CAT 2023 Results: క్యాట్.. మలిదశలో మెరిసేలా!
- ఇటీవల క్యాట్ 2023 ఫలితాలు వెల్లడి
- ఫిబ్రవరిలో మలిదశ ఎంపిక ప్రక్రియ!
- జీడీ,పీఐ,రిటెన్ ఎబిలిటీ టెస్ట్ కీలకం
ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా..మలిదశలో గ్రూప్ డిస్కషన్(జీడీ), రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ) నిర్వహిస్తున్నాయి. క్యాట్-2023 విజేతలు మలిదశపై సమగ్ర అవగాహన పెంచుకోవడం ద్వారా విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. మలిదశలో ముఖ్యంగా నేర్చుకోవాలనే తపన, నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సానుకూల దృక్పథం తదితర లక్షణాలను పరిశీలిస్తారు.
గ్రూప్ డిస్కషన్
క్యాట్‌లో నిర్దేశిత కటాఫ్ సాధించిన అభ్యర్థులకు మలిదశలో ఆయా ఐఐఎం క్యాంపస్‌లలో నిర్వహించే ఎంపిక ప్రక్రియ.. గ్రూప్ డిస్కషన్. అభ్యర్థులను బృందాలుగా ఏర్పరిచి.. ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దానిపై చర్చించమంటారు. ఇందులో కోర్ నుంచి కాంటెంపరరీ వరకు అనేక టాపిక్స్ అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన పరిణామాలపై అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి. ఇందులో రాణించేందుకు ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా సాధన చేయాలి. అలాగే ఇతరులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినే నైపుణ్యం పెంచుకోవాలి.
చదవండి: CAT 2023 Preparation: క్యాట్ పరీక్ష విధానం.. ఇందులో బెస్ట్ స్కోర్‌కు మార్గాలు ఇవే..
రిటెన్ ఎబిలిటీ టెస్ట్
గ్రూప్ డిస్కషన్ తర్వాత అభ్యర్థులు తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన మరో పరీక్ష.. రిటెన్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో ఏదైనా నిర్దిష్టంగా ఒక అంశాన్ని పేర్కొని.. అభ్యర్థుల అభిప్రాయం లేదా సలహాలు వ్యక్తీకరించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక అంశానికి సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల పదాల మధ్యలో అభ్యర్థులు తమ సమాధానం రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్ అవేర్‌నెస్ సమ్మిళితంగా ఈ ప్రశ్నలు ఉంటున్నాయి. అభ్యర్థులు ముందుగా ఇచ్చిన టాపిక్‌ను సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. దానికి సంబంధించి అన్ని కోణాల్లో తన ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో సిద్ధం చేసుకోవాలి. వాటిని సులభమైన భాషలో రాయగలగాలి. ముఖ్యంగా గ్రామర్, స్పెల్లింగ్ పొరపాట్లు లేకుండా చూసుకోవాలి.
పర్సనల్ ఇంటర్వ్యూ
గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో విజయం సాధించిన అభ్యర్థులు చివరిగా ఎదుర్కోవాల్సిన ప్రక్రియ.. పర్సనల్ ఇంటర్వ్యూ. విద్యార్థికి మేనేజ్‌మెంట్ విద్య పట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, అతని భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు అతను ఎంచుకున్న మార్గాలు వంటి వాటిని తెలుసుకునేలా నిపుణులైన ప్రొఫెసర్స్ కమిటీ ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తుంది. కాబట్టి అభ్యర్థులు తమ కెరీర్ లక్ష్యాలపై పూర్తి స్పష్టతతో ఇంటర్వ్యూకు వెళ్లాలి.
