Maharashtra Election Results Live Updates: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్‌డేట్స్ ఇవే..
Sakshi Education
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
మహారాష్ట్రలో 288 స్థానాల ఉన్న శాసనసభకు నవంబర్ 20వ తేదీ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. నవంబర్ 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతుంది.
మహాయుతి తొలి విజయం నమోదు
- మహారాష్ట్రలో మహాయుతి తొలి విజయం
- వడాలలో 59,764 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కాళిదాస్ నీలకంఠ్ గెలుపు
- 25న శాసనసభా పక్ష సమావేశం
- 26న సీఎం ప్రమాణ స్వీకారం
- బరిలో కీలక పార్టీల ముగ్గురు నేతలు
- ముందంజలో ఫడ్నవిస్
- సీఎం ఎవరనేది కూర్చొని చర్చిస్తామన్న షిండే
- అజిత్ పవార్ ఆశయమే సీఎం కావడమని, అది నెరవేర్చాలని కోరుతున్న ఆయన వర్గం
14:32 PM
నిరాశలో ఇండియా కూటమి
- మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాభవం
- 50 స్థానాలకు పడిపోయిన మహా వికాస్ అఘాడి
- ప్రజల నుంచి ఉద్దవ్ శివసేన, పవార్ ఎన్సీపీలకు తిరస్కారం
- ఎన్డీయే 50 శాతానికి పైగా ఓట్ షేర్
- బీజేపీ 23%, అజిత్ పవార్ పార్టీకి 14%, 13% షిండే శివసేన
- కాంగ్రెస్ 9%, ఉద్దవ్ శివసేన 10%, శరద్ పవార్ 11%
12:58 PM
మహా సీఎం కుర్చీ.. సూపర్ ట్విస్ట్
- మహారాష్ట్రలో షిండే ఫిట్టింగ్
- తదుపరి సీఎం ఎవరనేది చర్చ
- రేసులో అతిపెద్ద పార్టీ బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవిస్
- అతిపెద్ద పార్టీకే సీఎం సీటు రూల్ లేదుకదా అంటున్న ఏక్‌నాథ్ షిండే
- అందరం కూర్చుని చర్చిస్తామన్న షిండే
- తమ నేతకే ఇవ్వాలని డిమాండ్ లేవనెత్తిన అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం
- ప్రభుత్వ ఏర్పాటునకు మరో 72 గంటలకే గడువు
- ఈలోపు సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగే అవకాశం
12:58 PM
తదుపరి సీఎం ఎవరు?
- మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి హవా
- మళ్లీ అధికారం చేపట్టబోతున్న ఎన్డీయే కూటమి
- తదుపరి సీఎం ఎవరనేదానిపై మొదలైన చర్చ
- షిండే వారసుడి ఎంపికపై రకరకాల విశ్లేషణలు
- మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఎక్కువ ఛాన్స్!
- మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించిన బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్
- ఫడ్నవిస్ ఇంట సంబురాలు
- కాసేపట్లో ఫడ్నవిస్‌తో భేటీ కానున్న మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే
12:03 PM
ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే కసరత్తు
మహారాష్ట్రలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం
- ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ సాధించిన ఎన్డీయే కూటమి
- సంబరాల్లో మునిగిపోయిన మహాయుతి కూటమి శ్రేణులు
- ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే కసరత్తు
- ఇండియా కూటమికి ఘోర పరాభవం
- 50 సీట్లకు పడిపోయిన మహా వికాస్ అఘాడీ కూటమి
- శరద్, ఉద్దవ్ వర్గానికి గట్టి షాక్ ఇచ్చిన మరాఠీలు
- సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ
11:48AM
‘ఈవీఎంలను ఎన్డీయే ట్యాంపరింగ్ చేసింది’
- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ సంచలన ఆరోపణలు
- ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన(UBT) నేత సంజయ్ రౌత్
- ఇది ప్రజాతీర్పు కాదు
- ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు
- లోక్‌సభ ఎన్నికల్లో మాకే స్పష్టమైన ఆధిక్యం వచ్చింది
- మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది
10:41AM
ఎంవీఏకు ఘోర పరాభవం
- మహారాష్ట్రలో ఘోర పరాభవం దిశగా మహా వికాస్ అఘాడి
- శివసేన, ఎన్‌సీపీలలో చీలిక
- శివసేన నుంచి ఉద్దవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గం
- ఎన్‌సీపీ నుంచి శరద్ పవార్, అజిత్ పవార్ వర్గం
- మహాయుతి(ఎన్డీయే)తో జత కట్టిన షిండే శివసేన, అజిత్ ఎన్‌సీపీ
- మహా వికాస్ అఘాడితో కలిసి నడిచిన పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన
- పవార్, ఉద్దవ్‌లను ఓడించిన మరాఠీలు
10:36AM
డబుల్ సెంచరీ దాటిన మహాయుతి
- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హవా
- 210 స్థానాల్లో లీడ్‌లో దూసుకుపోతున్న మహాయుతి అభ్యర్థులు
- ఆధిక్యం పెంచుకుంటూ పోతున్న కీలక నేతలు
- 67 స్థానాల్లో ఆధిక్యంలో మహా వికాస్ అఘాడి అభ్యర్థులు
- 11 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
10:19AM
192 లీడ్‌లో మహాయుతి
- మహారాష్ట్రంలో మళ్లీ ఆధిక్యంలోకి మహాయుతి(NDA) కూటమి
- లీడ్‌లో కొనసాగుతున్న కూటమిలోని కీలక నేతలు
- లీడ్‌లో.. మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్టీయే
- 288 స్థానాల్లో.. 192 లీడ్‌లో ఎన్డీయే
- 81 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్న మహా వికాస్ అఘాడి (INDIA)
- ఐదు స్థానాలో ఇతరుల ఆధిక్యం
09:56AM
మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే కూటమి
- మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే కూటమి
- 150కి పైగా స్థానాల్లో దూసుకుపోతున్న మహాయుతి కూటమి
- 98 స్థానాల్లో ఎంవీఏ కూటమి ముందంజ
09:35AM
మహారాష్ట్రలో క్షణక్షణం మారుతున్న ట్రెండ్స్
- ఆధిక్యంలో సిద్ధిఖీ తనయుడు జిశాన్
- బాంద్రా ఈస్ట్ ఎన్సీపీ(అజిత్) వర్గం నుంచి జిశాన్ పోటీ
- ఔరంగాబాద్‌లో మజ్లిస్ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ ముందజ
- వర్లిలో అదిత్య థాక్రే ముందంజ
- నాగ్‌పూర్ సౌత్ నుంచి ఫడ్నవీస్ ముందంజ
09:20AM
మహా కౌంటింగ్.. హోరాహోరీ
- మహా ఫలితాలపై క్షణక్షణం ఉత్కంఠ
- కౌంటింగ్ సాగుతున్న క్రమంలో.. మారుతున్న పరిణామాలు
- మహారాష్ట్రలో హోరాహోరీ
- ఎన్డీయే కూటమి 117
- ఇండియా కూటమి 87
09:17AM
మహారాష్ట్రలో భారీ లీడ్‌లో కొనసాగుతున్న ఎన్డీయే కూటమి
షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్.. ఇలా కీలక నేతలంతా ఆధిక్యంలోనే..
