NAAC 'A' Grade for Degree College : న్యాక్ 'ఏ' గ్రేడ్‌ను సాధించిన ఉరవకొండ డిగ్రీ కళాశాల..
ఉరవకొండ: గ్రామీణ ప్రాంత పరిధిలో ఉరప కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల న్యాక్ 'ఏ' గ్రేడ్ సాధించింది. ఈ కేటగిరిలో రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన ఐదవ కళాశాలగా నిలిచింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రిన్సి పాల్ డాక్టర్ రామకృష్ణ అధ్యాపకులతో కలిసి మీడియాకు వెల్లడించారు.
Wipro Company Hirings: గుడ్‌న్యూస్ చెప్పిన 'విప్రో' కంపెనీ.. త్వరలోనే 12వేల ఉద్యోగాలు
ఈ నెల 19, 20 తేదీల్లో ఉరవకొండ డిగ్రీ కళాశాలకు న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) బృందం సందర్శించిందన్నారు. బోధన పద్ధతులు, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన వంటివి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. న్యాక్ 'ఏ' గ్రేడ్ గుర్తింపుతో కళాశాలకు అటానమస్ రావడానికి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. 'ఏ' గ్రేడ్ రావడానికి కృషి చేసిన అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరికీ ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలిపారు.
Job Mela: సెప్టెంబర్ 2వ తేదీ జాబ్‌మేళా.. ఎంపికైయ్యాక నెల జీతం ఎంతంటే..