Skip to main content

CAT Exam: ఐఐఎంల మలిదశ.. మెరిసేదెలా!.. క్యాట్‌లో రాణించేందుకు మార్గాలు..

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌.. క్యాట్‌గా సుపరిచితం! దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ క్యాంపస్‌లలో.. మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! తాజాగా ఈ పరీక్ష ఫలితాలను నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌ ఐఐఎం–కోల్‌కత విడుదల చేసింది!! తదుపరి దశలో ఐఐఎం క్యాంపస్‌లు.. గ్రూప్‌ డిస్కషన్‌ (జీడీ), పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో.. క్యాట్‌ ఉత్తీర్ణులకు మలిదశలో ఎదురయ్యే.. జీడీ, పర్సనల్‌ ఇంటర్వ్యూలో రాణించేందుకు మార్గాలు..
CAT Exam Preparation Tips  IIM Campus Selection Process  CAT Exam Success

క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా ఆయా ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవాలని ఐఐఎంలు పేర్కొంటున్నాయి. అలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. తదుపరి దశలో రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలోనూ విజయం సాధిస్తే.. ఐఐఎంల్లో ప్రవేశం ఖాయమైనట్లే!

గ్రూప్‌ డిస్కషన్‌

మలిదశ ఎంపిక ప్రక్రియకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఆయా ఐఐఎం క్యాంపస్‌లలో గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులను బృందాలుగా ఏర్పాటు చేసి.. ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దానిపై చర్చించమంటారు. ఇందులో కోర్‌ నుంచి కాంటెంపరరీ వరకు అనేక టాపిక్స్‌ ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన పరిణామాలపైనా అవగాహన పెంచుకోవాలి. జీడీలో ఒకే అంశంపై పది లేదా ఇరవై మంది ఉన్న బృందంలో చర్చించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 

చదవండి: Careers After Degree: మేనేజ్‌మెంట్‌ పీజీలో ప్రవేశానికి పలు ఎంట్రన్స్‌ టెస్టులు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో మేలంటున్న నిపుణులు..

రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌

గ్రూప్‌ డిస్కషన్‌ తర్వాత అభ్యర్థులు తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన మరో పరీక్ష.. రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌! ఇందులో నిర్దిష్టంగా ఒక అంశాన్ని పేర్కొని.. అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతున్నారు. సదరు అంశానికి సంబంధించి మూడు నుంచి నాలుగు వందల పదాల్లో అభ్యర్థులు తమ సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇవి సబ్జెక్ట్‌ నాలెడ్జ్, సోషల్‌ అవేర్‌నెస్‌ సమ్మిళితంగా ఉంటున్నాయి. రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌లో అభ్యర్థులు వినియోగించిన పదజాలం, వాక్య నిర్మాణం, స్థూలంగా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా మార్కులు లభిస్తాయి.

చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ

గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో సదరు అభ్యర్థికి మేనేజ్‌మెంట్‌ విద్యపట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, అతని భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు ఎంపిక చేసుకున్న మార్గాలు తదితర అంశాలను నిపుణులైన ప్రొఫెసర్స్‌ కమిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

పీజీపీఎక్స్‌కు కొంత విభిన్నంగా

  • ఐఐఎంల జీడీ/పీఐ ప్రక్రియలో భాగంగా పీజీపీఎం, పీజీపీఎక్స్‌ కోర్సుల మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌లో ఈ వ్యత్యాసం కనిపించకపోయినా.. గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలలో ప్రస్ఫుటమవుతుంది. వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ కచ్చితంగా అవసరమైన పీజీపీఎక్స్‌ కోర్సుకు ఎంపిక పరంగా గ్రూప్‌ డిస్కషన్‌లో ఆయా రంగాల్లో ప్రస్తుత వ్యాపార, వాణిజ్య పరిస్థితులపై అంశాలు ఉంటాయి. 
  • అదే విధంగా పర్సనల్‌ ఇంటర్వ్యూలోనూ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు ఆటో మొబైల్‌ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థికి సదరు రంగంలో తాజా పరిస్థితి, చేసిన ప్రాజెక్ట్‌ ఏంటి, దాని వల్ల కంపెనీకి కలిగిన ప్రయోజనం, ఆటోమొబైల్‌ రంగం నుంచి మేనేజ్‌మెంట్‌ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది. 

