Skip to main content

AP Assembly Budget Sessions 2024: 2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

Andhra Pradesh state budget highlights 2024
Andhra Pradesh state budget highlights 2024

అచ్చెన్న నోట అబద్ధాలు

  • వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
  • రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌
  • జగన్‌ హయాంలో సాఫీగా సాగిన రైతు బీమా
  • బడ్జెట్‌ టైంలో అచ్చెన్న నోట అబద్ధాలు
  • గత ప్రభుత్వం రైతుల పంటలకు బీమా అందించలేదు: అచ్చెన్న
  • వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తాం: అచ్చెన్న

మిగతా వాటిల్లో..

  • ఏపీ రహదారులు రంగానికి రూ.9,554 కోట్ల కేటాయింపు
  • పర్యాటక రంగానికి 322 కోట్ల కేటాయింపు

పవన్‌ శాఖలకు భారీగా..

  • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు
  • పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ 16.739 కోట్లు
  • అటవీ పర్యావరణ శాఖకు 687 కోట్లు

👉:  ఏపీ బడ్జెట్ 2024 పూర్తి కాపీ కోసం క్లిక్‌ చేయండి

బడ్జెట్‌లో అప్పు ఇలా..

  • ఈ ఏడాది 91,443 కోట్లు ప్రజా అప్పులు చెయ్యాలని నిర్ణయం
  • బడ్జెట్ లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం
  • 2 లక్షల 1 వెయ్యి కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా
  • 24,498 కోట్లు అప్పులు చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం

 

ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు

  • 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..
  • ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు
  •  రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..
  • పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు
  • జలవనరులు రూ.16,705 కోట్లు..
  • ఉన్నత విద్య రూ.2326 కోట్లు..
  • పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..
  • ఇంధన రంగం రూ.8,207 కోట్లు..
  • పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..
  • బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..
  • మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..
  • ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..
  • అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..
  • గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..
  • నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.

ఊహించినట్లే సాగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

  • వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌
  • 2, 94, 427  కోట్ల తో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్
  • రెవెన్యూ లోటు 34,743 కోట్లు
  • ద్రవ్య లోటు 68,742 కోట్లు
  • గత ప్రభుత్వంపై ఆరోపణలతోనే ప్రసంగం మొదలుపెట్టిన పయ్యావుల
  • పతనం అంచున ఆర్థిక వ్యవస్థ : మంత్రి పయ్యావుల
  • విభజన నాటి విషయాల ప్రస్తావన కూడా
  • సమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలి : మంత్రి పయ్యావుల
  • శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగింది : మంత్రి పయ్యావుల
  • రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది : మంత్రి పయ్యావుల
  • గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది.. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదు : మంత్రి పయ్యావుల
  • గత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసింది.. తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగింది: మంత్రి పయ్యావుల
  • రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది : మంత్రి పయ్యావుల
  • 93 శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగింది : మంత్రి పయ్యావుల


 

2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్

  • ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • 10 నుంచి 15 రోజులపాటు సమావేశాలు సాగించే యోచనలో కూటమి ప్రభుత్వం
  • సమావేశాలకు దూరంగా వైఎస్సార్‌సీపీ

సూపర్‌ సిక్స్‌పై ఏం తేలుస్తారో?

  • డైవర్షన్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్‌గా మారిన ఏపీ
  • తీవ్ర ప్రజాగ్రహం.. అయినా హామీల అమలును పట్టించుకోని చంద్రబాబు
  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సైతం గప్‌చుప్‌
  • వైఎస్సార్‌సీపీపై ప్రతీకార రాజకీయంతోనే ఐదు నెలలు గడిపేసిన కూటమి సర్కార్‌
  • బడ్జెట్‌లో అయినా తేలుస్తారా? నానుస్తారా?
  • పదిరోజుల పాటు సాగనున్న బడ్జెట్‌ సమావేశాలు
  • గత ప్రభుత్వం మీద ఆరోపణలతోనే కాలం వెల్లదీసే ఛాన్స్‌
  • సూపర్‌ సిక్స్‌పై ఏం తేలుస్తారో?
  • ఇప్పటికే లక్షల్లో పెన్షన్‌దారులకు కోత
  • దీపం-2లోనూ లక్షల మంది  లబ్ధిదారులకు మొండిచేయి
  • అర్హత పేరుతో అడ్డదిడ్డంగా పేర్లను తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం

 

  • అసెంబ్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రులు
  • అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌ చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ మీటింగ్
  • కేబినెట్ మీటింగ్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రులు
  • ఉదయం 10.07 నిమిషాలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
  • మండలిలో  బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ మంత్రి  కొల్లు రవీంద్ర
  • అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు
  • మండలిలో వ్యవసాయ బడ్జెట్ పెట్టనున్న మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ
  • ఓటాన్‌ గడువు ముగుస్తుండడంతో పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కూటమి సర్కార్‌
  • ఈ సమావేశాల్లోనూ డైవర్షన్‌ రాజకీయమే!
  • గత సమావేశాల్లో జగన్‌ ప్రభుత్వంపై నిందలతోనే కాలయాపన
  • జగన్‌ హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని మచ్చుకు కూడా ప్రస్తావించని వైనం
  • బడ్జెట్‌ సెషన్‌లోనూ అదే రిపీటయ్యే అవకాశం!
  • సూపర్‌ సిక్స్‌ను అటకెక్కించి.. ‘అభివృద్ధి’ మాయతో సెషన్‌ను నెట్టుకొచ్చే యత్నం?
  • సమావేశాలకు దూరంగా వైఎస్సార్‌సీపీ.. మీడియా ద్వారానే నిలదీత

 

Published date : 11 Nov 2024 12:40PM

Photo Stories