Skip to main content

NISAR Mission: హిమాలయాల భూకంప మండలాలను అన్వేషించే ప్రయత్నం!

నిసార్ మిషన్(NISAR Mission) హిమాలయాల భూకంప మండలాలను అన్వేషించే ఒక అంతర్జాతీయ ప్రయత్నం చేసింది.
Himalayan seismic zone mapped by NISAR Mission  NISAR to map Himalayas' Seismic Zones  Scientists analyzing NISAR Mission data

నిసార్ (NASA ISRO Synthetic Aperture Radar) అనేది నాసా, ఇస్రో మధ్య భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న ఒక కృత్రిమ ఉపగ్రహ పరిశోధనా ప్రయోగం. ఈ లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) అబ్జర్వేటరీ మిషన్ హిమాలయాల భూకంప మండలాలను అధ్యయనం చేయడానికి రెండు భిన్నమైన రాడార్ ఫ్రీక్వెన్సీలను (L-బ్యాండ్, S-బ్యాండ్) ఉపయోగిస్తుంది.

నిసార్ యొక్క ప్రాముఖ్యత ఇదే..
➤ ఇది మన గ్రహం యొక్క ఉపరితలంలోని మార్పులను కొలవడానికి రెండు రాడార్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించే మొదటి ఉపగ్రహం.
➤ భూమి, మంచు ఉపరితలాలను అత్యంత ఖచ్చితమైన వివరాలతో పరిశీలించడానికి ఇన్‌సార్‌(Interferometric Synthetic Aperture Radar) టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

China National Space Administration: చంద్రుడి ఉపరితలం భూమి వైపు కంటే అక్క‌డే గట్టిగా ఉంది!!

నిసార్ యొక్క ప్రయోజనాలు ఇవే..
➤ భూమి యొక్క క్రస్ట్, మంచు పలకలు, పర్యావరణ వ్యవస్థలు, భూగర్భజల స్థాయిల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది.
➤ హిమానీనదాలు, మంచు పలకల కదలికలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.
➤ భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన హెచ్చరికలను అందించడంలో సహాయపడుతుంది.
➤ అడవులు, వ్యవసాయ భూములను పర్యవేక్షించడానికి, భూమి యొక్క కార్బన్ చక్రాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.

Published date : 13 Jun 2024 10:11AM

Photo Stories