Geography Material and Bit Banks : సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి?
జీవ వైవిధ్య సంరక్షణ
(అటవీ వనరుల, వన్యజాతి జీవుల సంరక్షణ)
జీవావరణంలోని సమస్త జీవజాతుల మధ్య ఉన్న జన్యుపరమైన, జాతులపరమైన, ఆవరణ వ్యవస్థల పరమైన తేడాలు, వైవిధ్యతలనే జీవ వైవిధ్యతగా పరిగణిస్తారు. పర్యావర ణ, ఆహార, వైద్య, వాణిజ్య, పారిశ్రామిక, సామాజిక, సాంస్కృతిక, సౌందర్యపరంగా జీవ వైవిధ్య ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత, భవిష్యత్ తరాలకు జీవ వనరులను అందుబాటులో ఉంచుతూ, సుస్థిరాభివృద్ధి సాధించడానికి సాంకేతిక విజ్ఞానం ద్వారా జీవ వైవిధ్యతను సమర్థంగా నిర్వహించడమే జీవ వైవిధ్య సంరక్షణ.
జీవ వైవిధ్య సంరక్షణలో ఇమిడి ఉన్న అంశాలు:
1. మానవ చర్యల వల్ల ప్రమాదస్థితిలో ఉన్న వన్య, వృక్ష, జంతుజాతులను గుర్తించి, వాటిని పునఃస్థాపితం చేసే రక్షణ ప్రణాళికలను రూపోందించాలి.
బయోస్పియర్ రిజర్వ్ | రాష్ట్రం |
నీలగిరి (దేశంలోని మొదటి బయోస్పియర్, 1986లో ప్రకటించారు. | తమిళనాడు |
అగస్త్యమలై | కేరళ |
గల్ఫ్ ఆఫ్ మన్నార్ | తమిళనాడు |
గ్రేట్ నికోబార్ | అండమాన్ నికోబార్ |
సిమ్లిపాల్ | ఒడిశా |
అమర్ కంటక్– అదానకర్ | మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ |
పాంచ్‌మర్హి | మధ్యప్రదేశ్ |
సుందర్‌బన్ | వెస్ట్‌బెంగాల్ |
దిబ్రూసికాయ్ | అసోం |
మానస | అసోం |
నోక్రేక్ | మేఘాలయ |
దిబాంగ్–దెహాంగ్ | అరుణాచల్‌ప్రదేశ్ |
కాంచనజంగా | సిక్కిం |
నందాదేవి | ఉత్తరాఖండ్ |
రాణ్ ఆఫ్ కచ్ | గుజరాత్ |
కోల్డ్ డెసర్ట్ | హిమాచల్‌ప్రదేశ్ |
శేషాచల | ఆంధ్రప్రదేశ్ |
పన్నా |
మధ్యప్రదేశ్ |
2. ప్రమాద స్థితిలో ఉన్న జాతుల బీజద్రవ్యాలను, విత్తనాలను, పిండాలను భద్రపరిచే ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలి
3. దేశవాళి రకాల జాతుల ఆవాసాలను గుర్తించి, వాటి పరిరక్షణకు రక్షిత ప్రాంతాలను గుర్తించాలి. జీవ జాతుల అక్రమ రవాణాను, అంతర్జాతీయ వ్యాపారాన్ని అరికట్టే శాసనాలు, చట్టాలను అమలు చేయాలి.
4. బహుళ జాతి కంపెనీలు సాగించే జీవ చౌర్యాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలి.
➡︎ జీవ వైద్య సంరక్షణకు రెండు రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. అవి..
1) IN-Situ సంరక్షణ (ఆవాసాంతర సంరక్షణ)
2) Ex-Situ సంరక్షణ(ఆవాసేతర సంరక్షణ)
☛Follow our YouTube Channel (Click Here)
IN-Situ సంరక్షణ:
ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను వాటి జన్యు సంపదను అదే భౌగోళిక ప్రాంతంలో మానవ ప్రమేయంతో రక్షించే విధానమే IN-Situ సంరక్షణ. ఈ పద్ధతిలో సమాజానికి లాభం కలిగించే విభిన్న రకాల రక్షిత ప్రాంతాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ విధానంలో 4 రకాల కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. అవి..
ఎ) జాతీయ పార్కులు:
ప్రకృతి సంపద, సుందర ప్రదేశాలు, దృశ్యాలు, వన్యజీవులను సంరక్షించేందుకు జాతీయ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల నుంచి వంట చెరకును సేకరించుకోవడం, పశువులను మేపుకోవడం, అటవీ ఉత్పత్తులను సేకరించడం నిషిద్ధం. ఈ ప్రాంతాలపై వ్యక్తిగత హక్కులు ఉండవు. జాతీయ పార్కుల హద్దులను శాసనం ద్వారా నిర్ణయిస్తారు. ప్రస్తుతం దేశంలో 4.2 మిలియన్ హెక్టార్లలో (దేశ భూభాగంలో 1.3శాతం) 97 జాతీయ పార్కులు ఉన్నాయి.
