Chemistry Material for Groups Exam : ఆక్వారీజియం అనేది వేటి మిశ్రమం?
నీరు – దాని సంఘటిత మూలకాలు
నత్రజని – దాని సమ్మేళనాలు
☛ నీటి అణువు ఆకృతి: కోణీయం
☛ నీటి స్ఫటికాలను మంచు అంటారు.
☛ ఉప్పునీటి ద్రావణాన్ని బ్రైన్ ద్రావణం అంటారు.
☛ నీటి రసాయన నామం:
హైడ్రోజన్ మోనాక్సైడ్
☛ నీటి ఘనపరిమాణాత్మక సంఘటనం:
2 ఘ.ప. H2, 1 ఘ.ప.O2
☛ నీటి విద్యుత్ వాహకతను పెంచడానికి చిటికెడు ఉప్పు/ఆమ్లాన్ని కలుపుతారు.
☛ నీటిని విశ్వద్రావణి అంటారు.
☛ నీటికి కఠినత్వం దానిలో కరిగిన Ca, Mg సల్ఫేట్స్, క్లోరైడ్‌ల వల్ల కలుగుతుంది.
☛ నీటిలో తేలియాడుతున్న మలినాలను తొలగించడానికి పటికను కలుపుతారు.
☛ ఒక లీటర్ హైడ్రోజన్ భారం: 0.09 గ్రా.
☛ ఒక లీటర్ గాలి భారం: 1.29 గ్రా.
☛ కుళ్లిన కోడిగుడ్ల వాసననిచ్చే వాయువు: H2S
☛ హేబర్ పద్ధతిలో అమ్మోనియా తయారీకి ఉపయోగించే ఉత్ప్రేరకం: Fe
☛ ఆక్సీౖహెడ్రోజన్ జ్వాల ఉష్ణోగ్రత: 2400°C
☛ ఆక్సీ ఎసిటలీన్ జ్వాల ఉష్ణోగ్రత: 3200°C
☛ నీటి వాయువు సంఘటనం: CO+H2
☛ ప్రొడ్యూసర్ వాయువు సంఘటనం: CO+ H2+N2
☛ కృత్రిమ పెట్రోల్‌ను సంశ్లేషించిన శాస్త్రవేత్త: బెర్జియిన్
☛ నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం: Ni
☛ కాపర్, పాదరసం, ప్లాటినం వంటి లోహా లు ఆమ్లం నుంచి హైడ్రోజన్‌ను విడుదల చేయవు.
☛ ఆక్సిజన్ ఇసుకలో 56 శాతం, నీటిలో 89 శాతం ఉంటుంది.
☛ ఆక్సిజన్‌ను మొదటిసారి తయారుచేసిన శాస్త్రవేత్త: షీలే
☛ ఆక్సిజన్ అని నామకరణం చేసిన శాస్త్రవేత్త: లెవోయిజర్
☛ నవీన రసాయనశాస్త్ర పితామహుడు: లెవోయిజర్
☛ H2O2ను వేడిచేసి O2ను పొందడంలో MNO2 ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు.
☛ K2Cr2O7 ద్రావణంలో ముంచిన వడ పోత కాగితాన్ని SO2 వాయువు ఆకు పచ్చగా మార్చుతుంది.
☛ తుప్పు రసాయన ఫార్ములా: Fe2O3.XH2O
☛ ఆమ్ల ఆక్సైడ్‌లకు ఉదాహరణ: SO2, P2O5, CO2, N2O3
☛ క్షార ఆక్సైడ్‌లకు ఉదాహరణ: CaO, MgO, Na2O, Fe2O3, CuO
☛ తటస్థ ఆక్సైడ్: CO
☛ గాలిలో మండించినప్పుడు బంగారు పసుపు రంగులో మండే లోహం: సోడియం
☛ విష వాయువులను విషరహిత వాయువు లుగా మార్చే పరికరం:కెటలైటిక్ కన్వర్టర్స్.
☛ నత్రజని గాలిలో 75 శాతం భార శాతంగా, 80 శాతం ఘనపరిమాణం పరంగా లభిస్తుంది.
