UPSC Civils Toppers: 23 ఏళ్లకే ఐఏఎస్... ఎలాంటి కోచింగ్ లేకుండానే కశ్మీర్ నుంచి సత్తాచాటిన యువతి... నా సక్సెస్ సీక్రెట్ ఇదే...
కాలం మారుతున్న కొద్ది అక్కడి పరిస్థితుల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంటూ ఉండడంతో విద్యాకుసుమాలు వికశిస్తున్నాయి. తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్-2022 ఫలితాల్లో ఆ ప్రాంతం దేశ వ్యాప్తంగా మార్మోగింది. అయితే ఈ సారి ఘర్షణ వార్తలతో కాదు... సివిల్స్ ర్యాంకర్ల పేర్లతో.
☛➤☛ UPSC Civils 110 Ranker Nidhi Pai Interview : నా సక్సెస్ మంత్రం ఇదే
జమ్మూ కశ్మీర్... ఈ పేరు వింటేనే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. జమ్మూ సరిహద్దు ప్రాంతమైన పూంచ్ నుంచి యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా 11వ ర్యాంకుతో ప్రశంజీత్ కౌర్(23) మెరిసింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం విశేషం. ఆమె సక్సెస్ స్టోరీ మీకోసం...
☛➤☛ Civils 22nd Ranker Pavan Datta Interview
ప్రశంజీత్ కౌర్ స్వస్థలం జమ్మూలోని పూంచ్ జిల్లా. ఆమె తండ్రి ఫార్మాసిస్ట్. తల్లి ఇంటిపట్టునే ఉంటుంది. ప్రశంజీత్ కౌర్ విద్యాభ్యాసం అంతా పూంచ్ జిల్లాలోనే సాగింది. చిన్ననాటి నుంచి ఆమె ప్రభుత్వ బడుల్లోనే చదువుకుంది. పూంచ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2020లో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత జమ్మూ యూనివర్సిటీలో 2022లో సైన్స్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేసింది.
☛➤☛ UPSC Civils 3rd Ranker Uma Harathi Interview
మాస్టర్స్ పూర్తవగానే ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవడం ప్రారంభించింది. తన చుట్టుపక్కల జరిగిన అనేక ఘటనలను చూస్తు పెరిగిన కౌర్ పెద్దయ్యాక సివిల్ సర్వీస్‌లో చేరాలని బలంగా నిశ్చయించుకుంది. ఇందుకోసం పాఠశాల వయసు నుంచే ఒక అవగాహనతో చదవడం ప్రారంభించింది.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే జమ్మూ కశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో 32వ ర్యాంకు సాధించింది. అయితే ఆమె మాత్రం సివిల్స్ వైపే మొగ్గుచూపింది. జేకేఏఎస్‌లో కొలువు జాయిన్ అవ్వలేదు. ఎలాగైనా సరే సివిల్స్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో చదివింది.
☛➤☛ Civils 2022: పోలీసు హెడ్ కానిస్టేబుల్‌కు సివిల్స్‌లో 667 ర్యాంకు
తన 23 ఏళ్ల వయసులో రాసిన తొలి ప్రయత్నంలోనే ఆమె విజయం సాధించింది. అది ఎలాంటి కోచింగ్ లేకుండానే. వార్తపత్రికలను ఫాలో అవుతూ సొంతంగా నోట్స్ రాసుకునేదాన్ని అని చెప్తోంది కౌర్. ఒక విషయం గురించి తక్కువ సేపు చదివి.. విస్త`తంగా ఆలోచించినప్పుడే ఆ విషయంపై పూర్తి పట్టు వస్తుందని కౌర్ చెప్తుంది. అలాగే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలనే ఫాలో అయ్యింది.
తన తండ్రి ఫార్మాసిస్ట్ కావడం... తనది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కావడంతో సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్‌గా జువాలజీని ఎంపిక చేసుకుంది. అకడమిక్ ఇయర్స్‌లో చదివిన అనుభవం ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఆమె జువాలజీపై పూర్తి పట్టు సాధించింది. సొంతంగా స్టడీ మెటీరియల్ తయారు చేసుకుంది. రోజుకు ఏడెనిమిది గంటల పాటు చదివేది. అలా ప్రిలిమ్స్, మెయిన్స్‌లో సత్తా చాటింది.
ఇక ఇంటర్వ్యూ మాత్రమే ఉంది. దీన్ని క్రాక్ చేస్తే తన చిన్ననాటి కల తీరినట్లే. కానీ, ఆమెను తెలియని భయం ఏదో చుట్టుముట్టింది. భయాన్ని అధిగమించేందుకు మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేది. ఇంటర్వ్యూలో జమ్ముకశ్మీర్ వ్యవసాయం, భద్రతా అంశాలపై ప్రశ్నలు అడిగనట్లు కౌర్ తెలిపారు.
☛➤☛ Civils: మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడికి సివిల్స్‌లో 410వ ర్యాంకు
సివిల్స్ ప్రిపేరయ్యే అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు మనసులో పెట్టుకోకుండా నిర్ణయించుకున్న లక్ష్యంవైపే అడుగులు వేయాలని కౌర్ చెప్తారు. "మన లక్ష్యం ఎంత పెద్దదైతే, మన మార్గంలో అడ్డంకులు అంత ఎక్కువగా ఉంటాయి. ఎదురుదెబ్బలకు భయపడి వెనకడుగు వేయకూడదు. మన కలలు ఎంత కష్టమైనా పోరాడి సాధించుకోవాలి." అని చెప్తారు. ఎంత సేపు చదివాము అనేదానికంటే చదివింది ఎంతవరకు గుర్తు ఉంచుకుంటున్నాం. దాన్ని ఎలా రాయగలుగుతాం అన్నదానిపైనే మన విజయం ఆధారపడి ఉందని అంటున్నారు కౌర్.