం ఉన్న పాలీమర్లను పోగులు (Fibres) అంటారు. ఉదా: కాటన్, నైలాన్, టెరిలీన్
వేడి చేసినప్పుడు మెత్తబడి, చల్లార్చగానే తిరిగి గట్టిపడే పాలీమర్లను ‘థర్మోప్లాస్టిక్’లు అంటారు. ఉదా: పాలీథీన్, పాలీ ఎస్టర్లు, పీవీసీ.
వేడి చేసినప్పుడు వాటి ధర్మాలను పూర్తిగా కోల్పోయి, చల్లార్చినప్పుడు తిరిగి వాటి పూర్వ రూపాలను పొందని వాటిని ఉష్ణదృఢ పాలీమర్లు లేదా థర్మోసెట్టింగ్ పాలీమర్లు అంటారు. ఉదా: బేకలైట్, యూరియా – ఫార్మాల్డిహైడ్ రెజిన్.
☛Follow our YouTube Channel (Click Here)
ముఖ్యమైన పాలీమర్లు – అనువర్తనాలు
పాలీథీన్: ఇథిలీన్(C2H4)ను పాలీమరీకరణం చేయడం ద్వారా లభించేదే పాలీథీన్. తయారీ విధానంలోని తేడా వల్ల ఇది రెండు రూపాల్లో లభిస్తుంది. మొదటిది అల్ప సాంద్రత ఉన్న పాలీథీన్ (LDPE). దీన్ని విద్యుత్ వైర్ల ఇన్సులేషన్‌లో, ఆటవస్తువులు, బాటిళ్లు, మృదువైన పైపులు, రెయిన్ కోట్లు, పాల ప్యాకెట్లు, క్యారీ బ్యాగుల తయారీలో ఉపయోగిస్తారు. రెండో రకమైంది అధిక సాంద్రత ఉన్న పాలీథీన్ (HDPE). దీన్ని బకెట్లు, చెత్తబుట్టలు, దృఢమైన బాటిళ్లు, పైపుల తయారీలో వినియోగిస్తారు.
రబ్బరు: రబ్బరు చెట్ల ద్వారా లభించే సహజ/ ముడి రబ్బరును లేటెక్స్ అంటారు. ఇది నీటిలో రబ్బరు కణాలు విస్తరించి ఉన్న ఒక కొల్లాయిడ్. రసాయనికంగా ఇది పాలీ ఐసోప్రీన్ (ఐసోప్రీన్ యొక్క పాలీమర్). సహజ రబ్బరు గట్టిదనాన్ని పెంచడానికి ‘సల్ఫర్’ను కలిపి వేడి చేసే ప్రక్రియను ‘వల్కనైజేషన్’ అంటారు.
క్లోరోప్రీన్‌ను పాలీమరీకరణం చేసి తయా రు చేసే కృత్రిమ రబ్బరును ‘నియోప్రీన్’ అంటారు. దీన్ని కన్వేయర్ బెల్టులు, గాస్కెట్ల తయారీలో ఉపయోగిస్తారు.
బ్యూటా డయీన్, ఎక్రిలోనైట్రేల్‌లను ఉపయోగించి తయారు చేసే కృత్రిమ రబ్బరు బ్యూనాృN. ఇది పెట్రోల్, ఆయిల్ లాంటి వాటితో చర్య జరపదు. అందువల్ల దీన్ని ‘ఆయిల్ సీల్’ల తయారీలో ఉపయోగిస్తారు.
పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ): దీన్ని వినైల్ క్లోరైడ్ నుంచి తయారు చేస్తారు. ఇది గట్టి పదార్థం. నీటి పైపులు, చేతి సంచులు, గ్రామఫోన్ రికార్డులు, నేల కప్పడాలు, విద్యుత్ బంధకాలతో పాటు డయాలిసిస్, రక్త మార్పిడి చేయడానికి ఉపయోగించే గొట్టాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.
నైలాన్ 6, 6: గట్టిదనం, సాగే గుణం ఉన్న దారాల తయారీలో దీన్ని వాడతారు. బ్రష్‌లు, బ్రష్‌ల ముళ్లు, తివాచీలు, చేపల వలలు మొదలైన వాటిని తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
టెఫ్లాన్: టెట్రాఫ్లోరో ఇథిలీన్ (C2F4) పాలీమర్‌ను టెఫ్లాన్ అంటారు. దీన్నే పాలీ టెట్రాఫ్లోరో ఇథిలీన్ అని కూడా అంటారు. ఇది రసాయన పదార్థాలతో చర్య జరపదు. అధిక వేడిని తట్టుకుంటుంది, క్షయం కాదు. అందువల్ల దీన్ని నాన్‌స్టిక్ వంటపాత్రలు, ఆయిల్ సీల్‌ల తయారీలో వినియోగిస్తారు.