☛ వాయువును పీడనానికి గురి చేసి, వ్యాకోచింపచేసి చల్లబరిచే విధానాన్ని జౌల్ – థామ్సన్ ప్రభావం అంటారు.
☛ అమ్మోనియం నైట్రైట్ ఒక పేలుడు పదార్థం.
☛ నైట్రోజన్ ఘనీభవన స్థానం: 210.5నిఇ
☛ హేబర్ పద్ధతిలో ఉత్ప్రేరకం:
చూర్ణ స్థితిలో ఉన్న ఇనుము
☛ హేబర్ పద్ధతిలో ఉన్న ఉత్తేజకం:
మాలిబ్డినమ్
☛ TNT పూర్తిపేరు: ట్రైనైట్రోటోలిన్
☛ అమ్మోనియా ద్రవీభవన స్థానం: –33.4°C
☛ అమ్మోనియా ఘనీభవన స్థానం: –78°C
☛ అమ్మోనియాను ఆక్సీకరణం చేస్తే ఏర్పడే పదార్థం: NO
☛ అధిక పరిమాణంలో ఉన్న క్లోరిన్‌తో అమ్మో నియా చర్య జరిపితే ఏర్పడే పదార్థం: NCl3 + HCl
☛ అధిక ఆక్సిజన్ సమక్షంలో అమ్మోనియా ఆక్సీకరణం పొందితే ఏర్పడే పదార్థం: NO2
☛ NH4Cl ను లెక్లాంచి, నిర్జల ఘటాల్లో ఉపయోగిస్తారు. దీన్ని సోల్డరింగ్‌లోనూ వాడతారు.
☛ FACT విస్తరణ రూపం: Fertilizers And Chemical Travancore
☛ అమ్మోటల్ సంఘటనం: NH4NO3+20% TNT
☛ అమ్మోనల్ సంఘటనం: NH4NO3 + Al
☛ MAP ఫార్ములా: NH4H2PO4
☛ DAP ఫార్ములా: (NH4)2HPO4
☛ అమ్మోనియం ఫాస్ఫేట్ ఫార్ములా:(NH4)3PO4
☛ కాపర్ వేడి గాఢత HNO3తో చర్య జరిపితే NO2 వాయువు వెలువడుతుంది.
☛ కాపర్ సజల నత్రికామ్లంతో చర్య జరిపితే NO వాయువు వెలువడుతుంది.
☛ జింక్ గాఢ HNO3 తో చర్య జరిపితే NO2 వాయువు వెలువడుతుంది.
☛ జింక్ సజల HNO3తో చర్య జరిపితే N2O వాయువు వెలువడుతుంది.
☛ సెల్యులోజ్ నైట్రేట్‌ను కృత్రిమ సిల్క్ అంటారు.
☛ ద్రవ రాజం 1 ఘ.ప. గాఢ HNO3+ 3 ఘ.ప. గాఢ HCl మిశ్రమం.
☛ చనిపోయిన వృక్ష, జంతు కళేబరాలను, వాటి వ్యర్థ పదార్థాలను ఆమ్మోనిఫైయింగ్ బ్యాక్టీరియా అమ్మోనియా లవణాలుగా మారుస్తుంది.
☛ అమ్మోనియా లవణాలను డీ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా నత్రజనిగా మారుస్తుంది.
☛ అమ్మోనియా లవణాలను నైట్రసోఫైయింగ్ బ్యాక్టీరియా నైట్రైట్స్‌గా మారుస్తుంది.
☛ నైట్రైట్స్‌ని నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా నైట్రేట్స్‌గా మార్చుతుంది.
☛ Pb(NO3)2ను వేడి చేసినప్పుడు NO2 జేగురు రంగు వాయువు వెలువడుతుంది.
☛ బ్రౌన్ రింగ్ వలయ ఫార్ములా: FeSO4.NO
☛ లెగ్యుమినేసి కుటుంబ మొక్కల వేరు బుడిపెలలో ఉండే బ్యాక్టీరియా: రైజోబియం
☛ అద్దకం పరిశ్రమల్లో ఉపయోగించే లవణం: NH4Cl
☛ ఆస్వాల్డ్ పద్ధతిలో తయారు చేసే ఆమ్లం: HNO3
☛ NCl3 ఒక పేలుడు పదార్థం.
