Skip to main content

Layoffs In 2023: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ఊచకోత.. కొన్ని లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఇవే.. కార‌ణం ఏమిటంటే..!

కోవిడ్‌ పరిణామాల్లో దాదాపు అన్ని రంగాల సంస్థలు, తమ కార్యకలాపాలను డిజిటలైజేషన్‌ చేశాయి.
Impact on startups and tech industry  Tech job demand  Remote work concept  Startups Layoffs Over 2.24 Lakh Employees in 2023  Online education and e-learning

ఈకామర్స్‌ కొనుగోళ్లు అధికంగా జరిగాయి. లాక్‌డౌన్‌ల కారణంగా, ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న వారు సామాజిక మాధ్యమాలను, యూట్యూబ్‌లో వీడియోలను ఎక్కువగా తిలకించారు. ఆన్‌లైన్‌లోనే పాఠ్యాంశాలు బోధించే ఎడ్యుటెక్‌ సంస్థలకూ అమిత డిమాండ్‌ ఏర్పడింది. 
దీంతో సాంకేతిక నిపుణులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇందువల్లే అంతర్జాతీయ సంస్థలైన మెటా, గూగుల్‌, అమెజాన్‌, యాక్సెంచర్‌, కాగ్నిజెంట్‌ లాంటి వాటితో పాటు దేశీయంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి సంస్థలతో పాటు చాలా స్టార్టప్‌ కంపెనీలు తమకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. 

2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్‌ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి.. ఎందుకు తొలగించాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Moon Lighting: మూన్‌ లైటింగ్‌.. ఏడాదికి రూ.2.5 కోట్లు సంపాదించిన ఐటీ ఉద్యోగి.. అత‌ను ఎవ‌రంటే..!

‘లేఆఫ్స్‌.ఫై(Layoffs.fyi)’ డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్‌ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసిన స్టార్టప్‌లలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్‌చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్‌షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), సాప్‌ ల్యాబ్స్ (300), అప్‌గ్రేడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), డంజో (500), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్‌ట్రామార్క్‌ (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్‌బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), ఎంపీఎల్‌ (350) మొదలైనవి ఉన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 2,24,508 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం, కాస్ట్‌కటింగ్‌ వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి.

Net Direct tax collections: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.10.64 లక్షల కోట్లు

Published date : 26 Dec 2023 01:42PM

Photo Stories