08:45AM
ఎంవీయూ ముందు జాగ్రత్త చర్యలు
- డిజిటల్ సిగ్నేచర్లు సేకరిస్తున్న మహావికాస్ అఘాడీ
- మహారాష్ట్రలో విజయంపై ఎంవీఏ కూటమి ధీమా
- ముందస్తుగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల సంతకాల సేకరణ
- డిజిటల్ సంతకాలు సేకరిస్తున్న కూటమి
- మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంతకాల సేకరణకు జాప్యం కాకుండా ముందస్తు చర్యలు
- గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపుల్లో ఉంచేందుకు.. అవసరమైతే ఛార్టెడ్ ఫ్లైట్‌లలో తరలించేందుకు సిద్ధం!
- పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిశీలకులను కాంగ్రెస్
- పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, డాక్టర్ జి.పరమేశ్వరను మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులుగా నియామకం.
08:41AM
లీడ్‌లోకి వచ్చిన అజిత్ పవార్
- బారామతిలో లీడింగ్‌లోకి వచ్చిన అజిత్ పవార్
- నాగ్‌పూర్ సౌత్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
- సకోలిలో కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలె ముందంజ
- వర్లీలో ఆదిత్య ఠాక్రే లీడింగ్
- కొప్పిలో ఆధిక్యంలో కొనసాగుతున్న షిండే
08:42AM
ఢిల్లీ బీజేపీ సెంట్రల్ ఆఫీస్‌లో కోలాహలం
- ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జిలేబీలు సిద్ధం
- మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న బీజేపీ నేతలు
- ఈ నేపథ్యంలో సంబరాలు చేసుకునేందుకు మిఠాయిలు సిద్ధం చేయిస్తున్న వైనం
- రెండు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్‌లో లీడ్ సర్వేలు ఎన్డీయే వైపే మొగ్గు
08:40AM
మొదలైన క్యాంప్ రాజకీయాలు
- మొదలైన క్యాంప్ రాజకీయాలు
- మహారాష్ట్రలో కౌంటింగ్ కంటే ముందే మొదలైన క్యాంప్ రాజకీయాలు
- ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే శిబిరానికి తరలించాలని మహా వికాస్ అఘాడీ నిర్ణయం
- తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త అని ప్రకటించిన సంజయ్ రౌత్
- స్వతంత్రులు కూడా తమకే మద్దతంటున్న ఎంవీఏ కూటమి
08:28AM
పోస్టల్ బ్యాలెట్‌లో..
- కోప్రిలో సీఎం ఏక్‌నాథ్ షిండే ఆధిక్యం
- బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెనుకంజ
08:24AM
కౌంటింగ్‌పై ‘మహా’ ఉత్కంఠ
- కాసేపటి కిందటే ప్రారంభమైన మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్
- బారామతిలోని కౌంటింగ్ సెంటర్ వద్ద దృశ్యాలు
- ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్
- మహయుతి కూటమి నుంచి ఎన్సీపీ(అజిత్) తరఫున పోటీ
- ఎన్సీపీ(పవార్) వర్గం నుంచి పోటీ చేస్తున్న యుగేంద్ర శ్రీనివాస్ పవార్
08:17AM
కౌంటింగ్ ప్రాంభం
- ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ మొదలుట్టిన కౌంటింగ్ సిబ్బంది
- ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు
- కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు
- కింగ్ మేకర్ ఎవరు?
- మరికొద్ది గంటల్లో వీడనున్న మహా ఉత్కంఠ
08:02AM
Published date : 23 Nov 2024 03:03PM
Tags
- Maharashtra Election Results Live Updates
- Maharashtra Election Results
- Maharashtra Assembly Elections
- Maharashtra Assembly Election Results
- Assembly Election Results 2024
- Assembly Election Results
- BJP
- congress
- NCP
- Election Results 2024 LIVE
- 2024 Assembly Election Results LIVE
- election results
- Assembly Elections 2024
- Sakshi Education Updates
- LivePollUpdates
- ElectionNewsMaharashtra