‘క్యాట్‌’కు 40 శాతం వెయిటేజీ

మొత్తంగా చూస్తే ఐఐఎంలు క్యాట్‌ స్కోర్‌కు కల్పిస్తున్న వెయిటేజీ తక్కువగానే ఉంటోంది. తుది జాబితా రూపకల్పనతో క్యాట్‌ స్కోర్‌కు 40 శాతం వెయిటేజీ లభిస్తోంది. గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు 40 నుంచి 50 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి.  

జీడీ, పీఐలకు వెయిటేజీ

  • తుది జాబితా ఖరారులో ఐఐఎంలుæ క్యాట్‌ స్కోర్, జీడీ, ఆర్‌ఏటీ, పర్సనల్‌ ఇంటర్వ్యూలలో ప్రతిభతోపాటు మరెన్నో అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. వీటికి కూడా నిర్దిష్ట వెయిటేజీ కేటాయిస్తున్నాయి. వంద మార్కులకు 35 నుంచి 50 శాతం మేరకు జీడీ, పీఐలకు వెయిటేజీ ఉంటోంది. డైవర్సిటీ వెయిటేజీ పేరుతో జండర్‌ డైవర్సిటీ, కల్చరల్‌ డైవర్సిటీలకు మూడు నుంచి అయిదు శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. 

అకడమిక్‌ వెయిటేజీ

పలు ఐఐఎంలు అకడమిక్‌ వెయిటేజీ నిబంధన కూడా అమలు చేస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు ఒక్కో కోర్సుకు ప్రత్యేకంగా వెయిటేజీ ఉంటోంది. అన్ని ఐఐఎంలు ఈ వెయిటేజీని ఒక్కో కోర్సుకు పది శాతంగా పరిగణిస్తున్నాయి. అకడమిక్‌ వెయిటేజీలోనే ప్రొఫెషనల్‌ అర్హతలున్న వారికి ప్రత్యేక వెయిటేజీని కల్పిస్తున్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత ప్రొఫెషనల్‌ కోర్సులు చదివిన విద్యార్థులకు ఈ వెయిటేజీ లభిస్తోంది. ఇది రెండు నుంచి మూడు శాతం మధ్యలో ఉంటోంది.

పని అనుభవానికీ ప్రాధాన్యం

ఐఐఎంలు తుది జాబితా రూపకల్పనలో పని అనుభవానికి కూడా వెయిటేజీ కల్పిస్తున్నాయి. పని అనుభవం ఉన్న వారికి తుది జాబితా రూపకల్పనలో అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ కూడా అభ్యర్థులు పని చేస్తున్న రంగం, పనిచేసిన సంవత్సరాల ఆధారంగా ఉంటోంది. 

మహిళలను ప్రోత్సహించేలా

మేనేజ్‌మెంట్‌ విద్యలో మహిళా విద్యార్థులు చేరేలా ప్రోత్సహించేందుకు ఐఐఎంలు జెండర్‌ డైవర్సిటీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రాథమిక దశలో క్యాట్‌ స్కోర్‌తో పాటు జెండర్‌ వెయిటేజీ, అకడమిక్‌ వెయిటేజీలకు ప్రత్యేక మార్కులు/పాయింట్లు కేటాయిస్తున్నాయి. రెండు నుంచి మూడు పాయింట్ల వరకు మహిళా విద్యార్థులకు కేటాయిస్తున్నారు. 

నాన్‌ ఇంజనీరింగ్‌

క్యాట్‌ స్కోర్‌తోపాటు ఐఐఎంల ప్రవేశాల్లో ఇంజనీరింగ్‌ అభ్యర్థులే ముందంజలో ఉంటున్నారనే అభిప్రాయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐఐఎంలలో నాన్‌–ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అకడమిక్‌ డైవర్సిటీకి కూడా ఈ ఇన్‌స్టిట్యూట్స్‌ పెద్ద పీట వేస్తున్నాయి. నాన్‌–ఇంజనీరింగ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్థులకు కనిష్టంగా 15 శాతం, గరిష్టంగా 30 శాతం వెయిటేజీ కల్పిస్తున్నాయి.

Published date : 15 Jan 2025 08:47AM

Photo Stories