UPSC Ranker Taskeen Khan: మిస్ ఇండియా కావాలనుకున్నా... చివరికి సివిల్స్ ర్యాంకు సాధించా.. నా సక్సెస్ జర్నీ ఇదే...
తనకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా కష్టపడి చదివి.. చివరికి లక్ష్యాన్ని చేరుకుంది. ఆమె ఉత్తరాఖండ్‌కు చెందిన తస్కీన్‌ఖాన్... ఆమె సక్సెస్ జర్నీ ఆమె మాటల్లోనే....
చిన్నతనం నుంచి నేను ఆటల్లోనూ, పాటల్లోనూ చురుగ్గా ఉండేదాన్ని. మాది ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్. నా ప్రాథమిక, ఉన్నత విద్య అంతా డెహ్రాడూన్‌లోని కేంద్రీయ విద్యాలయంలో సాగింది. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నా. నాన్న గ్రూప్ డి ఉద్యోగి. ఆయనకు వచ్చే వేతనంతోనే కుటుంబం గడిచేంది. అమ్మ కుటుంబాన్ని చూసుకునేది.
ముందే చెప్పానుగా. చదువులో ఎప్పుడూ ఫస్ట్‌ప్లేస్‌లోనే ఉండేదాన్ని అని. అలా చదివి 2013లో జరిగిన పదో తరగతి పరీక్షలో 92 శాతం, 2015లో 93 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించా. ఆ తర్వాత నిట్ కి కూడా అర్హత సాధించా. కానీ, పరీక్ష ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేకపోవడంతో డిగ్రీ చదవాల్సి వచ్చింది. 2018లో డెహ్రాడూన్లోని దయానంద్ బ్రిజేంద్ర స్వరూప్ కాలేజీలో 75 శాతం మార్కులతో బీఎస్సీ పూర్తి చేశా. అన్నట్లు చెప్పడం మర్చిపోయా నేను బాస్కెట్‌బాల్ చాంపియన్‌ని కూడా. ఇంటర్ వరకు బాస్కెట్‌బాల్ ఆడేదాన్ని. రాష్ట్రస్థాయిలో కూడా సత్తా చాటా.
చదవండి: అదరగొట్టిన యూపీఎస్సీ టాపర్ ఇషితా కిషోర్... ఆమెకు వచ్చిన మార్కులు ఎన్నంటే...
ఇంటర్‌లో 93శాతం మార్కులతో పాసైన అమ్మాయి డిగ్రీలో 75 శాతానికే పరిమితమైంది అన్న అనుమానం వచ్చిందా. నా చిన్ననాటి నుంచి ఒక కల ఉండేది. మిస్ ఇండియాగా ఎంపికవ్వాలని. అందుకు తగ్గట్లుగా నా ప్రయాణం మొదలుపెట్టా. ఇలా 2016, 2017లో మిస్ డెహ్రాడూన్, మిస్ ఉత్తరాఖండ్‌గా ఎంపికయ్యా. దీంతో డిగ్రీలో మార్కులు తగ్గాయి. ఆ తరువాత నా లక్ష్యం మిస్ ఇండియా.
చదవండి: రెండేళ్లపాటు మంచంలోనే... పట్టుదలతో చదివి సివిల్స్‌లో మెరిసింది... ఈమె కథ వింటే కన్నీళ్లే
మిస్ ఇండియా కావాలనుకున్న నా లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టా. అదే సమయంలో నాన్న రిటైర్డ్ అయ్యారు. దీంతో ఆయనకు వచ్చే పింఛన్ ఏ మాత్రం సరిపోయేది కాదు. దీంతో నాన్న ఇక మోడలింగ్ వదిలేసి చదువుపై శ్రద్ధపెట్టాలని సూచించారు. అదే సమయంలో ఇన్‌స్తా(Instagram) ద్వారా ఒక అబ్బాయి ద్వారా సివిల్స్ గురించి తెలుసుకున్నా. ప్రొఫైల్ చెక్ చేస్తే అతను అప్పటికే సివిల్స్ క్రాక్ చేసి Lal Bahadur Shastri National Academy of Administrationలో శిక్షణలో ఉన్నారు. దీంతో నేను సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
చదవండి: ఆరేళ్ల కష్టానికి ఫలితం.. ఒకేసారి మూడు కేంద్ర కొలువులు... నా సక్సెస్ సీక్రెట్ ఇదే...