బి) వన్యమృగ సంరక్షణ కేంద్రాలు (అభయారణ్యాలు):
వీటిని వన్య్రపాణుల సంరక్షణకు కేటాయించిన ప్పటికీ వీటి సరిహద్దులను శాసనం ద్వారా నిర్ణయించరు. ఇక్కడి వన్య్రపాణులకు కీడు కలిగించనంత వరకు అటవీ కార్యకలాపాలను చేప ట్టేందుకు అనుమతి ఉంది. ప్రస్తుతం 12 మిలియన్ల హెక్టార్ల భూభాగంలో (దేశభూభాగంలో 3.7 శాతం) 512 జాతీయ పార్కులు ఉన్నాయి.
సి) బయోస్పియర్ రిజర్వ్:
ఏదైనా భౌగోళిక ప్రాంతంలో వృక్ష, జంతుజాతులు, వాటి జన్యువుల పరిరక్షణ, గిరిజనుల జీవనశైలి, పెంపుడు మొక్కల, జంతువుల జన్యు ఆధారాలను సంరక్షించేందుకు ఏర్పాటైన బహుళ ప్రయోజనకర రక్షిత ప్రాంతాలే బయోస్పియర్ రిజర్వ్‌లు. యునెస్కో ఆధ్వర్యంలో ఏర్పాటైన మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ (1971) ప్రస్తుతం దేశంలో 19 బయోస్పియర్ ప్రాంతాలను ప్రకటించింది.
డి) దుర్బల, ప్రమాద స్థితిలో ఉన్న జీవజాతుల పరిరక్షణకు ప్రత్యేక పథకాలు:
ప్రాజెక్టు టైగర్:
అంతరించిపోతున్న పులుల సంతతిని పరిరక్షించడానికి, వాటి సంఖ్యను పెంపోందించడానికి, వాటిలోని సౌందర్య, సాంస్కృతిక, వాణిజ్య, ఆవరణ వ్యవస్థల పరమైన విలువలను కా΄ాడడానికి 1973 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద దేశంలో 55 పులి సంరక్షణా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పులిసంరక్షణా కేంద్రాలు, పులులు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. అందుకే దీన్ని పులి రాష్ట్రంగా పిలుస్తారు. అంతేకాకుండా పులిని 1973లో జాతీయ జంతువుగా ప్రకటించారు.
☛ Follow our Instagram Page (Click Here)
జాతీయ పార్కు/ వన్యమృగ సంరక్షణ కేంద్రం |
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం | ప్రత్యేకత |
దచిగాం జాతీయ పార్కు | జమ్మూ కాశ్మీర్ | హంగుల్ (కాశ్మీరి దుప్పి) |
సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం | జమ్మూ కాశ్మీర్ | హిమాలయన్ మంచుకోడి |
జిమ్ కార్బెట్ జాతీయ పార్కు (దేశంలోనే తొలి జాతీయ పార్కు) | ఉత్తరాఖండ్ | పులులు |
ఘనా పక్షి సంరక్షణ కేంద్రం | రాజస్థాన్ | సైబీరియన్ కొంగలు |
ఖాజీరంగా జాతీయ పార్కు | అసోం | ఒంటికొమ్ము ఖడ్గమృగం |
వాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు | ఉత్తరాఖండ్ పరిరక్షణ | భిన్నరకాల పుష్పజాతుల |
సరిస్కా వన్యమృగ సంరక్షణ కేంద్రం | రాజస్థాన్ | పులులు |
కన్హా జాతీయ పార్కు | మధ్యప్రదేశ్ | పులులు |
కన్నేర్‌ఘాట్ జాతీయ పార్కు | చత్తీస్‌గఢ్ | పులులు |
కంచర గాడిదల సంరక్షణా కేంద్రం | గుజరాత్ | కంచర గాడిదలు |
గిర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం | గుజరాత్ | సింహాలు |
బోరివిల్లా జాతీయ పార్కు | మహారాష్ట్ర | అరిచే జింకలు |
బన్నేర్‌ఘాట్ జాతీయ పార్కు | బెంగళూరు | ప్రపంచంలో అతిపెద్ద సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం |
సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు | కేరళ | మకాక్ కోతులు (సింహపు తోక ఉన్న కోతులు) |
పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం | కేరళ | ఏనుగులు, పులులు |
రాజీవ్‌గాంధీ పులుల సంరక్షణ కేంద్రం | ఆంధ్రప్రదేశ్ | పులులు |
ప్రాజెక్టు ఎలిఫెంటా: ఏనుగుల సంతతిని పెంచడానికి 1992లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో 33 ఏనుగు సంరక్షణా కేంద్రాలున్నాయి.
