Skip to main content

Currency Values in Countries: ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ కలిగిన దేశం ఏది..?

ప్రపంచంలోనే వివిధ దేశాల్లో కరెన్సీల విలువ ఇలా ఉన్నాయి. మునుపటికంటే కూడా ప్రస్తుతం ఈ దేశాల్లో విలువలు పెరిగాయి. ఆ కరెన్సీ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
Currency Valuses in Top 10 Countries

కరెన్సీ విలువ దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తోంది. వీటి విలువ పెరుగుతున్న కొద్ది దేశం బలమైన ఆర్థికశక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. విలువతోపాటు వాణిజ్యానికి అనువైన కరెన్సీ చలామణిలో ఉంటే ఆ దేశపురోగతే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి  ప్రపంచంలోని 180 కరెన్సీలను అధికారికంగా గుర్తించింది. ఆయా దేశాల ఎగుమతులు, దిగుమతులు, ఫారెక్స్‌ రిజర్వ్‌లు, బంగారు నిల్వలు, రోజువారీ వాణిజ్యం ఆధారంగా నిత్యం కరెన్సీ విలువ మారుతోంది. తాజాగా ప్రపంచంలోనే అధిక విలువైన కరెన్సీ జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది.

NCMC RuPay Prepaid Card: ఇక‌పై పేమెంట్స్ అన్నిటికీ ఒకటే కార్డు.. ప్రత్యేకతలు ఇవే..

అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్‌ డాలర్‌, బ్రిటిష్‌ పౌండ్‌, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్‌ దినార్‌ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్‌ విలువ రూ.270.23కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్‌ దినార్‌ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోందని తెలిసింది.

RBI: లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ.. కనుమరుగు కానున్న 17 బ్యాంకులు..!

విలువైన కరెన్సీలు.. రూపాయిల్లో..

1. కువైట్‌ దినార్‌: రూ.270.23

2. బహ్రెయిన్ దినార్ రూ.220.4

3. ఒమానీ రియాల్ రూ.215.84 

4. జోర్డానియన్ దినార్ రూ.117.10

5. జిబ్రాల్టర్ పౌండ్ రూ.105.52 

6. బ్రిటిష్ పౌండ్ రూ.105.54 

7. కేమ్యాన్‌ ఐలాండ్‌ పౌండ్‌ రూ.99.76 

8. స్విస్ ఫ్రాంక్ రూ.97.54 

9. యూరో రూ.90.80

10. యూఎస్‌ డాలర్‌ రూ.83.10

Budget Session: జనవరి 31 నుంచి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు

అమెరికా డాలర్ ఈ జాబితాలో చివరి స్థానంలో  నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌ డాలర్లలో అత్యంత విస్తృతంగా వాణిజ్యం జరుగుతోంది.

Published date : 18 Jan 2024 01:22PM

Photo Stories