Skip to main content

NCMC RuPay Prepaid Card: ఇక‌పై పేమెంట్స్ అన్నిటికీ ఒకటే కార్డు.. ప్రత్యేకతలు ఇవే..

మెట్రో, బస్సు, రైలు, ఏటీఎం, టోల్‌, పార్కింగ్‌.. ఇలా ప్రతిదానికి ప్రత్యేకించి కార్డులుంటాయి.
Bank of Baroda  All-in-One Payment Solution  Bank of Baroda Introduces NCMC RuPay Prepaid Card    One Nation, One Card

వీటన్నింటిని వెంట తీసుకుని వెళ్లడం కొంత చికాకుతో కూడిన వ్యవహారమే. అయితే అన్ని రకాల చెల్లింపులకు ఒకే కార్డు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ (ఎన్‌సీఎంసీ) రూపే రీలోడబుల్‌ ప్రీపెయిడ్‌ కార్డ్‌ను తీసుకొచ్చింది. ‘వన్‌ నేషన్‌, వన్‌ కార్డ్‌’ చొరవతోనే ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని పేమెంట్ల కోసం ఒకే కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. 

వినియోగదారులకు బ్యాంక్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఎన్‌సీఎమ్‌సీ కార్డుతో మెట్రో, బస్సు, రైలు, క్యాబ్ ప్రయాణాల టికెట్లను కొనుగోలు చేయొచ్చు. టోల్‌, పార్కింగ్‌ లాంటి సమయంలోనూ ఈ కాంటాక్ట్‌లెస్‌ కార్డు ఉపయోగపడుతుందని బ్యాంక్‌ అధికారులు తెలిపారు. ఏటీఎం విత్‌డ్రాతో పాటూ పాయింట్ ఆఫ్ సేల్, ఈ-కామర్స్ చెల్లింపుల కోసం కూడా ఈ కార్డును ఉపయోగించవచ్చని చెప్పారు. 

ఈ ఎన్‌సీఎమ్‌సీ కార్డుతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ లావాదేవీలు చేసుకోవచ్చని బ్యాంకు పేర్కొంది. ఆన్‌లైన్‌ వాలెట్ బ్యాలెన్స్‌ గరిష్ఠంగా రూ.లక్ష వరకు, ఆఫ్‌లైన్‌ వాలెట్‌లో అయితే రూ.2వేలుగా పరిమితిని నిర్ణయించింది. బ్యాంక్‌ ప్రత్యేక పోర్టల్‌ ద్వారా కార్డు దారులు డబ్బును లోడ్‌/ రీలోడ్‌ చేసుకోవచ్చు.

విద్యార్ధులకు Bank of Baroda బంపరాఫర్‌!.. ప్రయోజనాలు ఇవే..

Published date : 04 Jan 2024 09:02AM

Photo Stories