ప్రాజెక్టు క్రోకోడైల్: మొసళ్ల పరిరక్షణకు 1975 నుంచి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఎనిమిది రాష్ట్రాల్లో 34 మొసలి సంరక్షణా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ప్రాజెక్టు సీ టర్టుల్స్: సముద్ర తాబేళ్ల పరిరక్షణకు 1975లో ఈ పథకాన్ని ఒడిశాలోని గహిర్‌మతాబీచ్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో రిడ్లే రకానికి చెందిన తాబేళ్లను పరిరక్షిస్తున్నారు.
2) Ex-Situ సంరక్షణ:
ఏదైనా భౌగోళికప్రాంతంలో అంతరించే స్థితిలో ఉన్న జీవ జాతులను వాటి సహజ ఆవాసాలకు వెలుపల పరిరక్షించే విధానమే Ex-Situ సంరక్షణ. ఈ విధానంలో జీవజాతులు, వాటి నమూనాలను, విత్తన, పిండ నిల్వల బ్యాంకులు, కణజాల వర్థన కేంద్రాలు, జన్యుబ్యాంకులు, బీజ ద్రవ్య బ్యాంకులు, చేపల గుడ్ల నిల్వ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలో సంరక్షిస్తారు.
పైన తెలిపిన విధానాలతోపాటు దేశంలో అనేక చట్టాలు, పరిశోధనా కేంద్రాలను కూడా జీవవైవిద్య సంరక్షణలో భాగంగా రూపోందించి అమలు చేస్తున్నారు. అవి..
☛ Join our WhatsApp Channel (Click Here)
1. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కోల్‌కతా
2. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్
3. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, డెహ్రాడూన్
4. అరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్– జోద్‌పూర్(రాజస్థాన్)
5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్రీ– డెహ్రాడూన్
6. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ–బెంగళూరు
7. ట్రోఫికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – జబల్‌పూర్(మధ్యప్రదేశ్)
8. హిమాలయా ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సిమ్లా(హిమాచల్ ప్రదేశ్)
9. సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ ఆఫ్ ఎకొలాజికల్ రిహాబిలిటేషన్–అలహాబాద్
10. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్–భో΄ాల్
11. వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్
12. జీబీ పంథ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్– అల్‌మోరా(ఉత్తరాఖంఢ్)
13. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్– నాగ్‌పూర్
మాదిరి ప్రశ్నలు
1. n-Situ జీవ వైవిధ్య సంరక్షణా విధానంలో ఒక కార్యక్రమం కానిది?
1) జాతీయ పార్కులు
2) ప్రాజెక్ట్ టైగర్
3) బయోస్పియర్ రిజర్వ్
4) ఉద్యానవనాలు
2. కన్హా జాతీయ పార్కు ఏ నది ఒడ్డున ఉంది?
1) చంబల్ 2) బెట్వా
3) కెన్ 4) సోన్
3. సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందిన పక్షి సంరక్షణా కేంద్రం?
1) నేలపట్టు 2) సలీంఅలీ
3) ఘనా 4) సుల్తాన్‌పూర్
4. కన్నేర్‌ఘాట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1) జార్ఖండ్ 2) కర్ణాటక
3) చత్తీస్‌గఢ్ 4) మధ్యప్రదేశ్
5. దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్?
1) సుందర్‌బన్
2) గల్ఫ్ ఆఫ్ మన్నార్
3) కాంచనజంగా
4) నీలగిరి
6. అరిచే జింకలకు ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణా కేంద్రం?
1) కన్హా 2) సైలెంట్ వ్యాలీ
3) బోరివిల్లా 4) రణతంబోర్
7. సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి?
1) పులులు
2) ఏనుగులు
3) మకాక్ కోతులు
4) సీతాకోక చిలుకలు
☛ Join our Telegram Channel (Click Here)
8. నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఏ సరస్సు ఒడ్డున ఉంది?
1) కొల్లేరు 2) సాంబార్
3) చిల్కా 4) పులికాట్
9. పులి రాష్ట్రంగా దేన్ని పిలుస్తారు?
1) చత్తీస్‌గఢ్ 2) మధ్యప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్ 4) అసోం
సమాధానాలు
1) 4 2) 2 3) 3 4) 3 5) 4
6) 3 7) 3 8) 4 9) 2
Tags
- groups exams material
- study material for groups exams
- appsc and tspsc groups exams material
- geography material for appsc and tspsc
- groups exams for govt jobs
- competitive exams study material
- appsc and tspsc geography
- geography material and questions for competitive exams
- Education News
- Sakshi Education News
- Geography Material and Bit Banks