IAS Divyanshu Choudhary: బ్యాంకు జాబ్ వదిలేసి.. ఐఏఎస్ సాధించిన కుర్రాడు... పక్కా ప్లానింగ్‌తో చదివినప్పుడే...
ఆయనకు సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఆల్ ఇండియా 30వ ర్యాంకు సాధించిన దివ్యాన్షు చౌదరి సక్సెస్ జర్నీ మీకోసం.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన దివ్యాన్షు చిన్ననాటి నుంచే మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కనేవాడు. అందుకు అనుగుణంగా చదివేవాడు. పాఠశాల విద్యనంతా స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పూర్తి చేశాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత బిట్స్ పిలానీలో సీట్ సాధించాడు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్(ఈసీఈ) ఇంజనీరింగ్ లో B.Tech పూర్తి చేశాడు. ఇంజినీరింగ్ తర్వాత కోల్‌కతాలోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత ఏడాది పాటు హెచ్ఎస్‌బీసీ(HSBC) బ్యాంకులో పనిచేశారు.
➤☛ 1.6 కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన ఎన్ఐటీ అమ్మాయి
బ్యాంకులో ఉన్నతస్థానంలో విధులు నిర్వహిస్తున్నా అతనికి అది ఏ మాత్రం సంత`ప్తిని ఇవ్వలేదు. తన లక్ష్యం ఇది కాదేమో అని అనుకున్నాడు. తన టార్గెట్ ఐఏఎస్ అని నిర్ణయించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసేసి సివిల్స్ వైపు అడుగులు వేశాడు.
తన మకాంను ఢిల్లీకి మార్చాడు. కేవలం ప్రిపరేషన్ పైనే ధ్యాస పెట్టాడు. తనకు గణితం కొట్టిన పిండి. దీంతో ఆప్షనల్ సబ్జెట్‌గా గణితాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇక రోజుకు 8 గంటల పాటు ప్రిపేరయ్యేవారు. ఇలా ఏడాది గడిచింది. ఎన్నో ఆశలతో సివిల్స్ ఎగ్జామ్ రాశారు. కానీ, ఫలితం రాలేదు.
➤☛ మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
కానీ, నిరాశ చెందలేదు. ఫస్ట్ అటెంప్ట్ లో ఏ తప్పులు చేశాడో.. వాటిని మళ్లీ పునరావ`తం చేయొద్దని నిర్ణయించుకున్నాడు. ఈ సారి ప్రిపరేషన్ సమయాన్ని పెంచాడు. రెండు గంటల పాటు పేపర్ నే చదివేవాడు. తర్వాత ప్రిలిమ్స్ పరీక్ష కోసం దాదాపు 50 మాక్ టెస్ట్‌లు రాశాడు. తన కష్టం ఫలించింది. రెండో అటెంప్ట్‌లో ఆల్ ఇండియా 30వ ర్యాంకు సాధించి అదరగొట్టాడు.
సివిల్స్ కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రిపరేషన్ తో పాటు ఆప్షనల్ సబ్జెట్‌ను ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు. ప్రిపరేషన్ కోసం ఇంటర్నెట్‌ను విరివిగా ఉపయోగించుకోవాలని, వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్‌లను రాయాలని సూచిస్తున్నాడు. అలాగే మెయిన్స్‌లో సత్తా చాటేందుకు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలని చెబుతాడు.
➤☛ ఐఏఎస్ కావాలనుకున్నాడు... ఇప్పుడు టీ అమ్ముతూ 150 కోట్లు సంపాదిస్తున్నాడు
ప్రస్తుతం దివ్యాన్షు మధ్యప్రదేశ్ లోని బేతుల్(Betul) లో అసిస్టెంట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
దివ్యాన్షు గురించి మరిన్ని వివరాలు....
యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్టు గా - మ్యాథమెటిక్స్ ను దివ్యాన్షు ఎంపిక చేసుకున్నాడు. 2020లో తన ఆప్షనల్ పేపర్లో 500కు 285 మార్కులు సాధించాడు.
ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఏడాది పాటు హెచ్ఎస్‌బీసీ(HSBC) బ్యాంకులో పనిచేశారు.
చదువుతో పాటు ఆటల్లోనూ దివ్యాన్షు ఉత్సాహంగా పాల్గొనే వాడు. హిందీ కథలు రాయడం, భారతీయ పురాణాలను చదవడం లాంటివి హాబీస్. దివ్యాన్షు రాసిన కొన్ని ఆర్టికల్స్ ప్రాంతీయ వార్తాపత్రికలలో కూడా ప్రచురితమయ్యాయి.
2020లో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షల్లో 1006 మార్కులు సాధించి, ఆల్ ఇండియా 30వ ర్యాంకు సాధించాడు. పర్సనాలిటీ టెస్ట్‌లో 206 మార్కులు సాధించాడు.