చదువులోనూ నేను మంచి ప్రతిభావంతురాలినే కాబట్టి కొంచెం శ్రద్ధ, ఏకాగ్రతతో చదివితే సివిల్స్ సాధించొచ్చు అని నిర్ణయించుకున్నా. ఇన్‌స్తా లో చూసిన అబ్బాయి నుంచి కష్టపడి యూపీఎస్సీకి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని, గూగుల్లో వెతికా. కష్టపడితే, చాలా మంచి కెరీర్ ఉంటుందని భావించా. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పా. మా నాన్న, అమ్మ ఇద్దరూ ఫుల్‌గా సపోర్ట్ చేశారు.
దీంతో సివిల్స్‌కు, ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సంస్థల గురించి వెతకడం ప్రారంభించా. అలా ముంబైలోని హజ్ హౌస్, ఢిల్లీలోని జామియా ఆర్సీఏ గురించి తెలుసుకున్నా. ఎన్సీఈఆర్టీ సిలబస్, గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా పరిశీలించి ఒక అవగాహనకు వచ్చా.
చదవండి: జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు... వరుసగా 35 సార్లు ఫెయిల్... చివరికి ఐఏఎస్ సాధించానిలా
అలా 2019లో నా ప్రిపరేషన్ ప్రారంభించా. మొదట్లో ఈజీగా సాధించేస్తా అనుకున్నా. కానీ, ఫస్ట్ అటెంప్ట్‌లోనే తెలిసింది పరీక్ష ఎంత టఫ్‌గా ఉంటుందో అని. అవగాహన కోసం యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలతో పాటు హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్ స్టేట్ సర్వీస్ పరీక్షలు కూడా రాశా. కానీ, నా టార్గెట్ మాత్రం సివిల్స్.
2019 నుంచి రాస్తూ ఉన్నా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్‌లలోనూ ఫెయిలయ్యా. తప్పులనుంచి చాలా నేర్చుకున్నా. ఈ ప్రయత్నంలో ఎలాంటి తప్పులకు చోటివ్వకూడదు అని బలంగా ఫిక్సయ్యా. అలా రోజుకు 8-9 గంటల పాటు చదవడం ప్రారంభించా. ఎలాంటి ప్రశ్నలు వస్తాయో కూడా అంచనా వేసుకునేదాన్ని. అలా నాలుగో ప్రయత్నానికి సిద్ధమై పరీక్ష రాశా. ప్రిలిమ్స్, మెయిన్స్ కి సెలక్ట్ అయ్యా. కానీ, ఇంటర్వ్యూకి వచ్చే సరికి భయం వేసింది.
చదవండి: IAS Divyanshu Choudhary: బ్యాంకు జాబ్ వదిలేసి.. ఐఏఎస్ సాధించిన కుర్రాడు
2022లో మంచిగా ప్రిపేరయ్యే సమయంలో మా నాన్న జబ్బు పడ్డారు. దీంతో ప్రతి రెండు రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి మీరట్‌కు వెళ్లాల్సి వచ్చింది. అలా ఆ ఏడాది సివిల్స్‌లో ర్యాంకు సాధించలేకపోయా. 2023లో మాత్రం ఒత్తిడిని జయించి, సీనియర్స్ సలహాలతో ఇంటర్వ్యూకు హాజరయ్యా. అన్నింటికి జయించి చివరికి యూపీఎస్సీ 2022 పరీక్షలో 736వ ర్యాంకు సాధించా.
➤☛ ఐఏఎస్ కావాలనుకున్నాడు... ఇప్పుడు టీ అమ్ముతూ 150 కోట్లు సంపాదిస్తున్నాడు
ర్యాంకు సాధించిన అనంతరం తస్కీన్ మాట్లాడుతూ.... "నా పేరుకు "సంతృప్తి" అని అర్థం. నాకు వచ్చిన ఫలితంతో నేను సంతృప్తి చెందా. నాకు కేటాయించిన సేవలో చేరి నా కుటుంబాన్ని ఆదుకోవడమే నా ప్రధాన లక్ష్యం. మన దగ్గర ఉన్న వాటితో మన ప్రజలకు, దేశానికి ఎలా సేవ చేయవచ్చో ఆలోచిస్తా. నా తల్లిదండ్రుల వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా. కష్టాలు, పోరాటాలు మానవ జీవితంలో భాగమే. నేను ప్రిలిమ్స్, మెయిన్స్‌కు సన్నద్ధమయ్యే సమయంలో నాన్న ఐసీయూలో ఉన్నారు. యూపీఎస్సీ పరీక్ష చాలా కష్టంగా ఉంటుంది. దీనికి కృషి అవసరం. నాలుగో ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉంది." అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.