Kho Kho World Cup: ఖోఖో ప్రపంచకప్‌లో.. భారత్ ‘డబుల్' ధమాకా
Sakshi Education
అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్రామీణ క్రీడ భోభో తొలి ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు ఆదరగొట్టింది.

మహిళల విభాగంతో పాటు పురుషుల విభాగంలోనూ భారత జట్టే విజేతగా అవతరించింది.
- న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో, భారత జట్టు 78-40 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టును ఓడించింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఖోఖో ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
- పురుషుల ఫైనల్లోనూ, భారత్ 54-36 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపై విజయం సాధించింది.
- భారత జట్టుకు చెందిన ప్రియాంక, ప్రతీక్ 'బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ద టోర్నీ' అవార్డులు గెల్చుకున్నారు.
IND W vs IRE W: వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత జట్టు.. ఐర్లాండ్‌ను 304 రన్స్ తేడాతో..
Published date : 20 Jan 2025 03:49PM