Skip to main content

TAX Benifits: ఇవి పాటిస్తే ప‌న్ను నుంచి గ‌ట్టెక్క‌వ‌చ్చు... ఉద్యోగస్తులు ఇలా చేస్తే ఉప‌శ‌మ‌నం

సాక్షి, ఎడ్యుకేష‌న్: బ‌డ్జెట్‌లో వేత‌న జీవుల‌కు ఆశించిన మేర ఉప‌శ‌మ‌నం క‌లగ‌లేద‌నే చెప్పాలి. ఉద్యోగ‌స్తుల జీతాల నుంచి ఇన్‌కం ట్యాక్స్‌ను ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే కొన్ని మార్పులు, చేర్పులు పాటిస్తే ప‌న్ను పోటు నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అవేవో ఇక్క‌డ చూద్దాం ప‌దండి.
TAX Benifits
TAX Benifits

కరువు భత్యం, కరువు భత్యం అలవెన్సు .. ఈ రెండింటిని బేసిక్‌ జీతంలో కలిసేలా ఒప్పందం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటి అద్దె అలవెన్సు, గ్రాట్యుటీ, పెన్షన్‌ కమ్యుటెడ్‌ మీద పన్ను భారం తగ్గుతుంది. 
► జీతం మీద నిర్ణయించిన కమిషన్‌ శాతం ఫిక్స్‌డ్‌గా ఉండాలి. కమిషన్‌ని జీతంలో భాగంగా పరిగణిస్తారు.
► యజమాని సహకరిస్తే కొన్ని చెల్లింపులను బిల్లులు సబ్మిట్‌ చేసి తీసుకోండి. అంటే.. రీయింబర్స్‌మెంటులాగా. 

చ‌ద‌వండి: ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల డేట్ వ‌చ్చేసింది
► పెర్క్స్‌ని తీసుకుని లబ్ధి పొందడం చాలా ఉపయోగం. అలవెన్సులు వద్దు. వాటి మీద పన్ను భారం ఉంటుంది. 
► పెర్క్స్‌ అంటే .. ఇంట్లో టెలిఫోన్, కంప్యూటర్, పర్సనల్‌ ల్యాప్‌టాప్, కొన్ని చరాస్తులను ఇంట్లో వాడుకోవడం.. ఆఫీసులో పనివేళల్లో రిఫ్రెష్‌మెంట్లు.. మొదలైనవి.  వీటి మీద పన్ను భారం ఉండదు.
► ఆఫీసు కారు మీ స్వంత పని మీద వాడుకున్నా ఇబ్బంది ఉండదు. అలా అని దుర్వినియోగం చేయొద్దు.
► మీ యజమాని మీ తరఫున చెల్లించే పీఎఫ్‌ చందా 12 శాతం వరకు ఇవ్వొచ్చు.  
► 80సీ సేవింగ్స్‌ మీ ఇష్టం. మీ వీలును బట్టి చేయండి. 

చ‌ద‌వండి: శ్రీవారి భ‌క్తుల‌కు బిగ్‌ అల‌ర్ట్‌... ఇక‌పై అలిపిరి వ‌ద్దే టోకెన్లు
► హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు కావాలంటే ఇల్లు మీ పేరు మీద కాకుండా, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద క్లెయిమ్‌ చేయండి. వారు అసలు ట్యాక్స్‌ బ్రాకెట్‌లో లేకపోతే మీకు ఎంతో ప్రయోజనం. 
► కొన్ని కంపెనీల్లో వారికి మీ సేవలు కావాలి. మీ హోదా.. అంటే మీరు ఉద్యోగా? కన్సల్టెంటా అన్నది ముఖ్యం కాదు. అలాంటప్పుడు కన్సల్టెంటుగా ఉండండి. అప్పుడు 10 శాతం పన్ను డిడక్ట్‌ చేస్తారు. మీ ఖర్చుల్ని బట్టి మీ నికర ఆదాయాన్ని మీరే లెక్కించుకోవచ్చు.

Published date : 14 Apr 2023 06:08PM

Photo Stories