బేకలైట్: ఫీనాల్–ఫార్మాల్డిహైడ్ సంఘనన పాలీమర్ ఇది.మొదటి దశలోని ‘నోవాలాక్’ను పెయింట్ల తయారీలో ఉపయోగిస్తారు. శాఖీయుత పాలీమర్ అయిన బేకలైట్‌ను దువ్వెనలు, ఎలక్ట్రిక్ స్విచ్‌ల తయారీలో వాడతారు.
☛☛ Follow our Instagram Page (Click Here)
పాలీమర్ | సంబంధిత మోనోమర్ |
పాలీథీన్ | ఇథిలీన్ |
పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) | వినైల్ క్లోరైడ్ |
సహజ రబ్బరు | ఐసోప్రీన్ |
కృత్రిమ రబ్బరు | క్లోరోప్రీన్ |
టెఫ్లాన్ | టెట్రా ఫ్లోరో ఇథిలీన్ |
నైలాన్ 6, 6 | ఎడిపిక్ ఆమ్లం +హెక్సా మిథిలీన్ డై ఎమీన్ (హెచ్‌ఎండీఏ) |
టెరిలీన్ (డాక్రాన్) | ఇథిలీన్ గ్లైకాల్ + డై మిథైల్ టెరిథాలేట్ |
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో పాలీమర్ ఏది?
1) సుక్రోజ్ 2) స్టార్చ్
3) సాధారణ ఉప్పు 4) నీరు
2. కిందివాటిలో సహజ పాలీమర్ కానిది ఏది?
1) సెల్యూలోజ్ 2) రబ్బరు
3) పట్టు 4) పాలీథీన్
3. సహజ రబ్బరు అనేది ఒక? (గ్రూప్–2, 2012)
1) జెల్ 2) ఘన ద్రావణం
3) పాలీమర్ 4) కొల్లాయిడ్
4. సహజ రబ్బరు దేని పాలీమర్?
1) వినైల్ క్లోరైడ్ 2) క్లోరోప్రీన్
3) ఐసోప్రీన్ 4) ఎక్రిలోనైట్రేల్
5. రబ్బరును సల్ఫర్‌తో కలిపి వేడిచేసే ప్రక్రి యను ఏమంటారు?
1) కిణ్వ ప్రక్రియ 2) వల్కనైజేషన్
3) రేషనలైజేషన్ 4) ΄్లాస్టిసైజేషన్
6. టెరిలీన్‌కు మరో పేరు?
1) రేయాన్ 2) టెఫ్లాన్
3) నియోప్రీన్ 4) డాక్రాన్
7. జతపరచండి.
ఎ) బేకలైట్ 1) థర్మోసెట్టింగ్ పాలీమర్
బి) టెరిలీన్ 2) నైలాన్ 6, 6
సి) పాలీ ఎమైడ్ 3) రేయాన్
డి) కృత్రిమ సిల్కు 4) పాలీ ఎస్టర్
ఎ బి సి డి
1) 1 2 3 4
2) 1 3 2 4
3) 4 1 2 3
4) 1 4 2 3
8. పరుపుల్లో ఫోమ్‌గా ఉపయోగించే ‘కార్బమేట్’ బంధాలున్న పాలీమర్ ఏది?
1) పీవీసీ 2) టెఫ్లాన్
3) పాలీయురీథేన్ 4) నియోప్రీన్
9. షాంపూలు, హెయిర్ కండిషనర్లలో వాడే ΄ాలీమర్?
1) పీవీసీ 2) పాలీథీన్
3) పాలీసిలికోన్ 4) పాలీబ్యూటేన్
10. వేడిని తట్టుకునే, పెట్రోల్‌తో చర్యనొందని రబ్బరు ఏది?
1) సహజ రబ్బరు
2) నియోప్రీన్ రబ్బరు
3) బ్యూనా–ఎన్
4) సిలికోన్ రబ్బరు
☛ Join our WhatsApp Channel (Click Here)
11. పగలని స్వభావం ఉన్న కిచెన్ వేర్ తయారీలో వినియోగించే పాలీమర్ ఏది?
1) పీవీసీ
2) మెలమైన్ పాలీమర్
3) సిలికోన్ పాలీమర్
4) వినైల్ పాలీమర్
12. నోవాలాక్ పాలీమర్‌ను వేటి తయారీలో ఉపయోగిస్తారు?
