Success story: ఆరేళ్ల కష్టానికి ఫలితం.. ఒకేసారి మూడు కేంద్ర కొలువులు... నా సక్సెస్ సీక్రెట్ ఇదే...
పరీక్షలో ఫెయిలైనా ప్రతీసారి అంతకంటే ఎక్కువ పట్టుదలతో చదవడం ప్రారంభించాడు. అలా ఆరేళ్లపాటు ఎక్కడేకానీ, నిరాశకు లోనవ్వలేదు. అతని కష్టానికి ఫలితం దక్కింది. అలాగే రూ.80 వేల వేతనంతో కొలువూ దక్కింది. అతనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేవంత్. అతని సక్సెస్ స్టోరీ మీ కోసం....
☛➤☛ 36 లక్షల మందిని వెనక్కినెట్టి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన రాజస్థాన్ కుర్రాడు.. ఇతని సక్సెస్ సీక్రెట్ ఇదే...
రుత్తల రేవంత్ ది అనకాపల్లి జిల్లా మాకవరపాలెం. తండ్రి వ్యాపారం, తల్లి గవర్నమెంట్ టీచర్. చిన్ననాటి నుంచే రేవంత్, అతని తమ్ముడు చదువులో ముందుండేవారు. ఇంటర్‌లో 903 మార్కులు సాధించాడు. డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌లో చేరాడు. అప్పటినుంచే ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవ్వడం ప్రారంభించాడు. కాలేజీకి వెళ్లకుండానే ప్రైవేటు కోచింగ్‌వైపు వెళ్లాడు.
డిగ్రీ పూర్తయ్యేలోపే పదుల సంఖ్యలో పోటీ పరీక్షలకు హాజరయ్యాడు. అతనికి చేతినిండా చదువుంది కానీ, అద`ష్టం ఆవగింజంతైనా లేదు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా మెడికల్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యేవాడు. అలా దాదాపు ఆరేడు ఉద్యోగాలు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోవడంతో అతనికి తత్వం బోధపడింది. మెడికల్ టెస్ట్‌లు లేని ఉద్యోగాల వైపు అతను అడుగులేశాడు.
బెంగళూరు, హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లలో కోచింగ్ పూర్తయిన తర్వాత ఇంటి పట్టునే ఉంటూ ప్రిపేర్ అవడం మొదలుపెట్టాడు. రైల్వే, ఎస్‌ఎస్‌ఎస్ సీజీఎల్ పరీక్షలను సీరియస్‌గా తీసుకుని పూర్తిస్థాయిలో వాటిపై దృష్టి పెట్టాడు. కేవలం డిగ్రీ అర్హతతో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకే పోటీపడేవాడు.
☛➤☛ ఇది కదా సక్సెస్ అంటే... రోజుకు 1.6 లక్షలు.. ఏడాదికి 6 కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన కుర్రాడు
అతని కష్టం ఫలించింది. చివరికి అన్ని పరీక్షలూ కలిపి రైల్వే, కాగ్, కస్టమ్స్‌లో ఉద్యోగాలు సంపాదించాడు. రైల్వేలో ట్రెయిన్ మేనేజర్‌గా లెవెల్ 5 జాబ్, కాగ్‌లో అకౌంటెంట్‌గా ఉద్యోగం సాధించాడు. ఇది కూడా లెవెల్ 5 జాబ్. చివరిగా కస్టమ్స్‌లో ఎగ్జామినర్ పోస్టు సంపాదించాడు. ఇది లెవెల్ 7 ఉద్యోగం. ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికవడంతో అతని ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. మూడు ఉద్యోగాలలో అతని చూపు మాత్రం కస్టమ్స్ మీదే ఉంది. దీంతో ఆ ఉద్యోగంలోనే చేరాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో ప్రారంభ వేతనం రూ.80 వేల వరకూ ఉంటుంది.
➤☛ మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
" నా మదిలో ఒకటే ఆలోచన. కేవలం నా దృష్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీదనే ఉండేది. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల పాటు చదివేవాడిని. రాత్రి త్వరగా పడుకుని ఉదయం 4 గంటలకే లేచి ప్రిపరేషన్ మొదలుపెట్టేవాడిని. అలా 11 గంటల వరకు చదివేవాడిని. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని మళ్లీ సాయంత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాడిని. మధ్యమధ్యలో విశ్రాంతికోసం బాడ్మింటన్ ఆడేవాడిని. నా ఆరేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. ఇపుడు నా వయసు 26 ఏళ్లే" అని చెప్తున్నాడు రేవంత్.