Net Direct tax collections: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.10.64 లక్షల కోట్లు
Sakshi Education
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్- నవంబరు) ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.10.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
Net direct tax collection at Rs 10.64 lakh cr in Apr-Nov
ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 58.34 శాతంగా నమోదైంది. 2022-23 ఏప్రిల్- నవంబరు వసూళ్లతో పోలిస్తే 23.4 శాతం అధికమని ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల కింద రూ.18.23 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో రూ.15.38 లక్షల కోట్లు రావొచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.