1) పెయింట్‌లు
2) నాన్‌స్టిక్ వంటపాత్రలు
3) పైపులు
4) చేతి సంచులు
13. నాన్‌స్టిక్ వంట పాత్రలు దేనితో పూత పూసి ఉంటాయి? (గ్రూప్–2, 2012)
1) పాలీ వినైల్ క్లోరైడ్
2) పాలీ టెట్రాఫ్లోరో ఎథిలీన్
3) పాలీ ఎథిలీన్
4 పాలీయురీథేన్
14. కృత్రిమ సిల్క్‌ను కింది విధంగా కూడా పిలువవచ్చు? (గ్రూప్–2, 2008)
1) నైలాన్ 2) రేయాన్
3) డెక్రాన్ 4) ఫైబర్ గ్లాస్
15. డయాలిసిస్, రక్త మార్పిడికి ఉపయోగించే నాళికలను ఏ పదార్థంతో రూ΄÷ందిస్తారు? (గ్రూప్–1, 2012)
1) పాలీ ఇథిలీన్
2) పాలీ సిలికాన్
3) పాలీ వినైల్ క్లోరైడ్
4) పాలీ బ్యూటేన్
16. పైపుల తయారీలో ఉపయోగించే ΄్లాస్టిక్ ఏది?
1) నైలాన్ 6, 6
2) పాలీ ఇథిలీన్
3) పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ)
4) పాలీ ఎస్టర్
17. కిందివాటిలో పాలీ ఎస్టర్ ఏది?
1) నైలాన్ 6, 6
2) పీవీసీ
3) టెరిలీన్ (డాక్రాన్)
4) సిల్కు
18. కృత్రిమ సిల్కుగా ప్రసిద్ధి చెందిన రేయాన్ తయారీకి ముడి పదార్థం ఏది?
1) సెల్యూలోజ్ 2) స్టార్చ్
3) సహజ సిల్కు 4) సహజ రబ్బరు
19. కెమెరా ఫిల్ముల తయారీలో వాడే పాలీమర్?
1) సెల్యూలోజ్ ఎసిటేట్
2) సెల్యూలోజ్ నైట్రేట్
3) స్టార్చ్
4) పీవీసీ
20. బుల్లెట్ ఫ్రూఫ్ గాజు తయారీలో వాడే పదార్థం ఏది?
1) పాలీ ఎస్టర్ 2) పాలీ కార్బొనేట్
3) పాలీ ఎమైడ్ 4) పాలీ స్పైరీన్
21. జతపరచండి.
ఎ) నైలాన్ 6, 6 1) బ్రష్‌లు
బి) పీవీసీ 2) క్యారీ బ్యాగులు
సి) అధిక సాంద్రత
ఉన్న పాలీథీన్ 3) బొమ్మలు
డి) అల్ప సాంద్రత
ఉన్న పాలీథీన్ 4) పాల ΄్యాకెట్లు
ఎ బి సి డి
1) 1 2 3 4
2) 2 3 4 1
3) 4 1 2 3
4) 3 4 1 2
22. కిందివాటిలో ‘΄ోగులు’గా వ్యవహరించని పాలీమర్ ఏది?
1) డాక్రాన్ 2) సిల్క్
3) ఉన్ని 4) టెఫ్లాన్
23. జతపరచండి.
ఎ) సెల్లోఫేన్ టేప్ 1) సెల్యూలోజ్
బి) గన్‌కాటన్ 2) సెల్యూలోజ్
ఎసిటేట్
సి) సహజ దారం
(కాటన్) 3) పాలీసిలికోన్
డి) హెయిర్ 4) సెల్యూలోజ్
కండిషనర్ నైట్రేట్
ఎ బి సి డి
1) 1 2 3 4
2) 4 3 2 1
3) 3 4 1 2
4) 2 4 1 3
24. ఐసోప్రీన్ అనేది ఒక?
1) చక్కెర 2) కృత్రిమ రబ్బరు
3) సహజ రబ్బరు
4) మత్తు పదార్థం
25. కిందివాటిలో సహజ పాలీమర్ కానిది ఏది?
1) రెజిన్ 2) జిగురు
3) సెల్యూలోజ్ 4) టెఫ్లాన్
☛ Join our Telegram Channel (Click Here)
సమాధానాలు
1) 2; 2) 4; 3) 3; 4) 3; 5) 2;
6) 4; 7) 4; 8) 3; 9) 3; 10) 4;
11) 2; 12) 1; 13) 2; 14) 2; 15) 3;
16) 3; 17) 3; 18) 1; 19) 1; 20) 2;
21) 1; 22) 4; 23) 4; 24) 3; 25) 4.
Tags
- appsc and tspsc groups study material
- chemistry material with model questions
- preparatory questions for groups
- groups exams preparation material for chemistry
- chemistry preparatory questions
- APPSC
- TSPSC
- groups exams
- groups exams preparation
- material and model questions for chemistry groups exams
- appsc and tspsc groups exam
- appsc and tspsc chemistry
- competitive exams material in chemistry
- Government Jobs
- govt jobs based exams
- Education News
- Sakshi Education News