Skip to main content

TTD Jobs : టీటీడీలో ఉండే జాబ్స్‌కు ఇవే.. ఎంపిక విధానం ఇలా.. వేత‌నం ఎంతంటే..!

స‌హ‌జంగా ప్ర‌తీ ఒక్క‌రికీ కొన్ని ల‌క్ష్యాలు ఉంటాయి. వాటికి అనుకూలంగానే న‌డుస్తుంటారు. మ‌రికొంద‌రు చ‌దివిన చ‌దువుకు త‌గిన ఉద్యోగాలు చేస్తుంటారు. మ‌రికొంద‌రు ఇలా వివిధ రకాల ఉద్యోగాలు చేస్తుంటారు. కొన్ని ఉద్యోగాల గురించి చాలామందికి అస‌లు అవ‌గాహ‌న కూడా ఉండ‌దు. అటువంటిదే టీటీడీలో వివిధ శాఖ‌ల్లో పోస్టులు..
TTD job recruitment process and salaries

సాక్షిఎడ్యుకేష‌న్: ప్ర‌తీ రోజు వేలాది, ల‌క్షలాది భ‌క్తులు తిరుమ‌ల‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తూనే ఉంటారు. భ‌క్తులైతే వ‌స్తూ వెళుతూ ఉంటారు. కాని, అక్క‌డి సిబ్బంది మాత్రం అక్క‌డే ఉంటారు. అక్క‌డే ఉద్యోగం చేస్తుంటారు. ఇది చాలామంది గ‌మ‌నించి అస‌లు వాళేం ప‌ని చేస్తుంటారు? అక్క‌డ మ‌న‌కు ఎంద‌రో సిబ్బంది క‌నిపిస్తారు. వారి వృత్తి ఏంటి?

Mohammed al-Bashir: సిరియా ఆపద్ధర్మ ప్రధానిగా నియమితులైన‌ బషీర్

అసలిక్క‌డ ప‌ని చేయాలంటే, ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలి..? ఎదైనా ప‌రీక్ష‌లు రాయాలా.. ఇలా, అనేక ప్ర‌శ్న‌లు అనేక మంది ప్ర‌జ‌ల్లో మెలుగుతుంటాయి.. వాటికి స‌మాధ‌నం ఒక‌సారి ప‌రిశీలిద్దాం..

టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆధ్వర్యంలోని పలు సంస్థలతో పాటు ఆలయానికి సంబంధించిన పలు విభాగాల్లో పనిచేసేందుకు సిబ్బంది అవసరం ఉంటుంది. అయితే, ఈ పోస్టులను టీటీడీ అవసరాన్ని బట్టి శాశ్వత ప్రతిపాదికన, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేస్తూ ఉంటుంది.

Supreme Court Judgments: ఈ ఏడాది దేశ గతిని మార్చిన 10 సుప్రీంకోర్టు తీర్పులు ఇవే..

ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్ ప్రకటనలు ఇవ్వడం, లేదా వారి అధికారిక వెబ్‌సైట్ https://ttd-recruitment.aptonline.in/లో వివరాల‌ను పోస్ట్ చేయ‌డం, వివిధ ర‌కాలుగా ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌జ‌ల్లోకి చేర్చ‌డం చేస్తుంటారు. అంతేకాదు.. టీటీడీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రచునార్థం సమాచారాన్ని అందజేస్తూ ఉంటుంది.

వేత‌నం విధానం..

ఉదాహరణకు తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలకు పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి 84 అదనపు పోటు (ఆలయ వంటగది) కార్మికులను ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన నియమించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో 74 మంది వైష్ణవుల నెలవారీ వేతనం ఒక్కో కార్మికునికి రూ. 42,137.52 చొప్పున(74 మందికి రూ. 31.18 లక్షలు), 10 మంది వైష్ణవేతరుల వేతనం ఒక్కో కార్మికుడికి రూ. 41,767 చొప్పున (10 మందికి రూ. 4.17 లక్షలు) అందజేస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఉద్యోగ నియామ‌కాలు ఇలా..

ఇక్క‌డ వివిధ శాఖ‌ల్లో వివిధ పోస్టులకు భ‌ర్తీ చేప‌డుతూనే ఉంటుంది టీటీడీ. ఈ రిక్రూట్మెంట్‌లో భాగంగా టెక్నిక‌ల్ పోస్టులు కూడా ఉంటాయి. అంతే కాదు.. టీటీడీ ఆధ్వర్యంలో హాస్పిటల్స్‌లో, విద్యాసంస్థల్లో కూడా అవసరాన్ని బట్టి అక్క‌డ అవ‌స‌ర‌మున్న‌ పోస్టులను భర్తీ చేస్తుంటారు అధికారులు.

Telangana Jobs: ఇలా భర్తీ.. అలా ఖాళీ!.. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన నియామకాలు ఇవే..

అక్క‌డ ఉన్న పోస్టులు, ఉద్యోగాలను బట్టి విద్యార్హతలు ఉంటాయి. ఇక్క‌డ‌, పనిని బట్టి వేతనాలను కూడా భారీగానే అందజేస్తారు. టీటీడీ భర్తీ చేసే ఉద్యోగాల్లో నెలకు లక్షల్లో జీతం చెల్లించేవి కూడా ఉన్నాయి.

ఎంపిక ప్ర‌క్రియ ఇలా..

అర్హులైన వారికి ఆన్‌లైన్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నెగ్గిన వారికి ఇంట‌ర్వ్యూలకు ఎంపిక చేసి, అవ‌స‌ర‌మైన పోస్టుల‌కు నియ‌మిస్తారు. అభ్య‌ర్థి అర్హ‌త‌ల‌ను బ‌ట్టి, వారి ప‌ని తీరును బ‌ట్టి, అవసరాన్ని బట్టి శాశ్వత ప్రతిపాదికన, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేస్తూ ఉంటారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 12 Dec 2024 02:17PM

Photo Stories