BCCI Records: బీసీసీఐ జీఎస్టీ చెల్లింపులు రూ.2038 కోట్లు
ఆగస్టు 6వ తేదీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎగువసభలోని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ ద్వారా 2022–23, 2023–24 ఈ రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను 28 శాతం జీఎస్టీ రూపంలో బోర్డు స్థూలంగా రూ.2038.55 కోట్లు చెల్లించిందని లిఖితపూర్వకంగా రాజ్యసభలో తెలిపారు. ఆదాయపన్ను శాఖ నుంచి చారిటీలకు వర్తింపచేస్తున్న మినహాయింపును బీసీసీఐకి తొలగించడంతో ఈ మేరకు బోర్డు చెల్లించిందని మంత్రి పంకజ్ చౌదరి వివరించారు.
కాగా బీసీసీఐ ‘తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 1975’కు లోబడి రిజిస్టరైన సంస్థ. అయితే ఇన్నాళ్లు చారిటీల గొడుగుకింద సెక్షన్ 11 ప్రకారం పన్ను మినహాయింపు పొందేది. అయితే ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని ఆయన చెప్పారు. అలాగే కేంద్ర క్రీడా శాఖ నుంచి ఎలాంటి గ్రాంట్లు, నిధులు, పథకాలు క్రికెట్ బోర్డు పొందడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
IPL 2024: బీసీసీఐ కీలక ప్రకటన.. ఐపీఎల్ 2024 విజయానికి కారణమైన వారికి భారీ బహుమతి!