Birsa Munda: చిన్న వయసులో ఆదివాసీ యోధునిగా ఎదిగిన బిర్సా ముండా
అటవీ ప్రాంతంలోని గిరిజనుల భూముల హక్కులను పరిరక్షించే చట్టాలను ప్రవేశ పెట్టాలంటూ బిర్సా ముండా పోరాటం సాగించాడు. కేవలం 25 ఏళ్లు మాత్రమే జీవించిన ఈ ఆదివాసీ యోధుడు గిరిజన నాయకునిగా, స్వాతంత్ర సమర యోధునిగా గుర్తింపు పొందాడు.
బీహార్, జార్ఖండ్ చుట్టు పక్కల నివసించిన ఈయన జాతీయ ఉద్యమంపై ఎనలేని ప్రభావం చూపాడు. బిర్సా ముండా పుట్టిన రోజున 2000లో ఆయనకు తగిన గౌరవాన్ని అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.
చదవండి: Serum Institute: సినిమాల నిర్మాణంలోకి ప్రవేశిస్తున్న ‘సీరమ్’
1875, నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ బిర్సాముండా 1886 నుండి 1890 వరకూ మిషనరీకి, ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
గిరిజనులకు తగిన శిక్షణ ఇచ్చి, వారిని బ్రిటీషర్లపై పోరాడే యోధులుగా తీర్చిదిద్దాడు. 1900, మార్చి 3న బిర్సా ముండా జామ్ కోపాయ్ అడవిలో నిద్రిస్తున్న సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిని అరెస్ట్ చేశారు. బిర్సాముండాను జైలులో పెట్టిన కొద్ది రోజులకే కన్నుమూశాడు.
Tags
- Birsa Munda
- Birsa Munda Jayanti 2024
- Munda Tribe
- British rule
- Birsa Munda was born in which state
- Janjatiya Gaurav Divas
- Tribal Pride Day
- Tribal Land Rights
- British Soldiers
- Jamkopai Forest
- Birsa Munda Jayanti
- Tribal Activist
- Birsa Munda Central Jail
- Jharkhand State
- Jharkhand State Formation
- Birth Anniversary of Tribal Leader Birsa Munda
- Current Affairs
- Telugu Current Affairs
- national current affairs