GST collections in October: రికార్డ్ స్థాయిలో అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు
గత ఏడాది అక్టోబర్‌లో పోల్చితే ఈ పరిమాణం 13 శాతం అధికంకాగా, 2017 జూలైలో ప్రారంభం తర్వాత ఇవి రెండవ భారీ స్థాయి వసూళ్లు. ఇంతక్రితం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ప్రారంభ నెల ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల రికార్డు స్థాయి వసూళ్లు జరిగాయి. ఎకానమీ క్రియాశీలత, పన్నుల ఎగవేతలను అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు, వసూళ్ల వ్యవస్థలో సామర్థ్యం పెంపు, పండుగల డిమాండ్ తాజా సానుకూల వసూళ్లకు కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి.
India needs 10% growth to Reach China: చైనా ఆర్థిక స్థాయిని చేరుకోవాలంటే 10 శాతం వృద్ధి అవసరం
విభాగాల వారీగా..
మొత్తం వసూళ్లు రూ.1,72,003 కోట్లు.
ఇందులో సీజీఎస్‌టీ వాటా రూ.30,062 కోట్లు.
స్టేట్ జీఎస్‌టీ వసూళ్లు రూ.38,171 కోట్లు
ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.91,315 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.42,127 కోట్లతో సహా)
సెస్ రూ.12,456 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.1,294 కోట్ల వసూళ్లుసహా)
India set to be World's Third-largest Economy: మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్