Skip to main content

Are Extinct: భూమిని ఢీకొట్టే భారీ గ్రహశకలం.. అదే జరిగితే మానవజాతి అంతం!

గ్రహశకలం.. అత్యంత వేగంగా అంతరిక్షంలో పయనించే ఈ ఖగోళ అద్భుతాన్ని దూరం నుంచి చూసేందుకు అందరూ ఇష్టపడతారు.
ISRO eyes close look at potential earth-impacting asteroid Apophis

దూరం నుంచి దూసుకెళ్తుంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆస్టరాయిడ్‌ ఒకవేళ భూమికి దగ్గరగా వెళ్లినా, పేలినా ఊహించలేని వినాశనం జరుగుతుంది. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా సాక్షిభూతంగా నిల్చింది. 

1908 జూన్‌ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు ధాటికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2,200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అయితే 2029 ఏప్రిల్‌ 13న అపోఫిస్‌ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. 

370 మీటర్ల వెడల్పు కలిగిన ఈ గ్రహశకలం 2036లో మరోసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఒకవేళ 10 కిలోమీటర్ల వెడల్పు గల గ్రహశకలం భూమిని ఢీకొడితే, దాని వల్ల వెలువడే భారీ ఉష్ణోగ్రతలకు కొన్ని జీవ జాతులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డైనోసార్ల అంతానికి కూడా ఇలాంటి ఘటనే కారణమైందని వారి నమ్మకం.

NISAR Mission: హిమాలయాల భూకంప మండలాలను అన్వేషించే ప్రయత్నం!

ఈ ఖగోళ ప్రమాదాల నుంచి భూమిని రక్షించుకోవడానికి సంపన్న దేశాలు కృషి చేస్తున్నాయి. భారత్ కూడా వెనుకబడలేదు. రెండేళ్ల క్రితం డార్ట్ అనే వ్యోమనౌక ద్వారా డైమార్ఫస్ అనే గ్రహశకలం ఢీకొట్టడం ద్వారా దాని కక్ష్యను మార్చడంలో విజయం సాధించింది. ఈ ప్రయోగం ద్వారా గ్రహశకలాలను ఢీకొట్టి వాటి కక్ష్యలను మార్చడంలో మానవాళికి సాంకేతిక సామర్థ్యం పెరిగిందని నిరూపించబడింది.

భవిష్యత్తులో భూమికి ఎలాంటి గ్రహశకల ముప్పు ముంచుకొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సైతం తన వంతు కృషిచేస్తోందని సోమ్‌నాథ్‌ చెప్పారు. 

Carrington Event: పొంచి ఉన్న ‘కారింగ్టన్‌ ఈవెంట్‌’.. మానవాళికి పెను ముప్పు?

Published date : 05 Jul 2024 11:18AM

Photo Stories