Skip to main content

Job Mela: రేపు జాబ్ మేళా.. రూ.3 లక్షల వ‌ర‌కు జీతం..

నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు సెప్టెంబ‌ర్ 12వ తేదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Job Mela in Warangal District Warangal District Job Mela announcement Job fair for young women and men in Warangal District  Warangal District Employment Officer CH Umarani statement Job Mela event details Warangal September 12 Job fair starting at 11 am in Warangal District

దీనికి సంబంధించిన వివ‌రాల‌ను వరంగల్ జిల్లా ఉపాధి కల్పనా అధికారి సీహెచ్ ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయి.  వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఈ జాబ్ మేళా జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుంది.

➤ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.

ఖాళీల వివ‌రాలివే.. 
➤ హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వ‌ర్చువల్ కేర్‌గా పనిచేయుటకు 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారికి వార్షిక వేతనం 2.2 లక్షల నుంచి 2.8 లక్షల వరకు ఉంటుంది.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళాకు ఆహ్వానం

➤ హైదరాబాదులోని ఎస్ బ్యాంక్‌లో 20 సీనియర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.3 లక్షల వరకు ఉంటుంది. 

➤ హైదరాబాద్, వరంగల్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీలో 20  బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారికి వార్షిక వేతనం 2.16 లక్షలు ఉంటుంది.

➤ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా.. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో  బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేయుటకు 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.3.12 లక్షల వరకు ఉంటుంది. 

అర్హతలు: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, 22 నుంచి 30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 
ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా, విద్యా అర్హత జిరాక్స్ కాపీలు, పాస్ ఫోటోలతో జాబ్ మేళాకు హాజరు కావాలి.
మరిన్ని వివరాల కోసం.. 70931 68464 నెంబర్‌ను సంప్రదించ‌వ‌చ్చు. 

BHEL Apprentice Recruitment: భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Published date : 11 Sep 2024 02:49PM

Photo Stories