అకడెమిక్ వెయిటేజీ
ఐఐఎంలలో పీజీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో చేరే అభ్యర్థుల తుది ఎంపికకు క్యాట్ స్కోర్, జీడీ, ఆర్‌ఏటీ, పర్సనల్ ఇంటర్వ్యూలలో ప్రతిభతోపాటు మరెన్నో అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తుది ఎంపికలో వాటికి కూడా నిర్దిష్ట వెయిటేజీ కల్పిస్తున్నారు. మొత్తం వంద మార్కుల వెయిటేజీ విధానంలో.. 35 నుంచి 50 శాతం మేరకు జీడీ, పీఐలకు వెయిటేజీ కల్పిస్తున్నారు. డైవర్సిటీ వెయిటేజీ పేరుతో జండర్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీలకు మూడు నుంచి అయిదు శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నారు. పలు ఐఐఎంలు అకడమిక్ వెయిటేజీ నిబంధన కూడా అమలు చేస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు పది శాతం చొప్పున వెయిటేజీ కల్పిస్తున్నారు. అదే విధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి ప్రత్యేక వెయిటేజీని ఇస్తున్నారు. ఈ వెయిటేజీ రెండు నుంచి మూడు శాతం మధ్యలో ఉంటోంది.
వర్క్ ఎక్స్‌పీరియన్స్
ఐఐఎంలు తుది జాబితా రూపకల్పనలో పని అనుభవానికి కూడా వెయిటేజీ కల్పిస్తున్నాయి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ కూడా అభ్యర్థులు పని చేస్తున్న రంగం, మొత్తం అనుభవం గడించిన సంవత్సరాల ఆధారంగా ఉంటోంది.
జండర్ వెయిటేజీ
- జండర్ వెయిటేజీ.. ఐఐఎంలు అనుసరిస్తున్న మరో వినూత్న విధానం. మేనేజ్‌మెంట్ విద్యలో మహిళా విద్యార్థులు చేరేలా ప్రోత్సహించేందుకు జండర్ డైవర్సిటీ విధానాన్ని అమలు చేస్తున్నారు.
- ఐఐఎం కోల్‌కత.. జండర్ డైవర్సిటీ వెయిటేజీ పేరుతో మహిళా విద్యార్థులకు అదనంగా మూడు మార్కులు కేటాయిస్తోంది.
- ఐఐఎం లక్నో.. మహిళా విద్యార్థులకు రెండు పాయింట్లు కేటాయిస్తోంది.
- ఐఐఎం రోహ్‌తక్.. జండర్ డైవర్సిటీ, నాన్-ఇంజనీరింగ్ ఫ్యాక్టర్స్ పేరుతో మొత్తం ఎంపిక ప్రక్రియలో 30పాయింట్లు కేటాయిస్తుండటం విశేషం
- ఐఐఎం రాయ్‌పూర్.. ఎంపిక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీని జండర్ డైవర్సిటీ పేరుతో కేటాయిస్తోంది.
- ఐఐఎం- ఉదయ్‌పూర్ 15 పాయింట్లు; ఐఐఎం-కాశీపూర్ మూడు పాయింట్లు కేటాయిస్తోంది.
అకడమిక్ డైవర్సిటీ
క్యాట్‌లో ఉత్తీర్ణత, ఐఐఎంలలో ప్రవేశ ప్రక్రియలో ఇంజనీరింగ్ అభ్యర్థులుæ ముందంజలో ఉంటున్నారనే అభిప్రాయం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐఐఎంలలో నాన్-ఇంజనీరింగ్ విద్యార్థులకూ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐఐఎంలు అకడమిక్ డైవర్సిటీకి కూడా పెద్ద పీట వేస్తున్నాయి.
Tags
- CAT
- MBA Special
- Management courses
- Management Institutes
- CAT Score
- CAT 2023 Results
- CAT 2023 Online Exam
- Top B Schools Shortlist
- Group Discussion
- Retainability Test
- Personal interview
- Engineering
- PG Management Programs
- Career
- interview
- 10th class
- Intermediate
- Bachelor Degree Courses
- latest notifications
- Sakshi Bhavitha
- MBA Admissions
- IIM Selection Process
- Mock Tests for CAT
- CAT Exam Tips
- Time Management for CAT
- Preparation Tips
- Sakshi Education Latest News