CAT 2025 Guidance: క్యాట్.. మలిదశకు సిద్ధమా!.. ఐఐఎంల ఎంపిక ప్రక్రియ, సన్నద్ధత తదితర వివరాలు..

గత ఏడాది కంటే ఈ సంవత్సరం క్యాట్ ప్రశ్నలు కాసింత సులభంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది మాదిరిగానే ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు. ఎంసీక్యూలకు నెగెటివ్ మార్కింగ్‌ను పేర్కొన్నారు. ఐఐఎంలు మలిదశ ఎంపిక ప్రక్రియకు క్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ ఏడాది తొలితరం ఐఐఎంల్లో కటాఫ్ పర్సంటైల్ 99–100 మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మిగిలిన ఐఐఎంలలో కటాఫ్ పర్సంటైల్ 94–95 మధ్యలో ఉండొచ్చని పేర్కొంటున్నారు.
స్లాట్‌ల వారీగా కటాఫ్‌ల అంచనా
- ఈ ఏడాది మూడు స్లాట్‌లో పరీక్ష నిర్వహించారు. ఆయా స్లాట్‌ల వారీగా కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. స్లాట్–1లో 90, స్లాట్–2లో 95, స్లాట్–3లో 99 పర్సంటైల్ కటాఫ్ అంచనాగా ఉంది.
- సెక్షన్ల వారీగా వీఐఆర్‌సీ స్లాట్–1లో 85, స్లాట్–2లో 95, స్లాట్–3లో 99, డీఐఎల్‌ఆర్‌లో స్లాట్–1లో 85, స్లాట్–2లో 95, స్లాట్–3లో 99 అంచనాగా ఉంది. క్వాంటిటేటివ్ ఎబిలిటీలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా మూడు స్లాట్లను నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా క్రోడీకరించి పర్సంటైల్స్‌ను నిర్ధారించే క్రమంలో.. 92 నుంచి 99 స్కోర్‌తో 99 పర్సంటైల్, 69–75 స్కోర్‌తో 95 పర్సంటైల్, 57–63 స్కోర్‌తో 90 పర్సంటైల్ పొందే అవకాశం ఉంది.
కటాఫ్ పర్సంటైల్ నిబంధన
ఐఐఎంలు క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్ స్కోర్ తప్పనిసరని పేర్కొంటున్నాయి. ఆయా ఐఐఎంలు క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్ పర్సంటైల్ ఉన్న వారికే మలిదశకు దరఖాస్తుకు అర్హత కల్పిస్తున్నాయి. కనీసం 80, గరిష్టంగా 95 పర్సంటైల్‌ను కటాఫ్ పర్సంటైల్‌గా నిర్దేశిస్తున్నాయి. తుది జాబితా రూపకల్పనలో గత రెండు, మూడేళ్లుగా 93 శాతంపైగా పర్సంటైల్ ఉంటేనే ప్రవేశం ఖరారైనట్లు స్పష్టమవుతోంది.
ఐఐఎం–కోల్‌కత, ఐఐఎం–అహ్మదాబాద్ వంటి తొలి తరం ఐఐఎంలలో ప్రవేశం పొందాలంటే.. 99కి పైగా పర్సంటైల్ ఉంటేనే సాధ్యమని గత ప్రవేశాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
చదవండి: AP/TS ICET 2024 Notification: ఎంబీఏ, ఎంసీఏకు మార్గం.. ఐసెట్
క్యాట్ ప్రశ్నపత్రం ఇలా
- క్యాట్–2024లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ సెక్షన్‌లో.. ప్రశ్నల సంఖ్య పెరిగింది. గత ఏడాది 20 ప్రశ్నలతోనే ఈ విభాగంలో ప్రశ్నలు ఉంటే.. ఈ ఏడాది 22 ప్రశ్నలు అడిగారు. మిగతా రెండు విభాగాల్లో.. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 24 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 22 ప్రశ్నలు అడిగారు. ఈ రెండు సెక్షన్ల ప్రశ్నల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. దీంతో.. మొత్తం 68 ప్రశ్నలతో క్యాట్ పరీక్షను నిర్వహించారు.
- ప్రతి విభాగంలోనూ బహుళైచ్ఛిక ప్రశ్నలు(ఎంసీక్యూ)తోపాటు నాన్–ఎంసీక్యూలు కూడా అడిగారు. వీఏఆర్‌సీ విభాగంలో నాలుగు, డీఐఎల్‌ఆర్‌లో 8, క్యూఏలో 7 నాన్–ఎంసీక్యూలు అడిగారు. దీంతో.. విద్యార్థులకు కొంత సమయాభావ సమస్య ఎదురైంది.
- మూడు స్లాట్లలో నిర్వహించిన క్యాట్–2024లో మూడు సెక్షన్లలోనూ ఎంసీక్యూలు, నాన్–ఎంసీక్యూలు సమ్మిళితంగా ప్రశ్నలు అడిగారు. వీటికి నెగెటివ్ మార్కింగ్ నిబంధన లేకపోవడం విద్యా ర్థులకు ఊరట కలిగించే అంశంగా చెప్పొచు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
మలి దశకు మెరుగులు ఇలా
క్యాట్ కటాఫ్ అంచనాలపై అవగాహన ఏర్పడిన అభ్యర్థులు.. ఐఐఎంలు మలిదశలో నిర్వహించే ఎంపిక ప్రక్రియకు సన్నద్ధత ప్రారంభించాలి.
