Champions Trophy: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మేనేజర్‌గా హెచ్సీఏ కార్యదర్శి దేవ్ రాజ్
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కార్యదర్శి ఆర్.దేవ్‌రాజ్ మేనేజర్‌గా ఎంపికయ్యారు.

ఫిబ్రవరి 19 నుంచి జరగనున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నారు.
'టీమిండియాకు నన్ను మేనేజర్గా నియమించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత భారత జట్టుకు మేనేజర్గా వ్యవహరించే అవకాశం హెచ్సీఏ అధికారికి లభించింది. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను' అని దేవ్రాజ్ అన్నారు.
IND W vs IRE W: వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత జట్టు.. ఐర్లాండ్‌ను 304 రన్స్ తేడాతో..
Published date : 20 Jan 2025 01:10PM