☛ KNO3ని వియోగం చెందిస్తే వెలువడే వాయువు O2
మాదిరి ప్రశ్నలు
1. ద్రవ నైట్రోజన్ ఉపయోగం?
ఎ) పేలుడు పదార్థంగా
బి) శీతలీకరణ కారకంగా
సి) ఆక్సీకరణ కారకంగా
డి) ప్రయోగశాల కారకంగా
2. పెద్ద మొత్తంలో అమ్మోనియాను తయారు చేసే పద్ధతి?
ఎ) హేబర్ పద్ధతి
బి) సీమన్–మార్టిన్ పద్ధతి
సి) కాస్ట్నర్– కెల్నర్ పద్ధతి
డి) స్పర్శా పద్ధతి
3. గాలిలో నైట్రోజన్ శాతం?
ఎ) 99.5 బి) 75
సి) 22 డి) 80
4. మెగ్నీషియం.. నైట్రోజన్‌తో మండి ఏర్పర్చే సమ్మేళనం?
ఎ) Mg2N3 బి) Mg3N2
సి) MgN డి) MgNO3
5. అమ్మోనియం నైట్రేట్ ద్వారా నీటి ఆవిరిని పంపితే వెలువడే వాయువు?
ఎ) ఆక్సిజన్ బి) అమ్మోనియా
సి) నైట్రోజన్ డి) హైడ్రోజన్
6. ద్రవ నైట్రోజన్ మరిగే స్థానం?
ఎ) -183°C బి) -210.5°C
సి) -273°C డి) -196°C
7. ఒక వాయువును పీడనానికి గురిచేసి వ్యాకోచింప చేసి చల్లబరిచే విధానాన్ని ఏమంటారు?
ఎ) సీబెక్ ప్రభావం
బి) రామన్ ప్రభావం
సి) న్యూటన్ ప్రభావం
డి) జౌల్–థామ్సన్ ప్రభావం
8. అధిక పరిమాణం గల క్లోరిన్‌తో అమ్మో నియా చర్య ΄÷ందితే ఏర్పడే పదార్థం?
ఎ) N2 బి) NH4Cl
సి) NCl3 డి) NCl3+HCl
9. అధిక ఆక్సిజన్ సమక్షంలో అమ్మోనియా ఆక్సీకరణం ΄÷ందితే ఏర్పడే పదార్థం?
ఎ) N2 బి) NO2
సి) N2O డి) N2O3
10. అమ్మోనియాను ఆక్సీకరణం చెందిస్తే ఏర్పడే పదార్థం?
ఎ) NO బి) N2O
సి) NO2 డి) N2O3న
11. సోడామైడ్ రసాయన ఫార్ములా
ఎ) NaNH2 బి) NaCl
సి) NaNO3 డి) NaNO2
12. ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అవక్షేపం రంగు?
ఎ) లేత నీలం బి) ΄ాలిన ఆకుపచ్చ
సి) బ్రౌన్ రంగు డి) తెలుపు
13. జిప్సం రసాయన ఫార్ములా?
ఎ) CaSO4 బి) CaSO42H2O
సి) CaSO4.½H2O డి) CaCO3
14. మోనో అమ్మోనియా ఫాస్ఫేట్ ఫార్ములా?
ఎ) (NH4)3PO4 బి) NH4H2PO4
సి) (NH4)2HPO4
డి) (NH4)2PO4
15. కాలికో ప్రింటింగ్‌లో ఉపయోగించే అమ్మోనియా లవణం?
ఎ) అమ్మోనియా సల్ఫేట్
బి) అమ్మోనియా ΄ాస్ఫేట్
సి) అమ్మోనియా క్లోరైడ్
డి) అమ్మోనియా డయోడ్
16. జింక్‌తో గాఢ నత్రకామ్లం చర్య జరిపితే ఏర్పడే నైట్రోజన్ ఆక్సైడ్?
