GST Collections: పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు.. తాజా గణాంకాల్లోని ముఖ్యాంశాలివే..
సమీక్షా నెల్లో (2022 మే నెలతో పోల్చి) 12 శాతం వృద్ధితో రూ.1.57 లక్షల కోట్లకు పైగా వసూళ్లు నమోదయినట్లు జూన్ 1న విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగున్నట్లు ఈ ఫలితాలు పేర్కొంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్చిలో వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లుకాగా, ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో (2017 జూలైలో ప్రారంభమైన తర్వాత ఎన్నడూ లేనంతగా) రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. ఇక రూ.1.4 లక్షలకోట్ల పైన వసూళ్లు వరుసగా 14వ నెల. తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే..
☛ మొత్తం వసూళ్లు రూ.1,57,090 కోట్లు.
☛ సెంట్రల్ జీఎస్‌టీ రూ.28,411 కోట్లు.
☛ స్టేట్ జీఎస్‌టీ రూ.35,828 కోట్లు.
☛ ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.81,363 కోట్లు.
☛ సెస్ రూ.11,489 కోట్లు.
RBI: ఆర్‌బీఐ రుణరేటు తగ్గే అవకాశం.. అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ దిగ్గజం అంచనా..!