రూపాయి సింబల్ ₹, డాలర్ $, పౌండ్ £...వీటి వెనుక కథ ఏమిటంటే...
దీని సింబల్ హిందీలోని 'र' అక్షరాన్ని పోలివుంటుంది. రూపాయిలోని ‘ర’ ను ఆధారంగా చేసుకుని ఈ సింబల్ రూపొందించారు. ఇక డాలర్ విషయానికొస్తే 'D' అక్షరంతో మొదలవుతుంది. అయితే దీనిని 'S'అక్షరం మాదిరిగా ఎందుకు రాస్తారు? పౌండ్ విషయంలోనూ ఇటువంటి సందేహమే వస్తుంది. ఇది 'L' అక్షరం మాదిరిగా కనిపిస్తుంది.
ఇలా ఉండటం వెనుక కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా డాలర్, బ్రిటన్ పౌండ్ విషయానికొస్తే డాలర్ గుర్తు $, పౌండ్ గుర్తు £ గా కనిపిస్తుంది. మనదేశ కరెన్సీ రూపాయిలోని తొలి అక్షరం 'R'. దీనికి దేవనాగరిలోని 'र'కలిపి ₹గా రూపొందించారు. దీనిని ఉదయ్ కుమార్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ సింబల్ రూపకల్పనకు ప్రభుత్వం ఒక పోటీని నిర్వహించి, చివరికి ₹ చిహ్నాన్ని ఎంపిక చేసింది.
డాలర్‌కు $ సింబల్ ఎలా వచ్చిందంటే..
హిస్టరీ వెబ్‌సైట్ రిపోర్టు ప్రకారం సౌత్ అమెరికాలో స్పానిష్ ఎక్స్‌ప్లోరర్స్‌కు భారీ మొత్తంలో వెండి లభ్యమయ్యింది.దీంతో స్పానిష్ ప్రజలు ఆ వెండితో నాణాలు తయారుచేయించుకోవడం ప్రారంభించారు. వీటిని peso de ocho అని అనేవారు. దీనికి షార్ట్ పదంగా 'pesos'అని పిలిచేవారు. అలాగే రాసేటప్పుడు దానిని ps అని రాసేవారు. మొదట్లో ఎస్ అక్షరంపై పి ఉంచారు. ఆ తరువాత పి అక్షరంలోని నిలువు గీతను మాత్రమే ఉంచి దానిని $ సింబల్‌గా మార్చారు.
పౌండ్ సైన్ అలా ఎందుకుంటుందంటే...
ఇప్పుడు పౌండ్ సైన్ £ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. లాటిన్ భాషల్ 1 పౌండ్‌ను Libra అని అంటారు. ఈ లిబ్రాలో L నుంచి స్టర్లింగ్ సింబల్ £ రూపొందింది.