Budget Issues : బడ్జెట్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయుల తీవ్ర నిరాశ..
అనంతపురం: కేంద్ర బడ్జెట్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నిరాశ కల్గించిందని ప్రొగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) నాయకులు వాపోయారు. యూనియన్ అనంతపురం జిల్లా గౌరవాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఎస్ విధానంలో మార్పులు తెస్తామని చెబుతూనే పాత పెన్షన్ విధానంపై పల్తెత్తుమాట మాట్లాడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
Job Mela: రేపు జాబ్‌మేళా.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం
ఉద్యోగుల ఇన్‌కంట్యాక్స్‌కు సంబంధించి పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పన్నుల విధానానికే రాయితీలు ప్రకటించడం ఉద్యోగులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసేలా ఉందన్నారు. బడ్జెట్‌లో 6 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాల్సి ఉండగా, ప్రస్తుత బడ్జెట్‌లో 3.25 శాతం నిధులు కేటాయించారన్నారు. వచ్చే ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం గడిచిన పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కనీసం ప్రస్తావించలేదన్నారు.
APGLIC : ఏపీజీఎల్‌ఐసీ సమస్యలపై ఎస్టీయూ డిమాండ్..
ద్రవ్యోల్బణం 4 శాతానికి తగ్గిందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి చెప్పారని, అందుకనుగుణంగా ధరలు తగ్గలేదన్నారు. ఇప్పటికైనా మధ్య తరగతి ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ పునరుద్ధరించే దానిపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాత పన్నుల విధానంలో రూ. 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా మినహాయింపు ఇచ్చేలా స్లాబ్ విధానాన్ని సవరించాలన్నారు. కనీసం లక్ష రూపాయలు స్టాండర్డ్ డిటెక్షన్‌గా మినహాయింపులు ఉండాలని కోరారు.