Skip to main content

Top 10 Richest Cities in India 2024 : భార‌త్‌లో టాప్‌-10 సంపన్న నగరాలు ఇవే... అలాగే వీటి ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. తెలుగు రాష్ట్రాల‌ నుంచి...

సాక్షి ఎడ్యుకేష‌న్ : భారతదేశంలోని 2024గాను టాప్ 10 సంపన్న నగారాల జాబితా తెరపైకి వచ్చింది. ఆర్థిక బలం, ఉల్లసమైన జీవనశైలికి కేంద్రాలుగా ఉన్న ఈ నగరాలు వ్యాపారం, సాంకేతికత, మౌలిక సదుపాయాలలో ముందున్నాయి.
top 10 richest cities in india 2024

ఈ నేప‌థ్యంలో ఈ న‌గ‌రాల‌కు ఉన్న ప్రత్యేకత ఏమిటి..?  ఆర్థిక వ్యవస్థలో ఈ న‌గ‌రాలు ఎలా కీలక పాత్ర పోషిస్తున్నాయి...? 
మొద‌లైన ఆస‌క్తిక‌ర‌మైన విశేషాలు మీకోసం... 

టాప్‌-1 ముంబై (మహారాష్ట్ర) : 
భారతదేశంలోని టాప్ 10 సంపన్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో ఉంది. మ‌న‌ దేశ ఆర్థిక రాజధాని అని కూడా మ‌నం పిలుస్తాము. ఈ న‌గ‌రం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లకు నిలయంగా ఉంది. ఈ నగరం 310 బిలియన్ డాలర్లతో దేశంలోని అత్యధిక జీడీపీని కలిగి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తుంది.

టాప్‌-2 ఢిల్లీ : 

new delhi

భారతదేశంలోని సంపన్న నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఈ నగర జీడీపీ 293.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నగరంలో జనాభా దాదాపు 19.8 మిలియన్లు ఉంటారు. రిటైల్, ఐటీ, టూరిజం, ఇంటర్నేషనల్ వాణిజ్యం ఇక్కడ కీలకంగా ఉన్నాయి.

టాప్‌-3 కోల్‌క‌తా (పశ్చిమ బెంగాల్) :

calcutta west bengal details in telugu

భారతదేశంలోని టాప్‌-10 న‌గ‌రాల్లో టాప్‌-3 స్థానంలో అత్యంత సంపన్న నగరంగా కోల్‌క‌తా ఉంది. ఈ నగర జీడీపీ 150 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారతదేశ సంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందింది. కోల్ కతాలో సుమారు 14.8 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఈ నగరం పాత కొత్త అంశాలను మేళవించి ఉంటుంది.

టాప్‌-4 బెంగళూరు (కర్ణాటక) :
భారతదేశంలోని సంపన్న నగరాల్లో బెంగళూరు నగరం నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 12.7 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ నగరం 110 బిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఐటీ ఇండస్ట్రీ విస్తరించింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా కీలకంగా ఉంది.

టాప్‌-5 చెన్నై (తమిళనాడు) :
తమిళనాడు రాజధాని చెన్నై భారతదేశంలోని సంపన్న నగరాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ నగరం 66 బిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉంది. ఇది దేశ జీడీపీలో 1.12%గా ఉంది. దేశంలోని ఓ ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా, ఆటో మోటివ్, ఐటీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ లో అభివృద్ధి చెందుతుంది. ఇక్క‌డ వీటి ద్వారా విస్తారంగా ఉద్యోగ అవకాశాలు వ‌స్తున్నాయి.

టాప్‌-6 హైదరాబాద్ (తెలంగాణ) :

hyd

భారతదేశంలోని సంపన్న నగరాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది. 58 బిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉంది. ఈ మ‌హా నగరం సమాచార సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ పరిశ్రమలకు ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇక్కడ విభిన్న ఉద్యోగ అవకాశాలు అందుతుంటాయి. ఈ నగరంలో 10 మిలియన్ల పైగా జనాభా ఉన్నట్లు అంచనా.

టాప్‌-7 పూణె (మహారాష్ట్ర) :
భారతదేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో మహారాష్ట్ర నుంచి రెండో నగరం పూణె ఏడో స్థానంలో నిలిచింది. ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలవబడే ఈ నగరం ఎడ్యుకేషన్, ఆటోమోటివ్, ఐటీ పరిశ్రమల పవర్ హౌస్ గా ఉంది. ఈ నగరంలో 8.5 మిలియన్ల జనాభా ఉండగా.. దీని జీడీపీ 55 బిలియన్ డాలర్లుగా ఉంది.

టాప్‌-8 అహ్మదాబాద్ (గుజరాత్) :

గుజ‌రాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం 47 బిలియన్ డాలర్ల జీడీపీతో భారతదేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇది టెక్స్ టైల్స్, కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల కేంద్రంగా ఉంది. ఈ నగరంలో జనాభా 7.2 మిలియన్లు ఉన్నట్లు అంచనా.

టాప్‌-9 సూరత్ (గుజరాత్) :
భారతదేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో గుజరాత్‌లోని మరో నగరం సూరత్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలవబడే ఈ నగరంలో డైమండ్ కటింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీ ప్రసిద్ధి చెందింది. 6.7 మిలియన్ల జనాభా ఉన్నట్లు చెబుతున్న ఈ నగరం జీడీపీ 45 బిలియన్ డాలర్లు.

టాప్‌-10 విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) :

visakhapatnam details in telugu

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన‌ విశాఖపట్నం (వైజాగ్) పదో స్థానంలో నిలిచింది. ఉక్కు, పెట్రోలియం, ఐటీ రంగాలకు ప్రసిద్ధి చెందిన విసాఖ జీడీపీ 40 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా దీనిని పిలుస్తారు.

Published date : 17 Sep 2024 04:09PM

Photo Stories