ఆర్‌ఏటీ, గ్రూప్ డిస్కషన్
ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. తదుపరి దశలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలోనూ విజయం సాధిస్తే.. ఐఐఎంల్లో ప్రవేశం ఖరారవుతుంది.
గ్రూప్ డిస్కషన్
మలి దశ ఎంపికకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఆయా ఐఐఎం క్యాంపస్‌లలో తొలుత గ్రూప్ డిస్కషన్(జీడీ) నిర్వహిస్తారు. ఈ జీడీలో అభ్యర్థులను బృందాలుగా విభజించి ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దానిపై చర్చించమంటారు. కోర్ నుంచి కాంటెంపరరీ వరకు అనేక అంశాలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్
క్యాట్‌కు హాజరైన అభ్యర్థులు రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌పైనా పట్టు సాధించాలి. ఇందులో నిర్దిష్టంగా ఏదైనా ఒక అంశాన్ని పేర్కొని.. అభ్యర్థుల అభిప్రాయం తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయా అంశానికి సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల పదాల మధ్యలో అభ్యర్థులు తమ సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ అంశాలు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్ అవేర్‌నెస్ సమ్మిళితంగా ఉంటున్నాయి.
పర్సనల్ ఇంటర్వ్యూ
గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో విజయం సాధించిన విద్యార్థులు.. చివరిగా ఎదుర్కోవాల్సిన ప్రక్రియ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో.. సదరు విద్యార్థికి మేనేజ్‌మెంట్ విద్య పట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, అతని భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు ఎంచుకున్న మార్గాలు తదితర అంశాలను నిపుణులైన ప్రొఫెసర్స్ కమిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
వెయిటేజీతో తుది ఎంపిక
- ఐఐఎంలలో తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసే క్రమంలో.. క్యాట్ స్కోర్, జీడీ, ఆర్‌ఏటీ, పర్సనల్ ఇంటర్వ్యూలలో ప్రతిభతోపాటు మరెన్నో అంశాలను ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
- వంద మార్కుల వెయిటేజీ ఫార్మట్‌లో 35 నుంచి 50 శాతం మేరకు జీడీ, పీఐలకు వెయిటేజీ ఉంటోంది.
- డైవర్సిటీ వెయిటేజీ పేరుతో జండర్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీలకు మూడు నుంచి అయిదు శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నారు.
- పలు ఐఐఎంలు అకడమిక్ వెయిటేజీ నిబంధన కూడా అమలు చేస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు ఒక్కో కోర్సుకు ప్రత్యేకంగా వెయిటేజీ ఉంటోంది. అన్ని ఐఐఎంలు ఈ వెయిటేజీని ఒక్కో కోర్సుకు పది శాతంగా పరిగణిస్తున్నాయి.
- అకడమిక్ వెయిటేజీలోనే ప్రొఫెషనల్ అర్హతలున్న వారికి ప్రత్యేక వెయిటేజీని ఐఐఎంలు కల్పిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు చదివిన విద్యార్థులకు ఇచ్చే ఈ వెయిటేజీ రెండు నుంచి మూడు శాతం మధ్యలో ఉంటోంది.
- అదే విధంగా.. పని అనుభవానికి అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. దీంతోపాటు.. మహిళా విద్యార్థులు మేనేజ్‌మెంట్ పీజీలో చేరేలా ప్రోత్సహించేందుకు ఐఐఎంలు జండర్ డైవర్సిటీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇందుకోసం రెండు నుంచి మూడు పాయింట్ల వరకు జండర్ డైవర్సిటీ పేరుతో మహిళా విద్యార్థులకు కేటాయిస్తున్నారు.
‘క్యాట్’ స్కోర్‌కు 40 శాతం
ఐఐఎంలు ఆయా ప్రోగ్రామ్‌లకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో క్యాట్ స్కోర్‌కు కల్పిస్తున్న వెయిటేజీ తక్కువగానే ఉంటోంది. తుది జాబితా రూపకల్పనతో క్యాట్ స్కోర్‌కు వెయిటేజీ 40 శాతంగానే ఉంటోంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు 40 నుంచి 50 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి.
ప్రొఫైల్, పని అనుభవం తదితర అంశాలకు దాదాపు 20 శాతం మేరకు వెయిటేజీ ఇస్తున్నాయి. వెయిటేజీ గణనలో తమ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలన్నా.. అభ్యర్థులు సదరు ఐఐఎంలు పేర్కొన్న విధంగా క్యాట్‌లో సెక్షనల్ కటాఫ్‌లు, మొత్తం కటాఫ్‌ల పరంగా కనీస కటాఫ్ మార్కులు పొందాల్సి ఉంటుంది.
Tags
- CAT 2025
- CAT 2025 Exam Preparation Guidance
- CAT Preparation 2025
- IIM
- MBA Courses
- MBA Management PG courses
- Management courses
- CAT Score
- CAT 2025 Preparation
- CAT Guidance
- Cat preparation books
- CAT preparation syllabus
- CAT preparation online
- Cat preparation courses
- Managementcourses
- IIMadmissionprocess
- CAT2025
- CATExam
- CATcutoff