Gold Bar: గిన్నిస్ రికార్డ్.. దుబాయ్‌లో 300 కిలోల బంగారు దిమ్మె
Sakshi Education
ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛమైన బంగారు దిమ్మె(Gold Bar)ను దుబాయ్‌లో ఆవిష్కరించారు.
300.12 కిలోల బరువుతో, ఈ బంగారు దిమ్మె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. దీనిని ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ ఎల్‌ఎల్‌సీ తయారుచేసింది. దీని విలువ భారత కరెన్సీలో అక్షరాలుగా రూ.211 కోట్లు.
గతంలో 250 కిలోల బంగారు దిమ్మె తయారుచేసిన రికార్డు జపాన్ పేరిట ఉండేది. ఇప్పుడు, దుబాయ్ ఈ రికార్డును అధిగమించి, ప్రపంచంలో అతిపెద్ద బంగారు దిమ్మె తయారీని పూర్తి చేసింది.
ఈ బంగారు దిమ్మె తయారీకి 8-10 గంటల సమయం పట్టినట్లు ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ డిప్యూటీ జనరల్ మేనేజర్ మహమ్మద్ ఖర్సా తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్‌టెన్షన్‌లో ఈ బంగారు దిమ్మె ప్రదర్శించబడింది.
Published date : 10 Dec 2024 09:37AM