ఎ) NO2 బి) N2O
సి) N2O3 డి) NO
17. కాపర్‌పై సజల నత్రికామ్లం వల్ల ఏర్పడే నైట్రోజన్ ఆక్సైడ్?
ఎ) NO2 బి) N2O
సి) N2O3 డి) NO
18.
చర్యలో ఆయోడిన్?
ఎ) క్షయకరణం చెందింది
బి) రంగు కోల్పోయింది
సి) ఆక్సీకరణం చెందింది
డి) తటస్థీకరణం చెందింది
19. ఆక్వారీజియం అనేది వేటి మిశ్రమం?
ఎ) గాఢ HCl+ గాఢ H2SO4
బి) గాఢ HNO3 + గాఢ HCl
సి) గాఢ HNO3 + గాఢ H2SO4
డి) గాఢ HNO3+ గాఢ H3PO4
20. సజల నత్రికామ్లం ఏ లోహంతో చర్య జరిపి H2 వాయువును వెలువరిస్తుంది?
ఎ)Zn బి) Cu సి) Ag డి)Mg
21. వేరు బుడిపెలు కలిగి నత్రజని స్థాపన చేయగల మొక్క?
ఎ) మొక్కజొన్న బి) చిక్కుడు
సి) వరి డి) వెదురు
22. నత్రజనిని స్థాపించగల బ్యాక్టీరియా?
ఎ) అమ్మోనిఫైయింగ్
బి) నైట్రసోఫైయింగ్
సి) సహజీవన
డి) నైట్రిఫైయింగ్
23. వెండి, బంగారం శుద్ధిలో వాడే ఆమ్లం?
ఎ) H2SO4 బి) HCl
సి) H3PO4 డి) HNO3
24. హేబర్ పద్ధతిలో ఉపయోగించే ఉత్ప్రేరకం?
ఎ) Ni బి) Fe
సి) Mo డి)Pt
25. లెడ్ నైట్రేట్‌ను వేడిచేస్తే వెలువడే వాయువు?
ఎ) NO బి) N2O
సి) N2O3 డి) NO2
సమాధానాలు
1) బి; 2) ఎ; 3) డి; 4) బి; 5) సి;
6) డి; 7) డి; 8) డి; 9) బి; 10) ఎ;
11) ఎ; 12) సి; 13) బి; 14) బి; 15) సి;
16) ఎ; 17) డి; 18) సి; 19) బి; 20) డి;
21) బి; 22) సి; 23) డి; 24) బి; 25) డి.
గతంలో అడిగిన ప్రశ్నలు
1. సోడియం నైట్రేట్‌ను పరీక్షనాళికలో తీసుకొని వేడి చేస్తే పరీక్షనాళికలో మిగిలి ఉండే పదార్థం? (DSC-2006)
ఎ) సోడియం నైట్రైట్ బి) NO2
సి) O2 డి) ఏదీకాదు
2. నీటి శాశ్వత కాఠిన్యతకు కారణం?
ఎ) Ca, Mgల సల్ఫేట్స్, కార్బొనేట్స్
బి) Ca, Mgల సల్ఫేట్స్, క్లోరైడ్స్
సి) Ca, Mgల బైకార్బొనేట్స్
డి) Ca, Mgల నైట్రేట్స్
3. తాత్కాలిక కాఠిన్యత గల నీటిని మరిగిస్తే వెలువడే పదార్థం?
ఎ) CaCO3 బి) నీరు
సి) CO2 డి) అన్నీ
4. ఫాస్ఫారిక్ ఆమ్ల సంకేతం?
ఎ) H3PO3 బి) H3PO4
సి) HPO3 డి) H2SO4
సమాధానాలు
1) ఎ; 2) బి; 3) డి; 4) బి
Tags
- groups exams
- chemistry material for groups exams
- Competitive Exams
- preparatory and model questions for groups exams
- appsc and tspsc group exams
- chemistry material for appsc
- groups exams material
- chemistry questions for group exams
- previous and preparatory questions for group exams
- previous and preparatory questions for chemistry exams
- group exams chemistry model questions
- preparatory questions
- multiple choice questions for chemistry group exams
- Education News
- Sakshi Education News